You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కర్ణాటక ప్రజలకు సెల్యూట్, బీజేపీ పతనానికి ఇది ఆరంభం: మమతా బెనర్జీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇప్పటివరకు 125 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందిందని ఎన్నికల కమిషన్ తెలిపింది. మరో 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

లైవ్ కవరేజీ

  1. కర్ణాటక ప్రజలకు సెల్యూట్, బీజేపీ పతనానికి ఇది ఆరంభం: మమతా బెనర్జీ

  2. మోఖా తుపాను : అర్ధరాత్రి తీవ్ర హెచ్చరికలు, 5 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

    మోఖా తుపాను ప్రభావం తీవ్రంగా ఉండొచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆగ్నేయ బంగ్లాదేశ్‌లో సుమారు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

    ఈ తుపాను ఆదివారం తీరం దాటొచ్చని చెబుతున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 170 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, అలలు 12 అడుగుల మేర ఎగసిపడొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    సుమారు పది లక్షల మందికి ఆశ్రయం కల్పించే ప్రపంచంలోనే అతిపెద్ద శరణార్థుల శిబిరంపై కూడా మోఖా తుపాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

    బీబీసీ సౌత్ ఏషియా ప్రతినిధి రజిని వైద్యనాథన్ బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ ప్రాంతం నుంచి అందించిన వివరాల ప్రకారం...

    కాక్స్ బజార్ జిల్లాలో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. అర్ధరాత్రి తీవ్ర తుపాను హెచ్చరికలు జారీ చేశారు.

    ఇప్పటికే బంగ్లాదేశ్, మియన్మార్ తీర ప్రాంతంలోని ఎయిర్‌పోర్టులను మూసేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని ఆదేశించారు.

    తుపాను బాధితుల కోసం 1500 షెల్టర్లను ఏర్పాటు చేశారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.

    మోఖా తుపానుతో దాదాపు పది లక్షల మంది రోహింజ్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెదురుబొంగులతో ఏర్పాటు చేసిన షెల్టర్లు, టార్పాలిన్ పట్టాల కింద కాలం గడుపుతున్నారు.

    తుపాను బాధితులను రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది.

    తుపాను షెల్టర్ల నుంచి బయటికి వెళ్లేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతించడం లేదు. ఒకవేళ తుపాను ఈ శిబిరాలను తాకితే ఏమవుతుందోనని భయాందోళనకు గురవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

  3. ప్రముఖులు ఇలా...

    ఉదయం 10.30 గంటల ప్రాంతంలో కర్ణాటకలోని ప్రముఖ అభ్యర్థుల ట్రెండ్స్ ఇలా ఉన్నాయి.

    డీకే శివకుమార్: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న డీకే శివకుమార్, కనకపుర అసెంబ్లీ నియోజకవర్గంలో లీడ్‌లో ఉన్నారు. ప్రస్తుతం 25,406 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    బసవరాజు బొమ్మై: కర్ణాటక ముఖ్యమంత్రి హవేరీ జిల్లాలోని షిగ్గాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇక్కడ ఆయన ప్రస్తుతం 37,931 ఓట్ల లీడ్‌లో ఉన్నారు.

    హెచ్‌డీ కుమారస్వామి: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి చన్నపట్న అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు. ఇక్కడ ఆయన స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.

    కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) పార్టీ, కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతు ఇచ్చింది.

    ప్రియాంక్ ఖర్గే: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడే ప్రియాంక్ ఖర్గే. ఆయన చిత్తాపుర్ స్థానంలో 34,413 ఓట్ల ముందంజలో ఉన్నారు.

    లైవ్ ఫలితాలు తెలుసుకోవడానికి ఈ కింద లింక్‌ను క్లిక్ చేయండి.

  4. గంగావతిలో ఆధిక్యంలో గాలి జనార్ధన్ రెడ్డి

    గంగావతి అసెంబ్లీ నిజయోకవర్గంలో గాలి జనార్ధన్ రెడ్డి లీడ్‌లో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది.

    కల్యాణ రాజ్య ప్రగతి పక్ష అనే పార్టీని స్థాపించిన గాలి జనార్ధన్ రెడ్డి గంగావతి నుంచి బరిలోకి దిగారు.

    ఆయన భార్య బళ్లారి సిటీ నుంచి పోటీ చేశారు.

    బళ్లారి సిటీ స్థానంలో గాలి లక్ష్మీ అరుణ రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్ రెడ్డి లీడ్‌లో ఉన్నారు.

    గాలి జనార్ధన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి (బీజేపీ) మూడో స్థానంలో ఉన్నారు.

    లైవ్ ఫలితాలు తెలుసుకోవడానికి ఈ కింద లింక్‌ను క్లిక్ చేయండి.

  5. ప్రస్తుతం ఏ పార్టీ ఎక్కడ లీడ్‌లో ఉంది?

    కర్ణాటక ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తుంటే కాంగ్రెస్ లీడ్‌లో కనిపిస్తోంది.

    ప్రాంతాల వారీగా చూస్తే పార్టీల ట్రెండ్స్ ఇలా ఉన్నాయి...

    కోస్తా కర్ణాటక: 19 స్థానాలు

    దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తర కన్నడ జిల్లాలు ఉండే కోస్తాలో బీజేపీకి బాగా పట్టు ఉంది.

    మంగళూరు వంటి ప్రాంతాల్లో నిత్యం మత ఘర్షణలు, మతం పేరుతో వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాంతంలో బీజేపీ లీడ్‌లో ఉంది.

    సెంట్రల్ కర్ణాటక: 29 స్థానాలు

    చిత్రదుర్గ, రాయచూర్, చిక్‌మగుళూరు, ధర్వాడ్, బళ్లారి జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ లీడ్‌లో కనిపిస్తోంది.

    మైసూరు: 61 స్థానాలు

    జేడీఎస్‌కు మైసూరు, మాండ్య ప్రాంతాల్లో పట్టు ఎక్కువ. ప్రస్తుతం కాంగ్రెస్ అక్కడ లీడ్‌లో కనిపిస్తోంది.

    హైదరాబాద్ కర్ణాటక: 41 స్థానాలు

    బీదర్, కలబురగి యాదగిరి, రాయచూరు, కొప్పల్, బళ్లారి జిల్లాలను హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలోకి వస్తాయి. ఈ ప్రాంతంలో తెలుగు ఓటర్లు ఫలితాలను ప్రభావితం చేయగల సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ లీడ్‌లో ఉంది.

    గ్రేటర్ బెంగళూరు: 28 స్థానాలు

    ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్య నెక్ టు నెక్ నడుస్తోంది.

    లైవ్ ఫలితాలు తెలుసుకోవడానికి ఈ కింద లింక్‌ను క్లిక్ చేయండి.

  6. మరో నాలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడే

    నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు పంజాబ్‌లోని జలంధర్ లోక్‌సభ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మేఘాలయాల్లో శాసనసభ ఉప ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి.

    జలంధర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, శిరోమణి అకాలి దళ్ పార్టీల మధ్య పోటీ నెలకొని ఉంది.

    ఉత్తర ప్రదేశ్‌లోని ఛన్బే, సువర్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.

    ఒడిశాలో ఝర్సుగూడ స్థానానికి, మేఘాలయలో సోహియోంగ్ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి.

    వీటన్నిటి ఫలితాలు నేడే వెల్లడి కానున్నాయి.

  7. చార్‌ధామ్‌: ఎత్తైన ప్రాంతాలలో ఊపిరి ఆడనప్పుడు ఏం చేయాలి?

  8. ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

  9. కర్ణాటక ముఖ్యమంత్రి కాబోయేది ఎవరు ?

    కర్ణాటకలో మొత్తం 224 స్థానాలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది.

    ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

    ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అధికారాన్ని చేపట్టడం కోసం భారీగా ప్రచారం నిర్వహించాయి.

    రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారన్నది నేడు తేలిపోతుంది.

    రాష్ట్రంలో 65.7 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల కమిషన్(ఈసీ) తెలిపినట్టు ఏఎన్‌ఐ వార్తాసంస్థ చెప్పింది.

    ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చాయి.

    కర్ణాటకలో 1999 నుంచి బీజేపీ, కాంగ్రెస్‌ మాత్రమే అధికారాన్ని దక్కించుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ రెండు పార్టీల మధ్యే పోరు నడుస్తోంది.

    1994 వరకు ఈ రెండు పార్టీలకు పోటీ ఇచ్చిన జనతాదళ్, 1999 నుంచి వెనుకబడింది. గత ఎన్నికల ఫలితాలను చూస్తే- 2004లో బీజేపీ 79 సీట్లు, కాంగ్రెస్ 65 సీట్లు నెగ్గాయి.

    2008 ఎన్నికల్లో బీజేపీ 110 సీట్లతో కాంగ్రెస్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే, 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనంగా పునరాగమనం చేసింది. 122 సీట్లను గెలుచుకొని బీజేపీని 44 సీట్లకే పరిమితం చేసింది.

    2018 ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు గెలుపొంది అత్యధిక స్థానాలు దక్కించుకున్న పార్టీగా నిలిచింది. రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 78 సీట్లలో విజయం సాధించింది.