అమెజాన్ అడవుల్లో నలుగురు పిల్లల్ని కాపాడిన కుక్క తప్పిపోయింది... అన్వేషణ కొనసాగుతోంది

కొలంబియాలోని దట్టమైన అమెజాన్ అడవుల్లో 40 రోజుల పాటు చిక్కుకుపోయిన చిన్నారులను కాపాడిన తర్వాత కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈసారి ఆ పిల్లల్ని గుర్తించడంలో సాయపడిన శునకం కోసం.

లైవ్ కవరేజీ

  1. రైతు ఉద్యమ సమయంలో ‘ట్విటర్‌’ను మూసేస్తామని భారత ప్రభుత్వం బెదిరించిందన్న జాక్ డోర్సీ.. ఖండించిన కేంద్రం

  2. కొలంబియా అమెజాన్ అడవులు: 'విమానం కూలిపోతుంటే, అమ్మే మమ్మల్ని పారిపోయి ప్రాణాలు కాపాడుకోమంది'

  3. పిల్లల పెంపకానికి 13 సూత్రాలు

  4. దిల్లీలో ర్యాపిడో, ఉబెర్, ఓలా బైక్ ట్యాక్సీ సర్వీసులపై సుప్రీం కోర్టు నిషేధం

    ఉబెర్

    ఫొటో సోర్స్, Getty Images

    దేశ రాజధాని దిల్లీలో ర్యాపిడో, ఉబెర్, ఓలా బైక్ ట్యాక్సీ సర్వీసులపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. అగ్రిగేటెడ్ బైక్ ట్యాక్సీ సేవలకు సంబంధించి దిల్లీ ప్రభుత్వం నిబంధనలు జారీ చేసే వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుందని కోర్టు తెలిపింది.

    దిల్లీ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చే వరకు బైక్ ట్యాక్సీ ఆపరేటర్లపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా నిలుపుదల చేస్తూ మే 26న దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేష్ బిందాల్‌లతో కూడిన సుప్రీంకోర్టు సెలవు కాల ధర్మాసనం స్టే విధించింది.

    మోటారు వాహనాల చట్టంలో సవరించిన మార్గదర్శకాలను జులై 31లోపు తెలియజేయాలని కోర్టు ఆదేశించినట్లు దిల్లీ ప్రభుత్వ న్యాయవాది మనీష్ వశిష్ట తెలిపారు.

    2023 ఫిబ్రవరి 19న ఆన్‌లైన్ బైక్ ట్యాక్సీ సేవలపై నిషేధం విధిస్తూ దిల్లీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలపై ర్యాపిడో, ఉబెర్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి.

    దిల్లీ ప్రభుత్వం నిర్దిష్టమైన విధానాన్ని రూపొందించే వరకు లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేందుకు అనుమతించాలని బైక్ ట్యాక్సీ ఆపరేటర్లు కోరాయి.

    అయితే, బైకులను రవాణా వాహనాలుగా ఉపయోగించేందుకు మోటార్ వాహనాల చట్టం ప్రకారం అనుమతులు లేవని, అలాగే ప్రయాణికుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని నూతన విధానం రూపొందిస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం చెబుతోంది.

  5. నమస్కారం!

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం!

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.