ఐపీఎల్: దిల్లీపై 57 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం

రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ అర్ధ శతకాలు సాధించారు. 200 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ క్యాపిటల్స్ కేవలం 142 పరుగులే చేయగలిగింది.

లైవ్ కవరేజీ

  1. బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు అంటే ఏంటి, ఆ డబ్బును ఏం చేస్తారు?

  2. తెలంగాణలో అభివృద్ధి పనులను ప్రారంభించిన మోదీ

    తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

    దాంతోపాటు తెలంగాణలో మరో 5 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన మోదీ

    సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు.

    ఫొటో సోర్స్, ANI

    సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు.

    సికింద్రాబాద్-తిరుపతి మధ్య రైలు ప్రయాణ సమయం 8.30 గంటలు.

    రైలులో ఏసీ ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ లు ఉన్నాయి.

    ఈ రైలు గంటకు 78 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.

    ఆదివారం నుంచి ఈ రైలు సర్వీస్ పూర్తిస్థాయిలో మొదలవుతుంది. మంగళవారం మినహా వారంలో మిగతా రోజులు ఈ రైలు అందుబాటులో ఉంటుంది.

    సికింద్రాబాద్ నుంచి 20701 నంబరుతో ఉదయం 6 గంటలకు మొదలవుతుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.

    తిరుపతి నుంచి 20702 నంబరుతో మధ్యాహ్నం 3.15 గంటలకు మొదలై రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ

    ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్నారు.

    తెలంగాణ గవర్నరు తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు ప్రధానికి స్వాగతం పలికారు.

    తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రధానికి స్వాగతం పలికేందుకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెళ్లారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. సుఖోయ్ విమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అస్సాంలోని తేజ్‌పుర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానంలో కొద్దిసేపు ప్రయాణించారు.

    ఇంతకుముందు 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ కూడా యుద్ధ విమానంలో ప్రయాణించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  6. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన కు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరం.

    హైదరాబాద్ పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విమానాశ్రయంలో స్వాగతం పలికే కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పాల్గొనబోవడం లేదని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు.

    సుమారు రూ.11 వేల కోట్ల విలువైన ఈ అభివృద్ధి కార్యక్రమాలలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణతో పాటు బీబీనగర్ ఎయిమ్స్, పలు రహదారి కార్యక్రమాల శంకుస్థాపనలు ఉన్నాయి.

    ప్రొటోకాల్ ప్రకారం ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం వెళ్లినా, ఆయన ఇందులో పాల్గొనబోవడం లేదని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. దెబ్బ తగిలిన ప్రతిసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలా, అసలు ఎప్పుడు అవసరం?

  8. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని క్లిక్ చేయండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌నుక్లిక్ చేయండి.