You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

భారతీయ - అమెరికన్ శాస్త్రవేత్త సీఆర్ రావుకు అత్యున్నత పురస్కారం

భారతీయ-అమెరికన్ గణాంక శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణారావు (సీఆర్ రావు)కు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారం దక్కింది.

లైవ్ కవరేజీ

  1. అమెరికా ‘టాప్ సీక్రెట్’ డాక్యుమెంట్లను ఎవరు, ఎందుకు లీక్ చేశారు?

  2. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి ఎదురుదెబ్బ, స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానా

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి మరో ఎదురు దెబ్బ తగిలింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు నిర్వహించిన కారణంగా జరిమానా ఎదుర్కోవాల్సి వచ్చిందని ఐపీఎల్ మీడియా అడ్వయిజరీ పేర్కొంది.

    బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీకి, లక్నోకి ఈ మ్యాచ్ జరిగింది.

    ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్ సీజన్‌లో తొలిసారి టీమ్ ఈ నిబంధనలను ఉల్లంఘించింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు రూ.12 లక్షల జరిమానా విధించినట్లు ఐపీఎల్ అధికారిక ప్రకటన తెలిపింది.

    ఒకవేళ రెండోసారి టీమ్ ఈ తప్పు చేస్తే, ఈ జరిమానాను రెండింతలు పెంచుతారు.

    ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్ అవేశ్ ఖాన్ కూడా కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించారు. అవేశ్ ఖాన్ మ్యాచ్ గెలిచిన తర్వాత తన హెల్మెట్‌ను తీసి గ్రౌండ్‌కి కొట్టారు.

  3. భారతీయ - అమెరికన్ శాస్త్రవేత్త సీఆర్ రావుకు అత్యున్నత అంతర్జాతీయ పురస్కారం

    భారతీయ-అమెరికన్ గణాంక శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణారావు (సీఆర్ రావు)కు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారం దక్కింది.

    గణాంకాల రంగంలో నోబెల్ పురస్కారానికి సమానమైన అంతర్జాతీయ పురస్కారాన్ని ఆయన అందుకోనున్నారు.

    75 ఏళ్ల క్రితం విప్లవాత్మక గణాంకాల ఆలోచనలకు పునాది వేసిన ఆయన విశేష కృషికి ఈ ఏడాది గణాంకాల రంగంలో అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకోబోతున్నారు.

    ఈ పురస్కారంతో పాటు 80 వేల డాలర్ల (రూ.65,66,656) నగదు బహుమతి కూడా అందుతుంది. ఈ ఏడాది జూలైలో కెనడాలోని ఒట్టావాలో జరిగే కార్యక్రమంలో సీఆర్ రావుకి ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

    75 ఏళ్ల కిందట రావు అందించిన సహకారం ఇప్పటికీ సైన్స్‌పై విశేష ప్రభావాన్ని చూపుతోందని ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టికల్ ఫౌండేషన్ పేర్కొంది.

    సీఆర్ రావు వయసు ప్రస్తుతం 102 ఏళ్లు. కర్ణాటకలోని అడగాలిలో తెలుగు కుటుంబంలో సీఆర్ రావు జన్మించారు. గూడూరు, నూజివీడు, నందిగామ, విశాఖపట్నంలో ఆయన విద్యాభ్యాసం చేశారు.

    ఆంధ్రా యూనివర్సిటీలో మ్యాథమేటిక్స్‌లో ఎంఎస్సీ చేశారు. 1943లో కలకత్తా యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్‌లో ఎంఏ చదివారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కింగ్స్ కాలేజీ నుంచి పీహెచ్‌డీ పొందారు. 1965లో కేంబ్రిడ్జ్‌ నుంచే డీఎస్‌సీ(డాక్టర్ ఆఫ్ సైన్స్) డిగ్రీని కూడా పొందారు.

  4. ఈద్ సందర్భంగా ఉద్యోగులకు లాంగ్ హాలిడేస్ ప్రకటించిన సౌదీ అరేబియా

    ఈద్ సందర్భంగా సౌదీ అరేబియా తమ దేశంలోని ఉద్యోగులకు కానుక ప్రకటించింది.

    ప్రైవేట్, నాన్ ప్రాఫిట్ రంగాల్లోని ఉద్యోగులకు అదనంగా 4 రోజులు సెలవును ఇస్తున్నట్లు తెలిపింది.

    ఈ మేరకు సౌదీ అరేబియా మానవ వనరుల, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

    ‘‘ఈద్ సందర్భంగా ప్రైవేట్, నాన్ ప్రాఫిట్ రంగాల్లోని ఉద్యోగులు నాలుగు రోజులు అదనంగా సెలవులను ఎంజాయ్ చేయండి. ఈ సెలవులు ఏప్రిల్ 20న పని గంటలు పూర్తయిన తర్వాత నుంచి ప్రారంభమవుతాయి’’ అని పేర్కొంటూ ఈ మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్ చేసింది.

    శుక్రవారం, శనివారం లభించే వీకాఫ్‌తో పాటు ఈ లాంగ్ లీవ్‌ ప్రయోజనాన్ని కూడా ఉద్యోగులు పొందొచ్చని చెప్పింది.

    ఈ సెలవులు తర్వాత కొన్ని కార్యాలయాలు ఏప్రిల్ 27 నుంచి ప్రారంభం కానున్నాయి.

    ఈ ఏడాది మార్చి 23న ప్రారంభమైన రంజాన్ నెల, ఈద్-ఉల్-ఫితర్‌తో ముగుస్తుంది.

  5. బాలుడి పెదాల మీద ముద్దు పెడుతున్న వీడియోపై వివాదం.. క్షమాపణలు చెప్పిన దలైలామా

  6. నోయిడా: బార్‌లో రామాయణం క్లిప్‌ వాడటంపై వివాదం, ఇద్దరు అరెస్ట్

    నోయిడాలోని ఒక బార్‌లో రామాయణం సీరియల్‌కి చెందిన పాత్రలను బిగ్ స్క్రీన్‌పై ప్రదర్శించడంపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసులో ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

    ఈ విషయంపై నోయిడా అదనపు డీసీపీ శక్తి మోహన్ ఆవాస్తి ఒక ప్రకటన చేశారు.

    ‘‘సోమవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో రామాయణం సీరియల్‌కి చెందిన కొన్ని పాత్రలను చూపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో పాటలను ప్లే చేశారు. నోయిడా సెక్టార్ 39 పోలీసు స్టేషన్‌లో దీనిపై ముగ్గురు వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ అయింది.’’ అని తెలిపారు.

    ఈ కేసులో బార్ యజమాని మీనాంక్ కుమార్, మేనేజర్ అభిషేక్ సోనిని అరెస్ట్ చేసినట్లు ఆవాస్తి చెప్పారు.

    ప్రస్తుతం ఈ డీజేను ప్లే చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  7. అమెరికా: లూయిస్‌విల్లే బ్యాంకులో కాల్పులు.. ఐదుగురు మృతి

    అమెరికాలోని కెంటకీ లూయిస్‌విల్లే బ్యాంకులో ఒక ఉద్యోగి తన సహోద్యోగులపై కాల్పులు జరిపాడు. కాల్పుల్లో ఐదుగురు మరణించగా.. తొమ్మిది మందికి గాయాలయ్యాయి.

    ఈ దాడిని ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌స్ట్రీమ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

    చనిపోయిన వారి వయసు 40 నుంచి 64 ఏళ్ల మధ్యలో ఉన్నట్లు పేర్కొన్నారు.

    ఈ దాడిపై మూడు నిమిషాల్లోనే పోలీసులు స్పందించారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో దాడికి పాల్పడ్డ వ్యక్తి మరణించాడు.

    ఈ కాల్పులు స్థానిక కాలమానం ప్రకారం సోమవారం 8.30 గంటలకి సిటీ సెంటర్‌లోని ఓల్డ్ నేషనల్ బ్యాంకులో జరిగాయి.

    ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వారిలో మార్చి 31న పోలీసు అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన నికోలస్ విల్ట్(26) అనే పోలీసు అధికారి కూడా ఉన్నారు.

  8. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని క్లిక్ చేయండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.