గన్నవరానికి విమానంలో రావడానికి అనుమతి లభించకపోవడంతో రోడ్డు మార్గంలో విజయవాడ వైపు బయలుదేరిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను ఎన్టీఆర్ జిల్లా అనుమంచి పల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
జీ20 శిఖరాగ్ర సదస్సు జాయింట్ డిక్లరేషన్‌పై
సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ప్రకటించారు.
అయితే, ఈ సంయుక్త ప్రకటనలో ఏమేం వివరాలు ఉన్నాయో
ఆయన వెల్లడించలేదు.
యుక్రెయిన్ యుద్ధంపై గ్రూపులో విభేదాలు ఉండటంతో
అసలు జాయింట్ డిక్లరేషన్ వస్తుందా? అనే సందేహాలను నిపుణులు వ్యక్తంచేయడంతో మోదీ
ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
చంద్రబాబు అరెస్ట్: రెండేళ్ల కిందటి ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకపోయినా ఎందుకు అరెస్టు చేశారు? ఆ ఎఫ్ఐఆర్‌లో ఎవరెవరి పేర్లున్నాయి
జీ20 సదస్సు: కోణార్క్ చక్రం ఎదుట విదేశీ నేతలకు ఆహ్వానం.. దీని విశేషాలేంటో తెలుసా?
ఫొటో సోర్స్, G20
న్యూఢిల్లీలోని ప్రగతి
మైదాన్‌లో భారత్ మండపం వద్ద జరుగుతున్న జీ20 సదస్సుకు విదేశాల నుంచి వచ్చిన అధినేతలకు,
ప్రతినిధులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం పలికారు.
విదేశీ
నేతలకు ప్రధాని మోదీ ఆహ్వానం పలికిన వేదిక వెనుకాల అతిపెద్ద కోణార్క్ చక్రాన్ని ఏర్పాటు
చేశారు.
కోణార్క్
చక్రం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు
వివరించారు.
కోణార్క్
చక్రం ప్రత్యేకతలేంటో మనం చూద్దాం..
కళింగా (నేటి
ఒడిశా)లోని కోణార్క్ సూర్య దేవాలయానికి చెందినది ఈ చక్రం. రాజు లాంగుల నరసింహాదేవ్
1 పాలనలో 13వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు.
1238
నుంచి 1264 మధ్య కాలంలో నరసింహాదేవ్ 1 పాలన సాగింది. తన పాలన సమయంలో ఒడిశాలోని సముద్ర
తీరంలో ఉన్న కోణార్క్‌లో సూర్య దేవాలయాన్ని కట్టారు.
హిందూ వాస్తుశిల్పానికి
ఈ ఆలయం ఒక చిహ్నంగా నిలుస్తోంది. ఈ ఆలయంలో మూడు భాగాలుంటాయి.
ప్రధాన
ద్వారంతో, ప్రార్థనా స్థలంతో, నాట్య వేదికతో ఈ ఆలయం అనుసంధానమై ఉంటుంది.
ఆలయం, ప్రార్థనా
స్థలం రథం ఆకారంలో ఉంటాయి. 12-12 మొత్తం 24 చక్రాలుంటాయి. వీటినే చక్రా అని
పిలుస్తారు.
ఏడు
గుర్రాల చేత లాగుతున్నట్లుగా ఉన్న సూర్యుని రథాన్ని ఇది సూచిస్తుంది. యునెస్కో
ప్రపంచ వారసత్వ జాబితాలో కోణార్క్ సూర్యదేవుని ఆలయం చోటు దక్కించుకుంది.
19వ
శతాబ్దంలో బ్రిటిష్ పాలన నుంచి దీన్ని కాపాడేందుకు ఆలయంలోని ప్రధాన భాగంలో మొత్తం
రాళ్లు, ఇనుప కడ్డీలతో నింపారు.
ఆలయం
లోపలున్న ఈ రాళ్లు, ఇసుక, ఇనుమ కడ్డీలను తొలగించాలని భారత పురావస్తు శాఖ 2022లో
నిర్ణయించింది.
ఈ
చక్రం భారత పురాతన పరిజ్ఞానాన్ని,
నాగరికతను, వాస్తుశిల్పాన్ని ప్రదర్శిస్తోంది.
కోణార్క్ చక్రం
పురోగతిని, నిరంతర మార్పును సూచిస్తోంది. కోణార్క్ చక్ర రొటేషన్‌ను కాలచక్రతో పోలుస్తారు.
ఫొటో సోర్స్, Getty Images
మొరాకో భూకంపంలో 600 మందికి పైగా మృతి
ఫొటో సోర్స్, EPA
మొరాకోలో సంభవించిన
భారీ భూకంపంలో మృతుల సంఖ్య 632కి పెరిగినట్లు మొరాకో హోమ్ మంత్రిత్వ శాఖ చెప్పినట్లు
ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసింది.
329 మంది ఈ భూకంపంలో గాయాలు
పాలయ్యారని పేర్కొంది. గాయపడిన వారిలో 51 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు
మంత్రిత్వ శాఖ చెప్పింది.
6.8 తీవ్రతతో మొరాకోలో ఈ భూకంపం
సంభవించిందని మొరాకో హోం మంత్రిత్వశాఖ తెలిపింది.
స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11:11
గంటలకు భూకంపం వచ్చింది.
పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడే చారిత్రాత్మక
నగర మరకేశ్ తీవ్రంగా దెబ్బతింది.
వీధుల్లో గుట్టగుట్టలుగా రాళ్లు
పడి ఉండటాన్ని ఫొటోలలో చూడొచ్చు. నగర ప్రజలు రాత్రంతా వీధుల్లోనే ఉన్నారు.
ఫొటో సోర్స్, Reuters
ఫొటో సోర్స్, AFP
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కాంగ్రెస్ పార్టీ కావాలనే ఓడించిందా, అసలేం జరిగింది?
జీ-20లో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్యం
ఫొటో సోర్స్, G20
జీ-20 సదస్సు తొలి సెషన్‌లో ఆఫ్రికన్ యూనియన్‌కు జీ-20లో
శాశ్వత సభ్యత్వం కల్పిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
జీ-20 శాశ్వత సభ్యదేశం హోదాలో కేటాయించిన కుర్చీలో ఆసీనులు కావాలని ఆఫ్రికన్
యూనియన్ అధినేతను మోదీ ఆహ్వానించారు.
ప్రధాని ఆహ్వానం మేరకు ఆఫ్రికన్ యూనియన్ చైర్‌పర్సన్ అజలి
అసౌమని తన కుర్చీలో ఆసీనులయ్యారు.
ఆయనకు జీ20 శిఖరాగ్ర సదస్సులో
పాల్గొంటోన్న దేశాధినేతలందరూ చప్పట్లతో స్వాగతం పలకగా.. ప్రధాని మోదీ ఆయన్ను
ఆలింగనం చేసుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 1
జీ20 గ్రూప్‌లో అమెరికా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, బ్రిటన్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, తుర్కియేతో కలిపి 19 దేశాలు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ ఈ గ్రూప్‌లో 20వ మెంబర్.
ప్రస్తుతం ఆఫ్రికన్ యూనియన్ కూడా ఈ గ్రూప్ శాశ్వత సభ్యత్వం పొందింది. దీంతో 19 దేశాలు, రెండు యూనియన్లు దీనిలో సభ్యులుగా మారాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
చంద్రబాబు అరెస్ట్: ప్రజలే అండగా ఉండాలన్న భువనేశ్వరి.. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి జోక్యం కోరుతూ లేఖ రాసిన ఎంపీ రామ్మోహన్
జీ20 సదస్సు: ప్రపంచ నేతలకు ఆహ్వానం పలికిన మోదీ, కాసేపట్లో సదస్సు ప్రారంభం
ఫొటో సోర్స్, AIR
ప్రపంచానికి దిశానిర్దేశం
చేసే జీ20 సదస్సు రెండు రోజుల పాటు దేశ రాజధాని దిల్లీలో జరుగనుంది.
మరికాసేపట్లో సదస్సు ప్రారంభం
కానుంది.
ప్రగతి మైదాన్‌లోని భారత
మండపంలో ఈ సదస్సును నిర్వహిస్తారు.
ఈ మేరకు సదస్సు జరుగనున్న
ప్రాంతంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
అందరి కంటే ముందుగానే భారత
మండపానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్
ఆహ్వానం పలికారు.
ఫొటో సోర్స్, ANI
సదస్సులో పాల్గొనేందుకు పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు విచ్చేస్తున్నారు.
వారందరికీ ప్రధాని మోదీ ఆహ్వానం పలికారు.
యూకే ప్రధాని రిషి సునక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో, అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండేజ్, సింగపూర్ ప్రధాని లీ హీన్ లూంగ్ తదితరులను మోదీ స్వాగతించారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా సదస్సులో పాల్గొనేందుకు భారత మండపానికి చేరుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 3
చంద్రబాబు అరెస్ట్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ
మొరాకోలో భూకంపం, 296 మంది మృతి
ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, భూకంపం భయంతో ఇళ్లను వదలి వీధుల్లోకి వచ్చిన కసబ్లాంకా నివాసితులు
మొరాకోలో భారీ భూకంపం
సంభవించింది. 6.8 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం కారణంగా 296 మందికి పైగా చనిపోయారని
మొరాకో హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
మర్రకేశ్ నగరానికి 71
కి.మీ దూరంలోని హై అట్లాస్ పర్వతాల్లో 18.5 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు
అమెరికా జియోలాజికల్ సర్వే చెప్పింది.
స్థానిక కాలమానం ప్రకారం
రాత్రి 11:11 గంటలకు భూకంపం వచ్చింది.
సోషల్ మీడియా మాధ్యమం ‘ఎక్స్’లో
కనిపిస్తోన్న కొన్ని వీడియోల్లో ధ్వంసమైన భవనాలు, వీధులన్నీ రాళ్లతో కనిపిస్తున్నాయి.
ప్రజలంతా భయంతో పారిపోవడం
కూడా వీడియోల్లో చూడొచ్చు.
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.