వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి
సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి జరిగింది.
ఈ నేపథ్యంలో రైలు బయలుదేరు సమయ వేళలను రీషెడ్యూల్ చేశారు.
బుధవారం ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సమయాన్ని ఉదయం 9.45 గంటలకు మార్చినట్లు వాల్తెర్ డివిజన్ రైల్వే అధికారులు తెలిపారు.
గుర్తు తెలియని దుండగులు జరిపిన రాళ్ల దాడిలో సీ-8 కోచ్ విండో గ్లాస్ పగిలిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు.
గత మూడు నెల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై ఇలాంటి రాళ్ల దాడి జరగడం ఇది మూడవ సారి.