You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చిరంజీవి: నేను క్యాన్సర్‌తో బాధపడినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు
కొలోన్ టెస్ట్ చేయించుకోవడం వల్ల నాన్ క్యాన్సరస్ పాలిప్స్‌ని డిటెక్ట్ చేశారని, ముందుగా టెస్ట్ చేయించుకోకుండా ఉండి ఉంటే అది క్యాన్సర్ కింద మారేదేమో అని మాత్రమే అన్నానని ఆయన అన్నారు.
లైవ్ కవరేజీ
ఒడిశా రైల్వే ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి
ఒడిశాలోని బాలారోసర్ సమీపంలో జరిగిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మృతుల్లో, క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందిన వారు ఎవరైనా ఉన్నారా? లేదా? అన్న దానిపై దృష్టిపెట్టాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉండాలని, రైల్వే అధికారుల నుంచి నిరంతరం సమాచారం తెప్పించుకోవాలన్నారు.
అత్యంత దురదృష్టకర సంఘటన : తెలంగాణ సీఎం
ఈ ప్రమాదం అత్యంత దురదృష్టకర సంఘటన అని తెలంగాణ సీఎం కే. చంద్రశేఖర్ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తగు రీతిలో ఆదుకొని, వారికి భరోసాను కల్పించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు.
కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో ఇప్పటి వరకు 900 మందికి గాయాలు: ప్రదీప్ జేనా
ఒడిశాలో జరిగిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో ఇప్పటి వరకు 900 మంది గాయపడ్డారని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జేనా చెప్పారు.
గాయపడ్డ వారికి బాలాసోర్, మయూర్‌భంజ్, భద్రక్, జాజ్పూర్, కటక్ జిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటి వరకు 233 మంది మృతదేహాలను వెలికితీసినట్లు వెల్లడించారు.
ఎన్డీఆర్ఎఫ్, ఒడిశా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అగ్నిమాపక సిబ్బంది బోగీలను కట్ చేసి లోపల ఉన్న వారిని వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రదీప్ జేనా తెలిపారు.
బోగీలు బాగా ధ్వంసం కావడంతో ఆపరేషన్ కష్టంగా సాగుతోందని, క్రేన్లు కూడా అవసరం కావచ్చన్నారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.