పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కేసు: డోనాల్డ్ ట్రంప్ విచారణ.. న్యూయార్క్‌లో భారీ భద్రత

డోనాల్డ్ ట్రంప్ 2006లో తనతో సెక్స్‌లో పాల్గొన్నారని, ఆ విషయం బయటపెట్టకుండా ఉండేందుకు 2016లో అధ్యక్ష ఎన్నికలకు ముందు తనకు డబ్బు చెల్లించారని పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ ఆరోపిస్తున్నారు.

లైవ్ కవరేజీ

  1. చైనా బెలూన్ యూఎస్ సైనిక స్థావరాల సమాచారాన్ని ఆ దేశానికి పంపించింది: అమెరికా మీడియా కథనం

    చైనా బెలూన్

    ఫొటో సోర్స్, US AIR FORCE/DEPARTMENT OF DEFENCE/REUTERS

    తన గగనతలంలో కనిపించిన భారీ చైనా బెలూన్‌ను అమెరికా కొద్ది వారాల కిందట కూల్చేసింది.

    ఇది నిఘా బెలూన్ అని అమెరికా ఆరోపించగా చైనా అలాంటి ఆరోపణలను కొట్టిపడేసింది.

    అయితే, ఆ బెలూన్‌ను కూల్చేయడానికి ముందు రోజే అది‌ అమెరికా సైనిక స్థావరాల నుంచి కొంత సమాచారాన్ని సేకరించి చైనాకు చేరవేసినట్లు యూఎస్ మీడియాలో కథనాలు వచ్చాయి.

    ఆ బెలూన్ బీజింగ్‌కు ఎప్పటికప్పుడు సమాచారం పంపించే సామర్థ్యం ఉందని యూఎస్ అధికారులను ఉటంకిస్తూ ఎన్‌బీసీ న్యూస్ కథనం రాసింది.

    సైనిక స్థావరాల ఫొటోలు వంటివి కాకుండా ఎలక్ట్రానిక్ సిగ్నళ్లను ఈ బెలూన్ సేకరించి బీజింగ్ పంపించిందని ఆ కథనంలో రాశారు.

    అయితే, వైట్ హౌస్ దీనిని ఇంకా ధ్రువీకరించలేదు.

    మరోవైపు ఈ బెలూన్ అమెరికా గగనతలంలో ఉన్న సమయంలో దాని నిఘా సామర్థ్యాలను తాము పరిమితం చేయగలిగామని అమెరికా అధికారులు చెప్పారు.

    కాగా ఈ బెలూన్‌ను అమెరికా ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో కూల్చేసింది.

    ఫైటర్ జెట్‌లతో తమ ప్రాదేశిక జలాలలోనే ఆ భారీ బెలూన్‌ను కూల్చివేశాయని అమెరికా రక్షణ శాఖ అప్పట్లో ప్రకటించింది.

    బెలూన్ సముద్రంలో పడిపోతున్న దృశ్యాలు అమెరికా టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి. చిన్నపాటి పేలుడు తరువాత ఆ భారీ బెలూన్ పగిలి సముద్రంలో పడిపోతుండడం ఆ వీడియోలలో కనిపించింది.

    పేలిన బెలూన్ భాగాలు, అందులోని పరికరాలను సముద్రంలో 11 కిలోమీటర్ల మేర పడ్డాయి.

    ఆ శిథిలాలను తాము ఇంకా పరిశీలిస్తున్నామని అమెరికా రక్షణ అధికారులు చెప్తున్నారు.

  2. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కేసు: డోనాల్డ్ ట్రంప్ విచారణ.. న్యూయార్క్‌లో భారీ భద్రత

  3. వర్జినిటీ: కన్నెపొర ఎలా ఉంటుంది? మొదటిసారి సెక్స్ తర్వాత దానికి ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారు?