ఎంఎం కీరవాణి: పద్మశ్రీ అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు

ఆస్కార్ అవార్డు విజేత అయిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి బుధవారం దిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.

లైవ్ కవరేజీ

  1. దక్షిణ ఇరాన్‌పై దాడులు చేశామన్న అమెరికా సైన్యం, శాంతి ఒప్పందం సంగతేంటి?

  2. ఇజ్రాయెల్‌ను, పాకిస్తాన్, సౌదీ, ఖతార్ గుర్తిస్తాయా? సెనేటర్ గ్రాహం పోస్టుపై ముస్లిం దేశాలలో విమర్శలు దేనికి?

  3. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల చుట్టూ ఇంత వివాదం ఎందుకు? పవన్ కల్యాణ్ ఏమన్నారు?

  4. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు: ఇందులో ఏయే పన్నులు దాగి ఉంటాయి, రాష్ట్రానికో తీరుగా ఎందుకుంటుంది?

  5. ‘‘నేను ఓడలో నిద్రపోతున్నా, బాంబులు పడటంతో సముద్రంలో దూకేశా’’

  6. ఓ అరగంటసేపు కూర్చోవడం తగ్గిస్తే ఎంత ప్రయోజనమో తెలుసా?

  7. అమెరికా కొత్త గ్రీన్ కార్డు పాలసీ: భారతీయుల కల చెదిరిపోతుందా?

  8. నీళ్లు కావాలంటే ఇలా బావిలోకి దిగాల్సిందే..

  9. "ఇదే మీ కూతురో, మేనకోడలో, కుటుంబ సభ్యురాలో అయితే మీరు సంతోషిస్తారా?" ప్రధానమంత్రికి అత్యాచార బాధితురాలి తల్లి ప్రశ్న

  10. అత్తని 9 కిలోమీటర్లు మోసుకెళ్లిన కోడలు, అలోక్ పుతుల్, బీబీసీ కోసం, రాయ్‌పూర్ నుంచి..

    ఛత్తీస్‌గఢ్, పింఛన్ కష్టాలు

    ఫొటో సోర్స్, Kunjbihari Gupta

    ఫొటో క్యాప్షన్, అత్తని వీపుపై మోసుకుంటూ 9 కిలోమీటర్ల దూరంలోని బ్యాంకు తీసుకెళ్లారు కోడలు రుక్మిణియా.

    ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లా, మైన్‌పాట్ ప్రాంతంలోని జంగల్‌పారా గ్రామంలో హృదయవిదారక దృశ్యమొకటి వెలుగులోకి వచ్చింది.

    పింఛన్ కోసం ఒక మహిళ 90 ఏళ్లున్న తన అత్తను వీపుపై మోసుకుంటూ 9 కిలోమీటర్ల దూరంలోని బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చింది.

    సోమారి బాయి గిరిజన మహిళ. ఆమెకు రావాల్సిన రూ.1500 పెన్షన్ సొమ్ము గత మూడు నెలలుగా రావడం లేదు. దీంతో కోడలు రుక్మిణియా తన అత్తని వీపుపై మోసుకుంటూ రాళ్లురప్పలు, వాగులు దాటుకుంటూ 9 కిలోమీటర్ల దూరంలోని సెంట్రల్ బ్యాంకుకు తీసుకెళ్లారు.

    వాళ్ల ఊరికి సరైన రోడ్డు మార్గం గానీ, రవాణా సౌకర్యాలు గానీ లేవు.

    సోమారి బాయి బ్యాంకు ఖాతాకు సంబంధించిన కేవైసీ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఆ ఖాతా సేవలు నిలిచిపోయాయని బ్యాంక్ మేనేజర్ అల్తాఫ్ మీర్జా తెలిపారు. ప్రస్తుతం ఆ అకౌంట్‌కు సంబంధించిన కేవైసీ, మొబైల్ నంబర్ అనుసంధాన ప్రక్రియ పూర్తయింది.

    ఇకపై బ్యాంక్ మిత్ర ద్వారా పింఛన్ సొమ్ము నేరుగా వృద్ధురాలి ఇంటికే వెళ్లి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఆమెకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.

    ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆ గ్రామానికి చేరుకుని ఆరా తీశారు. సోమారి బాయి పింఛను విత్‌డ్రా చేసే అవకాశం ఆమె కోడలు రుక్మిణియాకు కల్పించనున్నట్లు మైన్‌పాట్ ఎస్డీఎం ఫగేశ్ సిన్హా తెలిపారు.

  11. 'రొమ్ముల సర్జరీ తర్వాత నన్ను నేను చూసుకోగానే ఏడుపొచ్చేసింది', వక్షోజాల సైజు తగ్గించుకున్న ఈ మహిళలు ఏమంటున్నారు?

  12. క్యూబా - అమెరికా మధ్య చిచ్చురేపిన విమాన దాడి.. రౌల్ క్యాస్ట్రో‌పై చార్జ్‌షీట్ వెనుక అసలు కథ

  13. బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్ చరణ్

    రామ్ చరణ్, టాలీవుడ్, తెలుగు సినిమా

    ఫొటో సోర్స్, Prodip Guha/Getty Images

    టాలీవుడు నటుడు రామ్ చరణ్.. భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు క్షమాపణలు చెప్పారు.

    త్వరలో విడుదల కానున్న తన సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ రామ్ చరణ్ పొరపాటున జస్ప్రీత్ బుమ్రాను ఫుట్‌బాల్ ఆటగాడిగా సంబోధించారు.

    ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రామ్ చరణ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా బుమ్రాకు క్షమాపణలు తెలిపారు.

    రామ్ చరణ్ శనివారం రాత్రి ఎక్స్‌లో చేసిన పోస్టులో ఇలా రాశారు. "అయ్యో... నేను నిజంగా కొన్నిసార్లు పేర్లు మర్చిపోతుంటాను."

    "జస్ప్రీత్ బుమ్రా గారు, జరిగిన పొరపాటుకు నేను క్షమాపణలు చెబుతున్నా. అంతమంది జనంలో, కార్యక్రమం ఉత్సాహంగా సాగుతున్న సమయంలో అనుకోకుండా జరిగిన మానవ తప్పిదమిది."

    "నాకు మీరంటే చాలా గౌరవం. మీ ఆటకు పెద్ద అభిమానిని. మీరు నిలకడగా రాణిస్తూ, బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపిస్తున్నప్పుడు ప్రతి భారతీయుడూ గర్వపడతాడు" అని రామ్ చరణ్ రాశారు.

  14. అబ్దుల్ రహీమ్: మరణశిక్ష తప్పించడానికి రూ.34 కోట్లు సేకరించి ఇచ్చారు, మరి సౌదీ జైలు నుంచి విడుదల ఎప్పుడు?

  15. వైట్ హౌస్ కాల్పుల ఘటన: మనకు ఇంకా తెలియని కీలక విషయాలు

    ట్రంప్

    ఫొటో సోర్స్, AFP via Getty Images

    వైట్ హౌస్ సమీపంలో కాల్పులు జరిపిన నాసిరే బెస్ట్ ఉద్దేశం ఏంటో ఇంకా తెలియరాలేదు. ఆయన ఏ రకమైన ఆయుధాన్ని ఉపయోగించాడనే దానిపై కూడా ఇంకా ఎటువంటి నిర్ధారణ రాలేదు.

    ఈ ఘటనలో తుపాకీ కాల్పులకు గురైన సాధారణ పౌరుడి గురించి కూడా ఇంకా వివరాలు బయటకు రాలేదు. అసలు ఆ వ్యక్తి.. బెస్ట్ జరిపిన కాల్పుల వల్ల గాయపడ్డారా? లేక సీక్రెట్ సర్వీస్ జరిపిన ఎదురుకాల్పుల్లో గాయపడ్డారా తెలియలేదు.

    ట్రంప్, కాల్పులు జరిగిన సమయంలో వైట్ హౌస్‌లోనే ఉన్నారని సీక్రెట్ సర్వీస్ ధ్రువీకరించినప్పటికీ, ఈ ఘటనపై ట్రంప్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

  16. ‘వ్యవహారం కీలక దశలో ఉంది, అందుకే నా కొడుకు పెళ్లికి కూడా నేను వెళ్లడం లేదు’- ఇరాన్‌తో ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

  17. రిపోర్టర్ లైవ్‌లో ఉండగా వైట్ హౌస్ దగ్గర కాల్పులు జరిగిన క్షణాలు...

  18. వైట్‌హౌస్ పరిసరాల్లో భారీగా సీక్రెట్ సర్వీస్ బలగాలు, టామ్ బెన్నెట్, వాషింగ్టన్ డీసీ నుంచి

    వైట్ హౌస్ పరిసరాల్లో భారీగా భద్రతా బలగాల మోహరింపు

    ఫొటో సోర్స్, AFP via Getty Images

    వైట్‌హౌస్ సమీపంలోని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లపై ఒక సాయుధుడు కాల్పులు జరిపి కొన్ని గంటలు గడిచినప్పటికీ, అక్కడ ఇంకా పోలీసు బలగాల మోహరింపు భారీగా ఉంది.

    అధ్యక్షుడు ట్రంప్ అధికారిక నివాసానికి దారితీసే వీధుల వద్ద భారీగా గస్తీ ఏర్పాటు చేశారు. రోడ్లపై నిలిపి ఉన్న అనేక పోలీసు వాహనాలు కనిపిస్తున్నాయి. ఈ వీధుల సమీపంలో చాలామంది జర్నలిస్టులు గుమిగూడారు.

    వైట్ హౌస్ పరిసరాల్లో భారీగా భద్రతా బలగాల మోహరింపు

    ఫొటో సోర్స్, AFP via Getty Images

    కాల్పుల ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగుతున్నందున బహుశా ఈ వీధులను రాత్రంతా మూసి ఉంచొచ్చని అక్కడ ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు నాతో చెప్పారు.

    అయితే, నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో ఈ ప్రభావం కనిపించలేదు. మాకు కేవలం కొన్ని బ్లాకుల దూరంలోనే ఉన్న రెస్టారెంట్లు, బార్లలో ప్రజలు తమ వీకెండ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

    (నోట్: భారత్ కంటే అమెరికా కాలమానం 10:30 గంటలు వెనుక ఉంటుంది)

  19. కాక్రోచ్ జనతా పార్టీ: దీనిని స్థాపించిన అభిజిత్ దీపక్ నుంచి ఆయన తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు?

  20. కాల్పులు జరిపింది 21 ఏళ్ల యువకుడిగా గుర్తింపు

    వైట్ హౌస్‌లో కాల్పులు

    ఫొటో సోర్స్, AFP via Getty Images

    వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు జరిపి, భద్రతా సర్వీసుల ఎదురుకాల్పుల్లో మరణించిన అనుమానితుడు ఎవరో పోలీసులు గుర్తించినట్లు బీబీసీ భాగస్వామి మీడియా సంస్థ సీబీఎస్ తెలిపింది.

    21 ఏళ్ల నాసిరే బెస్ట్ ఆ కాల్పులు జరిపినట్లు ఇన్వెస్టిగేషన్‌తో సంబంధమున్న ఒక వ్యక్తిని ఉటంకిస్తూ సీబీఎస్ రిపోర్ట్ చేసింది.

    ‘నిందితుడు 2025 జులైలో వైట్‌హౌస్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు అమెరికా సీక్రెట్ సర్వీస్ అతన్ని అరెస్ట్ చేసింది. ఆ తర్వాత మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా అతన్ని సైకియాట్రిక్ వార్డ్‌కు పంపించారు’ అని సదరు వ్యక్తిని చెప్పినట్లు సీబీఎస్ తెలిపింది.