ఆర్డర్ ఆఫ్ ది నైల్: మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం

ప్రధాని నరేంద్రమోదీని 'ఆర్డర్ ఆఫ్ ది నైల్' గౌరవంతో ఈజిప్ట్ ప్రభుత్వం సత్కరించింది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతే అల్-సిసి ఆదివారం మోదీకి ఈ గౌరవాన్ని అందించారు.

లైవ్ కవరేజీ

  1. ‘చట్టబద్ధమైన పనులను కూడా నేరంగా మారుస్తున్నారు, నిరసన తెలిపితే జైలుకు పంపుతున్నారు’: సుప్రీం కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలపై తీవ్ర చర్చ

  2. అస్సాంలో వరద బీభత్సం, 66కి చేరిన మృతులు

    అస్సాం, వరదలు

    ఫొటో సోర్స్, Avik Chakraborty

    ఫొటో క్యాప్షన్, మొత్తం మరణాల సంఖ్య 66కి చేరినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.

    అస్సాంలో వరద తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో మరో నలుగురు మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 66కి చేరినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ శనివారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొంది.

    పది జిల్లాల్లోని 810 గ్రామాలు ఇంకా వరదనీటిలో చిక్కుకుని ఉన్నాయని అందులో తెలిపింది. ఈ వరదల వల్ల దాదాపు 6.54 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు.

    నిరాశ్రయులైన వారి కోసం వివిధ జిల్లాల్లో మొత్తం 274 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటిలో సుమారు 19,000 మంది ఆశ్రయం పొందుతున్నారు.

    అస్సాం, వరదలు

    ఫొటో సోర్స్, NDRF

    ఫొటో క్యాప్షన్, ఎగువ అస్సాంలోని శివసాగర్ జోర్హాట్ జిల్లాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి.

    ఎగువ అస్సాంలోని శివసాగర్ జోర్హాట్ జిల్లాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. శివసాగర్ జిల్లాలో మరణాలు అత్యధికంగా నమోదయ్యాయి. ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అస్సాం ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు.

    మరోవైపు, బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.

    ప్రస్తుత పరిస్థితి గురించి ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో ఫోన్‌లో మాట్లాడారు. అస్సాంలో ఏటా రుతుపవనాల సమయంలో వరదలు సంభవిస్తుంటాయి,

    అయితే, ఈసారి తీవ్ర వరదలకు నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో సంభవించిన క్లౌడ్ బరస్ట్' కూడా ఓ కారణమని భావిస్తున్నారు.

  3. 'పాక్‌ పాలిత కశ్మీర్‌‌‌'లో చెలరేగిన హింసపై ఐక్యరాజ్యసమితి ఆందోళన, భారత్ వాదనేంటి, పాకిస్తాన్ ఏమంటోంది?

  4. సీజేపీ: వీధి పోరాటం నుంచి విద్యాశాఖ మంత్రి రాజీనామా వరకు.. ఎప్పుడెప్పుడు, ఏం జరిగింది?

  5. ఫ్రాన్స్, స్పెయిన్‌‌లో అడవులు, ఆవాసాలను కాల్చి బూడిద చేస్తున్న కార్చిచ్చు, 11 ఫోటోల్లో..

  6. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారి తీసిన ఐదు కారణాలు ఇవేనా?

  7. సముద్ర గర్భంలో దొరికిన 74 ఏళ్ల కిందటి విమాన ప్రమాద శకలాలు, నేటి సేఫ్టీ నిబంధనలకు ఈ యాక్సిడెంటే కారణమంటారు, ఎందుకంటే..

  8. మనం మళ్లీ కలుస్తాం - ధర్మేంద్ర ప్రధాన్‌ను ఉద్దేశించి కొత్త విద్యాశాఖా మంత్రి ప్రహ్లాద్ జోషీ వ్యాఖ్యలు

    నిరసనలు, రాజీనామా, దిల్లీ, జంతర్ మంతర్

    ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images

    ఫొటో క్యాప్షన్, ప్రహ్లాద్ జోషి

    ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు తనకు అప్పగించడంపై ప్రధాని మోదీకి ప్రహ్లాద్ జోషి ధన్యవాదాలు చెప్పారు.

    ‘‘మోదీ ప్రభుత్వం గత పన్నెండేళ్లలో ఎన్నో చరిత్రత్మక విజయాలు సాధించింది. ప్రధాని మార్గదర్శకత్వంలో నా పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి ప్రయత్నిస్తా’’అని ప్రహ్లాద్ జోషి చెప్పారు.

    ‘‘ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ ప్రస్థానం అనేక దశాబ్దాలనుంచి సాగుతోంది. దేశాభివృద్ధి విషయంలో ఆయన నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తన పదవీకాలంలో ధర్మేంద్ర ప్రధాన్ నూతన విద్యావిధానాన్ని విజయవంతంగా అమలుచేశారు. విద్యారంగంలో వందకు పైగా చిన్నా,పెద్దా సంస్కరణలు ప్రవేశపెట్టారు. జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆయన పదవి నుంచి వైదొలిగినప్పటికీ, దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవను అది మరుగునపడనివ్వదు. దేశ అభివృద్ధి మార్గంలో మనం మళ్లీ కలుస్తాం’’ అని ప్రహ్లాద్ జోషి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

  9. బీజేపీ కార్యకర్తలకు పదవి కన్నా దేశం ముఖ్యం: అమిత్ షా

    ధర్మేంద్ర ప్రధాన్, మోదీ, రాజీనామా

    ఫొటో సోర్స్, Debajyoti Chakraborty/NurPhoto via Getty Images

    ఫొటో క్యాప్షన్, అమిత్ షా

    దేశ యువత మనోభావాలను మోదీ ప్రభుత్వం గౌరవిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ప్రశ్నాపత్రాల లీకులను అరికట్టేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రం కట్టుబడి ఉందని శనివారం రాత్రి అమిత్ షా ‘ఎక్స్’లో రాశారు.

    బీజేపీ కార్యకర్తలకు పదవి కన్నా దేశం, యువత, విద్యార్థులే ముఖ్యమని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దీనికి నిదర్శనమని అమిత్ షా పోస్ట్ చేశారు.

    ప్రశ్నాపత్రాల లీకేజ్‌కు బాధ్యులైనవారికి కఠిన శిక్ష పడేలా ప్రధాని మోదీ తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని అమిత్ షా అన్నారు. ప్రధాని చర్యలు నీట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సంపూర్ణ న్యాయం అందిస్తాయని తనకు నమ్మకముందని అమిత్ షా తెలిపారు.

    ‘‘తన పదవీకాలంలో ధర్మేంద్ర ప్రధాన్ జాతీయ విద్యావిధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, మాతృభాషలో పరీక్షలు నిర్వహించడం, పీఎం శ్రీ పాఠశాలల విస్తరణ, డిజిటల్ విద్యను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ-విద్యాసంస్థల సమన్వయాన్ని బలోపేతం చేయడం వంటి అంశాల్లో కీలక సంస్కరణలు చేపట్టారు. పరీక్షా విధానాన్ని విద్యార్థి కేంద్రీకృతంగా, మరింత సమగ్రంగా తీర్చిదిద్దేందుకు ఆయన చేసిన కృషి ప్రశంసనీయం’’ అని అమిత్ షా తన పోస్టులో రాశారు.

  10. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా: ఇది మోదీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బా లేక ఒక పెద్ద అవకాశమా?

  11. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యా శాఖ బాధ్యతలు

    విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్‌ జోషి

    ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images

    ఫొటో క్యాప్షన్, ప్రహ్లాద్‌ జోషి కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రిగా ఉన్నారు

    కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి విద్యా శాఖ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.

    కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఆ శాఖ బాధ్యతలను జోషీకి అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్రపతి డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు.

    ప్రధాన మంత్రి మోదీ సూచనల మేరకు, విద్యా శాఖ అదనపు బాధ్యతలను ప్రహ్లాద్ జోషీకి అప్పగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

    జోషి ప్రస్తుతం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రిగా ఉన్నారు. ఆయన వద్దే పునరుత్పాదక ఇంధన శాఖ పోర్ట్‌ఫోలియో కూడా ఉంది.

    ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ముర్ము అధికారికంగా ఆమోదించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

  12. సీజేపీ అన్ని డిమాండ్లకు ప్రభుత్వం సంపూర్ణంగా అంగీకరించిందా, బాధిత కుటుంబాలకు పరిహారం గురించి ఏం చెప్పారు?

  13. 'మనం అనుకున్నది సాధించాం' - అభిజీత్ దీప్కే

  14. 'డిమాండ్లు సాధించాం, దీక్ష ముగిసింది', నిరసనకారులు క్షేమంగా ఇళ్లకు వెళ్లాలని సీజేపీ విజ్ఞప్తి

    సీజేపీ, నిరసనలు

    ఫొటో సోర్స్, PTI

    ఫొటో క్యాప్షన్, తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తెలిపింది.

    తమ మిగిలిన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తెలిపింది.

    మూడో విడత చర్చల అనంతరం, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో కలిసి సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా మీడియా సమావేశంలో మాట్లాడారు.

    "ప్రభుత్వం మన డిమాండ్లు అన్నింటినీ అంగీకరించింది. దీక్ష ముగిసింది, నిరసనకారులు క్షేమంగా ఇళ్లకు వెళ్లాలి" అని వారు విజ్ఞప్తి చేశారు.

    "ప్రభుత్వం ఇతర డిమాండ్లను కూడా అంగీకరించింది" అని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మీడియా సమావేశంలో తెలిపారు.

    "కేవలం దిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. నిరసనల్లో పాల్గొన్నందుకు భవిష్యత్తులో ఏ సీజేపీ కార్యకర్తపైనా చర్యలు తీసుకోబోమని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది" అని ఆయన అన్నారు.

    బాధిత కుటుంబాలకు కోటి పరిహారంపై కూడా అంగీకారం కుదిరిందని, చట్టప్రకారం పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందని అశుతోష్ రాంకా తెలిపారు.

    మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ, కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధుల డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం సానుభూతితో పరిశీలించిందని, అంగీకరించిందని అన్నారు.

    "ఈ రోజు మేం సుదీర్ఘంగా చర్చలు జరిపాం. ప్రస్తుతం నమోదైన కేసులకు సంబంధించి నాలుగు అంశాలతో కూడిన ఒక లిఖితపూర్వక ముసాయిదాను వారు తీసుకువచ్చారు. వాటితో పాటు, మిగిలిన రెండు డిమాండ్లపై కూడా మేం చర్చించాం. ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోకూడదు, పరిహారం అందించాలి, అలాగే వారి ఐదు అంశాల చార్టర్‌ను పరిగణించడం.

    మేమే వారికి ఎఫ్‌ఐఆర్‌ల కాపీలను అందిస్తాం, ఎలాంటి చర్యలు తీసుకోబోం. రెండో విషయానికి వస్తే.. పరిహారంపై ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, మాకు కూడా సానుభూతి ఉంది. నిబంధనల ప్రకారం పరిహారం ఉంటుందని, సాధ్యమైనంత గరిష్టంగా వారికి అందిస్తామని మేం చెప్పాం" అని పేర్కొన్నారు.

  15. జంతర్ మంతర్ వద్ద యువత సంబరాలు, 9 ఫోటోల్లో...

  16. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ప్రతిపక్షాలు ఏమన్నాయంటే..

    ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే

    కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రతిపక్ష నాయకులు స్వాగతించారు. ఇది యువత నేతృత్వంలో సాగిన ఉద్యమ విజయంగా అభివర్ణించారు.

    ఇది "దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలని కోరుతూ వీధుల్లోకి వచ్చిన మన లక్షలాది మంది యువత సాధించిన విజయం" అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

    ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ దీనిని, "దేశ యువత సమైక్య బలంతో సాధించిన ఒక భారీ విజయంగా అభివర్ణించారు. ఆయన ఎక్స్ పోస్టులో "అణచివేతకు భయపడకుండా అన్యాయానికి వ్యతిరేకంగా యువత బలంగా నిలబడి, ప్రభుత్వం నైతిక బాధ్యత వహించేలా చేసిన ఈ పోరాటం. ప్రజాస్వామ్య బలానికి నిదర్శనంగా నిలుస్తుంది" అని రాశారు.

    ఇది "యువత సాధించిన పెద్ద విజయం" అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. అయితే, భవిష్యత్తులో పేపర్ లీక్‌లను అరికట్టడానికి, పరీక్షా విధానాలను బలోపేతం చేయడానికి ఈ ఘటన అన్ని రాజకీయ పార్టీలకు ఒక పాఠంగా ఉపయోగపడాలని అభిలషించారు.

    ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా దీనిని "ప్రజాస్వామ్యానికి దక్కిన భారీ విజయం"గా అభివర్ణించారు.

  17. ధర్మేంద్ర ప్రధాన్: ఒకప్పుడు పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తి.. ఇప్పుడు అదే వ్యవహారంలో రాజీనామా, విద్యార్థి నేత నుంచి కేంద్ర మంత్రి వరకు..

  18. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, 'మనం సాధించాం' అన్న సీజేపీ

  19. సోనమ్ వాంగ్‌చుక్: ‘బాధ, ఆవేదన, కోపంతో ఈ మాటలు మాట్లాడుతున్నా’

  20. ‘‘ఒత్తిడి నుంచి బయటపడేందుకు చింపాంజీలు ముద్దు పెట్టుకుంటాయి, కౌగిలించుకుంటాయి’’