ఆసియా కప్ టోర్నీలో భాగంగా
శ్రీలంకలోని పల్లెకెలెలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో నేపాల్‌పై భారత్ 10 వికెట్ల తేడాతో
ఘన విజయం సాధించింది.
ఈ గెలుపుతో టోర్నీలో తర్వాతి దశ అయిన సూపర్-4లో చోటు ఖాయం
చేసుకుంది.
సూపర్-4లో ఇప్పటికే
పాకిస్తాన్, బంగ్లాదేశ్ స్థానం సంపాదించాయి.
తొలుత బ్యాటింగ్ చేసిన
నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నేపాల్ జట్టులో 58 పరుగులతో ఆసిఫ్
షేక్, 48 పరుగులతో సోమ్‌పాల్ కామి టాప్ స్కోరర్లుగా నిలిచారు.
వాన వల్ల భారత బ్యాటింగ్ ఆలస్యంగా మొదలైంది.
వర్షం అంతరాయం కలిగించడం వల్ల, భారత్ ఛేదించాల్సిన లక్ష్యాన్ని డక్‌వర్త్-లూయిస్ పద్ధతి ప్రకారం సవరించారు. 23 ఓవర్లలో 145 పరుగులను లక్ష్యంగా నిర్ణయించారు. ఇంకా 17 బాల్స్ మిగిలి ఉండగానే, భారత్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా లక్ష్యాన్ని అందుకుంది.
కెప్టెన్ రోహిత్ శర్మ 59 బంతుల్లో 74 పరుగులు, శుభ్‌మన్ గిల్ 62 బంతుల్లో 67 పరుగులు చేశారు.
సూపర్-4 దశలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు, సెప్టెంబరు 17న జరిగే ఫైనల్లో తలపడతాయి.