సిక్కిం ఆకస్మిక వరదల్లో 14 మంది మృతి, 102 మంది గల్లంతు
బుధవారం ఉదయం పూట వచ్చిన ఆకస్మిక వరదల కారణంగా ఇప్పటివరకు 14 మంది చనిపోయినట్లు సిక్కిం ప్రభుత్వం నిర్ధారించింది.
మృతులంతా మామూలు పౌరులేనని తెలిపింది. మరో 102 మంది గల్లంతు అయ్యారని చెప్పింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 3 వేలకు పైగా టూరిస్టులు చిక్కుపోయారని ఆందోళన చెందుతున్నారు. చుంగ్తాంగ్‌లోని తీస్తా స్టేజ్ 3 డ్యామ్ మీద పనిచేస్తున్న వారిలో 12-14 మంది టన్నెల్‌లోనే చిక్కుకుపోయారు.