You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

LIVE ఇజ్రాయెల్-గాజా: హమాస్ దాడిలో 300 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు మృతి... వంద మందికి పైగా కిడ్నాప్

హమాస్ దాడులకు ప్రతి చర్యగా గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ అనేక వైమానిక దాడులు చేసింది. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో గాజాలో నివసించే వారిలో 230 మందికిపైగా మృతి చెందారు. వేయి మందికి పైగా గాయాల పాలయ్యారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. ఇండియా vs ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాపై భారత్ విజయం

    చెన్నై ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

    200 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 41.2 ఓవర్లలో 201 పరుగులు సాధించింది.

    భారత జట్టులో కె.ఎల్.రాహుల్ 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ 116 బంతుల్లో 85 పరుగులు చేసి అవుటయ్యాడు.

    హార్ధిక్ పాండ్యా 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

    అంతకు ముందు ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది.

    టాస్ గెలిచిన ఆసీస్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. బుమ్రా తన రెండో ఓవర్లోనే మిచెల్ మార్ష్‌ను పెవిలియన్ పంపాడు.

    అనంతరం ఆసీస్ బ్యాటర్స్ నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. అయితే 9 పరుగుల వ్యవధిలో జడేజా 3 కీలక వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా కోలుకోలేకపోయింది.

    ఆ తర్వాత వచ్చిన మ్యాక్‌వెల్, కామెరూన్ గ్రీన్ కూడా తొందరగానే పెవిలియన్ చేరడంతో ఆసీస్ తక్కువ స్కోరుకే ఆలౌటైంది.

    ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్మిత్ 46, వార్నర్ 41 పరుగులు చేశారు.

    టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసుకోగా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్‌, బుమ్రాలు రెండేసి వికెట్లు పడగొట్టారు.

  3. ఇజ్రాయెల్-గాజా: 'ఇది కచ్చితంగా ఊచకోతే, దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిందే...' హమాస్ దాడులపై ప్రత్యక్ష సాక్షుల ఆవేదన

  4. రాణిని చంపేందుకు ప్రోత్సహించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్, జస్వంత్‌ సింగ్‌కు 9 ఏళ్ల జైలు శిక్ష

  5. హమాస్ దాడుల షాక్‌లో ఇజ్రాయెల్, తర్వాత ఏం జరగబోతోంది?

  6. ఇజ్రాయెల్: 'పాలస్తీనా మిలిటెంట్లు మా ఇంటి తలుపులు బద్దలు కొడుతుంటే మా ఇద్దరు పిల్లలతో నేను ఓ గదిలో దాక్కున్నాను'

  7. బ్రేకింగ్ న్యూస్, హమాస్ చేతిలో 100 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు, సైనికుల కిడ్నాప్

    ఇజ్రాయెల్‌-గాజాల మధ్య ఘర్షణ కొనసాగుతోంది.

    పాలస్తీనా మిలిటెంట్లు 100 మందికిపైగా ఇజ్రాయెల్ పౌరులు, సైనికులను కిడ్నాప్ చేసి, బందీలుగా తీసుకువెళ్లిందని అమెరికాలోని ఇజ్రాయెల్ ఎంబసీ తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్‌ ఖాతాలో వివరాలు పోస్ట్ చేసింది.

    హమాస్ మిలిటెంట్ల దాడుల్లో 600 మందికిపైగా ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారని, 2,000 మందికి పైగా గాయపడ్డారని ఇజ్రాయెల్ తెలిపింది.

  8. ‘‘గాజాలో 370 మందికి పైగా మృతి’’- పాలస్తీనా అధికారులు

    ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గడిచిన 24 గంటల్లో 370 మంది చనిపోయారని, 2,200 మందికి పైగా గాయపడ్డారని గాజాలోని పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మృతుల్లో 20 మంది పిల్లలు ఉన్నారని తెలిపింది.

    హమాస్ మిలిటరీ స్థావరాలుగా పేర్కొంటున్న అనేక భవనాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తున్న దృశ్యాలను ఇజ్రాయెల్ వైమానిక శాఖ విడుదల చేసింది.

    గాజా నుంచి వస్తున్న సమాచారం తక్కువే అయినా, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫొటోలు, వీడియోల్లో చాలా భవనాలు, ప్రార్థనా మందిరాలు శిథిలమైనట్లు తెలుస్తోంది.

    గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని ఇజ్రాయెల్ అధికారులు చెప్తున్నారు.

  9. క్రికెట్ ప్రపంచ కప్ 2023: సొంతగడ్డపై అభిమానుల కేరింతలతో భారత్ మరోసారి వరల్డ్ కప్ గెలుస్తుందా?

  10. ఇజ్రాయెల్ దాడులు: గాజాలో విధ్వంసం... వందల సంఖ్యలో మృతదేహాలు

    హమాస్ దాడి తర్వాత, ఇజ్రాయెల్ కూడా గాజా ప్రాంతంపై అనేక వైమానిక దాడులు చేసింది.

    ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో గాజాలో నివసించే వారిలో 230 మందికిపైగా మృతి చెందారు. 1000 కంటే ఎక్కువ మంది గాయాల పాలయ్యారు.

    గాజా స్ట్రిప్‌లోని ఏడు వేర్వేరు ప్రాంతాల్లోని ప్రజలను తమ ఇళ్లు విడిచిపెట్టి సిటీ సెంటర్ లేదా షెల్టర్ హోమ్‌లకు వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం కోరింది.

    పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఇళ్లను వదిలి ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న షెల్టర్ హోమ్‌లలోకి వెళ్లిపోయారని ప్రత్యక్ష సాక్షులు బీబీసీకి తెలిపారు.

    గాజాలో ఉండేవారు సోషల్ మీడియాలో అక్కడి పరిస్థితిని వివరిస్తున్నారు.

    గాజాకు విద్యుత్, ఇంధనం, ఇతర వస్తువుల సరఫరా మార్గాలను నిలిపివేస్తామని ఇజ్రాయెల్ తెలిపింది.

    ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం నుంచి ఈ ప్రకటన వచ్చినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి.

    ఇజ్రాయెల్ అధికారులు శనివారం ఇక్కడ విద్యుత్‌ను నిలిపివేశారు.దీంతో శనివారం నుంచి ఇక్కడ అంధకారం నెలకొంది.

  11. ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీ 'మొసాద్' చేసిన 5 డేంజరస్ ఆపరేషన్స్ ఇవే...