You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

LIVE ఇజ్రాయెల్‌పై వేల రాకెట్లతో దాడులు చేసిన హమాస్... గాజాపై ప్రతిదాడికి దిగిన ఇజ్రాయెల్

ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ హమాస్‌కు చెందిన డజన్ల కొద్దీ మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్‌లో ఆకస్మిక దాడికి దిగారు. తమ సాయుధ విభాగం 20 నిమిషాల్లో 5,000 రాకెట్లను ప్రయోగించిందని హమాస్ గ్రూప్ ప్రకటించింది.

లైవ్ కవరేజీ

  1. ఆంధ్రప్రదేశ్ - వరికపూడిశెల ప్రాజెక్ట్‌: ముగ్గురు సీఎంలు.. నాలుగు శంకుస్థాపనలు.. ఈ ప్రాజెక్టు కథేంటి?

  2. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  3. క్రికెట్: వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక స్కోరుతో దక్షిణాఫ్రికా రికార్డు

    భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్ రికార్డు సృష్టించింది.

    శనివారం దిల్లీలోని అరుణ్ జైట్లీ స్డేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 428 పరుగులు చేసి, ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక టీం స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది.

    ఇంతకముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా (417) పేరిట ఉండేది.

    అంతేకాదు వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు కూడా ఇదే మ్యాచ్‌లో బద్దలైంది.

    సౌతాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్‌క్రమ్ కేవలం 49 బంతుల్లోనే సెంచరీ కొట్టి, రికార్డు నెలకొల్పాడు.

  4. దసరా, దీపావళి సేల్స్: ఈఎంఐల్లో వస్తువులు కొంటున్నారా? అయితే తెలుసుకోవాల్సిన విషయాలివే

  5. జ్యోతి సురేఖ: ఆర్చరీ‌లో 3 గోల్డ్ మెడల్స్ సాధించిన ఈ తెలుగు క్రీడాకారిణి నేపథ్యం ఏంటి?

  6. అఫ్గానిస్తాన్‌లో భూకంపం, 15 మంది మృతి

    అఫ్గానిస్తాన్‌లోని పశ్చిమ ప్రాంతంలో శనివారం సాయంత్రం భూకంపం సంభవించడంతో 15 మంది మరణించారని, మరో 78 మంది గాయపడినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

    పశ్చిమ నగరమైన హెరాత్‌కు 40 కిలోమీటర్ల దూరంలో, ఇరాన్ సరిహద్దుకు సమీపంలో 6.3 తీవ్రతతో సాయంత్రం 6:30 గంటలకు భూమి కంపించిందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.

    భూమి నాలుగు సార్లు కంపించిందని, భూకంపం ధాటికి అనేక భవనాలు దెబ్బతిన్నాయని, శిథిలాల కింద ప్రజలు చిక్కుకున్నారని అఫ్గాన్ అధికారులు తెలిపారు.

  7. క్రికెట్: టీమిండియాకు స్పాన్సర్ చేశాక ఆరిపోతున్న కంపెనీలు, అసలేం జరుగుతోంది?

  8. ఏషియన్ గేమ్స్: క్రికెట్‌లో భారత జట్టుకు స్వర్ణం

    ఏషియన్ గేమ్స్‌లో భారత క్రికెట్ జట్టు స్వర్ణం సాధించింది.

    శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ జట్టు 18.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం పడటంతో మ్యాచ్ నిలిపివేశారు.

    అయితే వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్ రద్దు చేసి, మెరుగైన ర్యాంకింగ్, ఉత్తమ ఆటతీరు ప్రకారం టీమిండియాను విజేతగా ప్రకటించారు నిర్వాహకులు.

    మరోవైపు కబడ్డీలో కూడా భారత పురుషుల జట్టు గోల్డ్ గెలిచింది.

    ఫైనల్ మ్యాచ్‌లో ఇరాన్ జట్టును ఓడించి స్వర్ణం సాధించింది.

  9. నార్గెస్ మొహమ్మదీ: 13 సార్లు అరెస్టులు.. 31 ఏళ్ల జైలు శిక్ష...అయినా పోరాటం ఆపని మహిళకు నోబెల్ శాంతి బహుమతి

  10. ఏషియన్ గేమ్స్: బ్యాడ్మింటన్‌లో సాత్విక్, చిరాగ్ జోడీకి స్వర్ణం

    చైనాలోని హౌంగ్జౌలో జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్ మరో స్వర్ణం సాధించింది.

    బ్యాడ్మింటన్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టీ జంటకు ఈ పతకం దక్కింది.

    శనివారం జరిగిన ఫైనల్లో దక్షిణ కొరియా జోడీ చాయ్ సోల్, కిమ్ వోన్ లపై భారత జంట గెలిచి, గోల్డ్ సాధించింది.

    ఏషియన్ గేమ్స్‌లో ఇప్పటివరకు భారత్ 26 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్యాలతో మొత్తం 101 పతకాలు సాధించింది. పతకాల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

  11. బ్రేకింగ్ న్యూస్, గాజాలోని హమాస్ లక్ష్యాలపై సైనిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్

    గాజాలోని హమాస్ టార్గెట్లపై వైమానిక దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి. అయితే, హమస్ దళాలు ఇజ్రాయెల్ ప్రజలను నిర్బంధంలోకి తీసుకున్నట్లు వస్తున్న వార్తలపై ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి స్పందించడానికి నిరాకరించారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

    అంతకుముందు, ఇజ్రాయెల్ మీద గాజా కురిపించిన 'రాకెట్ల వర్షానికి' ప్రతిచర్యగా ఈ దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది.

    గాజా జరిపిన మెరుపుదాడులకు గాయపడిన చాలా మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

    ఆష్కెలాన్‌లోని బార్జిలాయ్ ఆస్పత్రి వర్గాలు తమ వద్ద 68 మంది చికిత్స పొందుతున్నారని, వారిలో కొేందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపాయి.

    అలాగే, బీర్షేవాలోని సరోకా ఆస్పత్రిలో 80 మంది క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.

    పాలస్తీనియన్లు 2,500 రాకెట్లను ఇజ్రాయెల్ ‌మీద ప్రయోగించారని ఇజ్రాయెల్ సైనిక అధికార ప్రతినిధి చెప్పారని రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. పారాగ్లైడర్లతో చొరబడిన పాలస్తీనియన్లు నేల మీద నుంచి, సముద్రం మీద నుంచి రాకెట్లతో దాడి చేశారని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి వెల్లడించారు.

  12. హమాస్ పెద్ద తప్పు చేసిందన్న ఇజ్రాయెల్ రక్షణ మంత్రి

    ఇజ్రాయల్ మీద హమాస్ యుద్ధం ప్రారంభించిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోయావ్ గాలంట్ అన్నారు.

    "హమాస్ భారీ తప్పిదానికి పాల్పడింది. ఈ ఉదయం అది ఇజ్రాయెల్ మీద దాడిని ప్రారంభించింది" అని ఆయన అన్నారు.

    దాడులు జరుగుతున్న ప్రతి చోటా ఐడీఎఫ్ దళాలు పోరాటానికి దిగాయని, ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో గెలుస్తుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

    ఊహించని రీతిలో గాజా దాడులకు పాల్పడడంతో 'యుద్ధానికి సన్నద్ధం కావాలి' అని ప్రకటిస్తున్నామని ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపాయి.

  13. ఇజ్రాయె‌ల్‌పై గాజా నుంచి దాడులు.. 20 నిమిషాల్లో 5 వేల రాకెట్ల ప్రయోగం

    ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ హమాస్‌కు చెందిన డజన్ల కొద్దీ మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్‌లో ఆకస్మిక దాడికి దిగారు.

    ప్రస్తుతం వారు అక్కడ భారీ సంఖ్యలో ఉన్నారు.

    యుద్ధానికి సిద్ధమయ్యామని, దాడులను తిప్పికొట్టేందుకు రిజర్వ్ బలగాలను పిలిచినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.

    దీనికంటే ముందు ఇజ్రాయెల్ వైపు డజన్ల కొద్ది రాకెట్లను ప్రయోగించారు.

    ఇజ్రాయెల్ కూడా గాజాలోని స్థావరాలపై దాడులు చేసింది.

    టెల్ అవీవ్, గాజా పరిసరాల్లో పేలుళ్లకు సంబంధించిన వార్తలు వచ్చాయి. ఇజ్రాయెల్‌లో కూడా ఒకరు చనిపోయారు.

    ఈ దాడులు చేసింది తామేనంటూ పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ప్రకటించింది. తమ సాయుధ విభాగం 20 నిమిషాల్లో 5,000 రాకెట్లను ప్రయోగించిందని పేర్కొంది.

  14. చంద్రయాన్-3: అక్కడ పగలు ముగుస్తోంది...విక్రమ్, ప్రజ్ఞాన్ రోవర్‌లు స్పందించే అవకాశాలు ఇక లేనట్లేనా?

  15. న్యూస్‌క్లిక్‌కు వ్యతిరేకంగా ప్రచురించిన కథనంపై 'న్యూయార్క్ టైమ్స్' బీబీసీతో ఏం చెప్పిందంటే...

  16. ‘నా వక్షోజాలను సర్జరీతో వికారంగా మార్చిన డాక్టర్‌‌కు వ్యతిరేకంగా పోరాడాను... ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష పడేలా చేశాను’

  17. హైదరాబాద్: నిజాం కాలంలోనే కృత్రిమ వర్షాలకు ఎందుకు ప్రయత్నించారు... అప్పుడేం జరిగింది?

  18. ఆసియా క్రీడలు: కబడ్డీ చాంపియన్ భారత మహిళల జట్టు, భారత్ ఖాతాలో 100వ పతకం

    చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 100వ పతకాన్ని కైవసం చేసుకుంది.

    శనివారం జరిగిన కబడ్డీ పోటీల్లో భారత మహిళల జట్టు విజేతగా నిలిచి స్వర్ణాన్ని దక్కించుకుంది.

    దీంతో భారత్ ఖాతాలో 100వ పతకం చేరింది. ఫైనల్లో టీమిండియా 26-25తో చైనీస్ తైపీ జట్టుపై గెలుపొందింది.

  19. ఆసియా క్రీడలు: ఆర్చరీలో జ్యోతి సురేఖ, ఓజస్ ప్రవీణ్‌లకు స్వర్ణాలు

    ఆసియా క్రీడల్లో భారత ఆర్చరీ క్రీడాకారులు మళ్లీ మెరిశారు.

    కాంపౌండ్ విభాగంలో రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యాన్ని సాధించారు.

    శనివారం ఉదయం జరిగిన ఆర్చరీ కాంపౌండ్ మహిళల ఫైనల్లో తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకుంది.

    ఫైనల్లో వెన్నం జ్యోతి సురేఖ (భారత్) 149-145తొ కొరియాకు చెందిన సొ చావెన్‌పై గెలుపొందారు.

    కాంస్య పతక పోరులో భారత ఆర్చర్ స్వామి అదితి గోపీచంద్ (భారత్) 146-140తో రతి జిలిజాతి (ఇండోనేసియా)పై నెగ్గి పతకాన్ని నెగ్గింది.

    పురుషుల కేటగిరీ ఫైనల్లో భారత్‌కే చెందిన ఇద్దరు ఆర్చర్లు తలపడ్డారు.

    అయితే ఓజస్ ప్రవీణ్ చాంపియన్‌గా నిలిచి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.

    ఫైనల్లో అభిషేక్ వర్మ 147-149తో ఓజస్ చేతిలో ఓడిపోయి రజతాన్ని అందుకున్నాడు.