అమెరికా వైట్ హౌస్ సమీపంలో మరోసారి
కాల్పుల కలకలం చెలరేగింది.
స్థానిక సమయం ప్రకారం శనివారం సాయంత్రం
6 గంటల సమయంలో వైట్ హౌస్ వద్ద ఉన్న పలువురు జర్నలిస్టులు తమకు ఒక్కసారిగా తుపాకీకాల్పుల శబ్దం వినిపించినట్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు.
సీక్రెట్ సర్వీస్ సిబ్బంది వెంటనే
వారిని భవనం లోపలికి, ప్రెస్ బ్రీఫింగ్
రూమ్‌లోకి తీసుకెళ్లారు. ఆపై వైట్ హౌస్‌ను
లాక్‌డౌన్ చేశారు.
సుమారు 15 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరిగినట్లు
బీబీసీ భాగస్వామి సీబీఎస్ న్యూస్ పేర్కొంది. ఒకే ఒక్క సాయుధుడు సీక్రెట్ సర్వీస్
ఏజెంట్ల వైపు దూసుకువచ్చి వారిపై కాల్పులు జరిపాడని, ఆ తర్వాత సదరు ఏజెంట్లు ఎదురుకాల్పులు జరిపినట్లు సీబీఎస్ రిపోర్ట్
చేసింది.
17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా అవెన్యూ ప్రాంతంలో ఒక సాయుధుడు తన బ్యాగ్ నుంచి ఆయుధం తీసి కాల్పులు మొదలుపెట్టినట్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ ప్రకటించింది.
‘సీక్రెట్ సర్వీస్ పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో నిందితుడికి గాయాలయ్యాయి. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించగా, అక్కడ అతడు మరణించినట్లు ప్రకటించారు. ఈ కాల్పుల సమయంలో అక్కడ ఉన్న ఒక సాధారణ పౌరుడు కూడా గాయపడ్డారు.
అధికారులకు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటన జరిగిన సమయంలో అధ్యక్షుడు వైట్ హౌస్‌లోనే ఉన్నారు’ అని తన ప్రకటనలో పేర్కొంది.
ట్రంప్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వద్ద ఒక సాయుధుడు కాల్పులు జరిపిన నెల రోజుల తర్వాత ఈ ఘటన జరిగింది.