You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

'మోదీ' వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీ అప్పీలు.. 13న విచారణ

పరువు నష్టం కేసులో తనను దోషిగా తేల్చడాన్ని, శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన అప్పీలుపై విచారణను సూరత్ సెషన్స్ కోర్టు ఏప్రిల్ 13న చేపట్టనుంది.

లైవ్ కవరేజీ

  1. విరాట్ కోహ్లి: ముంబై ఇండియన్స్‌పై ఆర్‌సీబీ ఘన విజయం

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు పూర్తి ఆధిపత్యంతో విజయాన్ని అందుకుంది.

    ఆదివారం ముంబై ఇండియన్స్‌ (ఎంఐ)పై మరో 22 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్లతో ఘన విజయాన్ని సాధించింది.

    2011 నాటి వరల్డ్ కప్ ఫైనల్లో ధోని సిక్స్‌ను తలపించేలా ఆదివారం నాటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లి స్టయిలిష్ సిక్సర్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును గెలిపించాడు.

    బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సీబీ ఫీల్డింగ్‌ను ఎంచుకుంది.

    తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది.

    ముంబైకి ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మ 46 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

    ముంబై తరఫున తిలక్ మెరుపులు తప్ప మరో ఆటగాడు రాణించలేకపోయాడు.

    బెంగళూరు బౌలర్లలో కర్ణ్ శర్మ 2 వికెట్లు తీశాడు. మొహమ్మద్ సిరాజ్, రీస్ టాప్లే, ఆకాశ్ దీప్, హర్షల్ పటేల్, బ్రేస్‌వెల్ తలో వికెట్ పడగొట్టారు.

    అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసి తొలి విజయాన్ని అందుకుంది.

    ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లి 49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మ్యాచ్ ఆసాంతం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు.

    కెప్టెన్ డుప్లెసిస్ కూడా ధాటిగా ఆడాడు. అతను 43 బంతుల్లో 5 ఫోర్లర, 6 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు.

    వీరిద్దరూ తొలి వికెట్‌కు 89 బంతుల్లో 148 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

    చివర్లో మ్యాక్స్‌వెల్ (3 బంతుల్లో 12 నాటౌట్; 2 సిక్సర్లు) కూడా బెంగళూరు ఫ్యాన్స్‌ను మురిపించాడు.

    అర్షద్ ఖాన్, కామెరాన్ గ్రీన్ చెరో వికెట్ తీశారు.