You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఆప్‌కు జాతీయ పార్టీగా ఈసీ గుర్తింపు.. ఏపీలో బీఆర్‌ఎస్‌కు రాష్ట్ర పార్టీ హోదా తొలగింపు

మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి, డి.రాజా నేతృత్వంలోని సీపీఐకు జాతీయ పార్టీ గుర్తింపును ఈసీ తొలగించింది. ఈ విషయాన్ని వార్తాసంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

లైవ్ కవరేజీ

  1. ఉత్తరాఖండ్: హల్ద్వానీ జైలులో 44 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ పాజిటివ్

    హల్ద్వానీ జైలులో 44 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

    ఒక మహిళా ఖైదీకి కూడా హెచ్ఐవీ పాజిటివ్‌ సోకినట్లు సుశీల తివారి హాస్పిటల్ ఏఆర్టీ సెంటర్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ పరంజిత్ సింగ్ తెలిపారు.

    జైలులో హెచ్‌ఐవీ పాజిటివ్ ఖైదీలు పెరుగుతుండటంతో, జైలు అడ్మినిస్ట్రేషన్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

    ఏఆర్టీ సెంటర్‌ను హెచ్‌ఐవీ రోగుల కోసం ఏర్పాటు చేసిందని డాక్టర్ సింగ్ చెప్పారు. ఇక్కడ పేషెంట్లకు చికిత్స అందిస్తుంటామని అన్నారు.

    జైలులోని ఖైదీలను తమ టీమ్ నిరంతరం పర్యవేక్షిస్తుందని చెప్పారు.

  2. ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పోటీ

    రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము 175 సీట్లలో పోటీ చేయనున్నామని భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆంధ్రప్రదేశ్ చీఫ్ తోట చంద్రశేఖర్ ప్రకటించారు.

    మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రశేఖర్.. ‘‘మా పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లన్నింటిలో పోటీ చేయనుంది. అలాగే రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాలన్నింటిలో కూడా బరిలోకి దిగుతుంది’’ అని చెప్పారు.

    ప్రత్యేక హోదా కేటగిరీ కింద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కానీ, టీడీపీ నేత చంద్రబాబు నాయుడు కానీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని అన్నారు.

    పోలవరం ప్రాజెక్ట్ చాలా సీరియస్ విషయమని, కానీ ఇరు పార్టీలు కూడా దీనిపై దృష్టిసారించలేదన్నారు.

    తమ పార్టీ దీన్ని సీరియస్ విషయంగా తీసుకోనుందని చంద్రశేఖర్ చెప్పారు.

  3. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని క్లిక్ చేయండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈలింక్‌నుక్లిక్ చేయండి.

  4. ఆప్‌కు జాతీయ పార్టీగా ఈసీ గుర్తింపు.. ఏపీలో బీఆర్‌ఎస్‌కు రాష్ట్ర పార్టీ హోదా తొలగింపు