You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

'సులభ్ ఇంటర్నేషనల్' వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ మృతి

'సులభ్ ఇంటర్నేషనల్' వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ దిల్లీలో కన్నుమూశారు.

లైవ్ కవరేజీ

  1. ‘‘అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో పది నుంచి ఐదుకు’’

    ‘‘2014లో మేం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ పదో స్థానంలో ఉండేది. నేడు ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారింది’’ అని మోదీ చెప్పారు.

    ‘‘మేం అధికారంలోకి వచ్చినప్పుడు అవినీతి రాజ్యమేలేది. మేం దాన్ని కూకటివేళ్లతో పెకలించాం. పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటుచేశాం’’ అని మోదీ చెప్పారు.

    ‘‘దేశంలోని యువత శక్తిసామర్థ్యాలపై నాకు నమ్మకముంది. వారికి శక్తి నిచ్చేందుకు, వారి సామర్థ్యాలను పెంచేందుకు మా విధానాలు కృషి చేస్తున్నాయి. ప్రపంచంలోని అంకుర సంస్థల స్థాపనలో భారత్ మూడో స్థానానికి వెళ్లడానికి ఇక్కడి యువతే కారణం’’ అని మోదీ చెప్పారు.

  2. ‘‘భారత్‌ను ఎవరూ ఆపలేరు’’

    భారత్ పురోగతికి ఎవరూ అడ్డుపడలేరని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.

    ‘‘ప్రపంచ ఆర్థిక నిపుణులు ఈ విషయాన్ని చెబుతున్నారు. అన్ని రేటింగ్ సంస్థలు భారత్ పురోగతిపై ప్రశంసలు కురిపిస్తున్నాయి’’ అని మోదీ చెప్పారు.

    ‘‘కోవిడ్-19 వ్యాప్తి తర్వాత కొత్త భౌగోళిక-రాజకీయ సమీకరణాలు ఏర్పడుతున్నాయి. నేడు భౌగోళిక రాజకీయాల నిర్వచనమే మారుతోంది. నేడు మన దేశంలోని 140 కోట్ల మంది శక్తి సామర్థ్యాలు ప్రపంచ దిశను మారుస్తున్నాయి’’ అని ఆయన చెప్పారు.

    నేడు రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్.. దేశాన్ని మారుస్తున్నాయని మోదీ వివరించారు.

  3. యువత కోసం మోదీ ఏం చెప్పారు?

    డెమొగ్రఫీ, డెమొక్రసీ, డైవర్సిటీ..ఈ మూడింటికీ దేశ లక్ష్యాలను నెరవేర్చే శక్తి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.

    ‘‘నేను గత వెయ్యేళ్ల గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మళ్లీ ఇప్పుడు మన దేశం ముందు ఒక మంచి అవకాశముంది. నేడు మనం తీసుకునే చర్యలు, నిర్ణయాలు తర్వాత 1000 ఏళ్లలో మన మార్గాన్ని నిర్దేశించబోతున్నాయి’’ అని మోదీ చెప్పారు.

    మరోవైపు యువత గురించి మాట్లాడుతూ ‘‘నేడు మీకు అవకాశాలకు కొదువ లేదు. నేడు మీ కోసం మన దేశంలో చాలా అవకాశాలు ఎదురుచూస్తున్నాయి’’ అని మోదీ అన్నారు.

  4. మణిపుర్‌లో శాంతి కోసం పిలుపు

    ‘‘ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాలను ప్రకృతి విపత్తులు అతలాకుతలం చేస్తున్నాయి. వీటికి తీవ్రంగా ప్రభావితం అవుతున్న కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తున్నా’’అని నరేంద్ర మోదీ చెప్పారు.

    మరోవైపు ఎర్రకోటపై నుంచి మణిపుర్‌లో శాంతి కోసం మోదీ పిలుపునిచ్చారు.

    ‘‘నేడు దేశం మొత్తం మణిపుర్ ప్రజలకు అండగా నిలుస్తోంది. ఈ సమస్యకు శాంతి ద్వారా మాత్రమే పరిష్కారం లభిస్తుంది. దీని కోసం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా కృషి చేస్తున్నాయి’’ అని మోదీ చెప్పారు.

  5. ఎర్రకోటపై మోదీ ప్రసంగం మొదలైంది ఇలా..

    77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోటపై జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.

    మొదటగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వారికి ప్రధాని మోదీ నివాళులు అర్పించారు.

    ‘‘నేడు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. జనాభా పరంగా ప్రపంచ దేశాలకు మనం నేతృత్వం వహిస్తున్నాం. ఇంత పెద్ద దేశం నేడు స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటోంది’’ అని చెబుతూ ప్రధాని తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.

  6. స్వాతంత్ర్య దినోత్సవం: దిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రత్యక్ష ప్రసారం

    దిల్లీలోని ఎర్రకోట పైనుంచి 77వ స్వాతంత్ర్య దిన వేడుకలు ప్రత్యక్ష ప్రసారం ఇక్కడ చూడండి.

  7. స్వాతంత్ర్య దినోత్సవం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్ చూడండి ఇలా

    77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్లీలోని ఎర్రకోట పైనుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 7.30కు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

    దిల్లీలో జరిగే వేడుకల కోసం భారత ప్రభుత్వం 1800 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించింది.

    ప్రత్యేక అతిథుల్లో సర్పంచ్‌లు, టీచర్లు, నర్సులు, మత్స్యకారులు, ఖాదీ సిబ్బంది, సెంట్రల్ విస్టా నిర్మాణ కార్మికులు తదితరులు ఉన్నారు.

    మోదీ ఎర్రకోటపై నుంచి ప్రసంగించడం వరుసగా ఇది పదోసారి. ఈ ప్రసంగాన్ని భారత ప్రభుత్వ అధికారిక సోషల్ మీడియా సైట్లతోపాటు బీబీసీ తెలుగు ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలోనూ లైవ్ చూడొచ్చు.

  8. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌కి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసంఈలింక్‌పైక్లిక్ చేయండి.