రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రస్తుతం లక్నో న్యాయవాది అశోక్ పాండే సుప్రీంకోర్టులో తన పిటిషన్ దాఖలు చేశారు.

లైవ్ కవరేజీ

  1. తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న షారుక్ ఖాన్

    శ్రీవారి ఆలయంలో షారుక్ ఖాన్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, శ్రీవారి ఆలయంలో షారుక్ ఖాన్

    ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. షారుక్‌‌తోపాటు ప్రముఖ నటి నయనతార, షారుక్ కుమార్తె సుహానా ఖాన్, దర్శనం చేసుకున్నారు.

    షారుక్ ఖాన్, నయనతార, దీపిక పదుకొణె, విజయ్ సేతుపతి, ప్రియమణి నటించిన ‘జవాన్’ చిత్రం సెప్టెంబరు 7న విడుదల కానుంది. దీనికి తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించారు.

    శ్రీవారి ఆలయంలో షారుక్ ఖాన్

    ఫొటో సోర్స్, ANI

  2. టీచర్స్ డే- సర్వేపల్లి రాధాకృష్ణన్: ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి స్థాయికి..

  3. ముర్రా జాతి గేదెలపై 100 పెడితే 200 ఆదాయం, నాటు గేదెలకూ వీటికీ తేడా ఏంటి?

  4. ఆసియా కప్: నేపాల్‌పై విజయంతో సూపర్-4 చేరిన భారత్

    భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, భారత ఓపెనర్లు రోహిత్ శర్మ 59 బంతుల్లో 74 పరుగులు, శుభ్‌మన్ గిల్ 62 బంతుల్లో 67 పరుగులు చేశారు.

    ఆసియా కప్ టోర్నీలో భాగంగా శ్రీలంకలోని పల్లెకెలెలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో నేపాల్‌పై భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

    ఈ గెలుపుతో టోర్నీలో తర్వాతి దశ అయిన సూపర్-4లో చోటు ఖాయం చేసుకుంది.

    సూపర్‌-4‌లో ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్ స్థానం సంపాదించాయి.

    తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నేపాల్ జట్టులో 58 పరుగులతో ఆసిఫ్ షేక్, 48 పరుగులతో సోమ్‌పాల్ కామి టాప్ స్కోరర్లుగా నిలిచారు.

    భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, 17 బాల్స్ మిగిలి ఉండగానే, భారత్ లక్ష్యాన్ని అందుకుంది.

    వాన వల్ల భారత బ్యాటింగ్ ఆలస్యంగా మొదలైంది.

    వర్షం అంతరాయం కలిగించడం వల్ల, భారత్ ఛేదించాల్సిన లక్ష్యాన్ని డక్‌వర్త్-లూయిస్ పద్ధతి ప్రకారం సవరించారు. 23 ఓవర్లలో 145 పరుగులను లక్ష్యంగా నిర్ణయించారు. ఇంకా 17 బాల్స్ మిగిలి ఉండగానే, భారత్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా లక్ష్యాన్ని అందుకుంది.

    కెప్టెన్ రోహిత్ శర్మ 59 బంతుల్లో 74 పరుగులు, శుభ్‌మన్ గిల్ 62 బంతుల్లో 67 పరుగులు చేశారు.

    సూపర్-4 దశలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు, సెప్టెంబరు 17న జరిగే ఫైనల్లో తలపడతాయి.

  5. గుడ్ మార్నింగ్.

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.