మధ్యప్రదేశ్: గుడిలో కూలిన మెట్లబావి.. 13 మంది మృతి
ఇండోర్‌లోని పటేల్ నగర్‌లో ఉన్న ఒక గుడిలో మెట్లబావి కూలిపోయింది. చాలామంది బావిలో పడిపోయారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
లైవ్ కవరేజీ
డోనాల్డ్ ట్రంప్: పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లింపు కేసులో మాజీ అధ్యక్షుడిపై క్రిమినల్ అభియోగం
కార్చిచ్చులో కాలిపోతున్న భారీ పర్వతం
వీడియో క్యాప్షన్, థాయ్‌లాండ్‌లో తీవ్ర విధ్వంసం సృష్టిస్తోన్న కార్చిచ్చు థాయిలాండ్‌లోని పర్వతాల్లో కార్చిచ్చు తీవ్ర విధ్వంసం సృష్టిస్తోంది.
రాజధాని బ్యాంకాక్ నగరానికి రెండు గంటల ప్రయాణ దూరంలో ఉన్న నఖోన్ నాయోక్‌లోని ఓ భారీ పర్వతం కాలిపోతున్న దృశ్యాలను ఓ వ్యక్తి బుధవారం రాత్రి చిత్రీకరించారు.
మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక దళాలను మోహరించారు. పిడుగులు పడటం వల్ల ఈ మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
శ్రీరామ నవమి: ఈ ఆలయంలో పిల్లలను దేవుడికి ఇచ్చేసి, తర్వాత కొనుక్కుంటారు
గూఢచర్యం ఆరోపణలతో రష్యాలో అమెరికా జర్నలిస్ట్ అరెస్ట్

ఫొటో సోర్స్, THE WALL STREET JOURNA
అమెరికా వార్తాపత్రిక ‘‘వాల్ స్ట్రీట్ జర్నల్’’ జర్నలిస్టును గూఢచర్యం ఆరోపణలతో అరెస్టు చేసినట్లు రష్యా భద్రతా ఏజెన్సీ ‘‘ఎఫ్‌ఎస్‌బీ’’ గురువారం తెలిపింది.
వార్తా సంస్థ ఏఎఫ్‌పీ ప్రకారం, అరెస్టయిన జర్నలిస్ట్ అమెరికా పౌరుడు. అమెరికా కోసం రష్యాలో గూఢచర్యం చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయని ఏఎఫ్‌ఫీ పేర్కొంది.
అమెరికా పౌరుడు ఇవాన్ గెర్ష్‌కోవిచ్ చట్టవిరుద్ధ కార్యకలాపాలను అడ్డుకున్నట్లు ఎఫ్‌ఎస్‌బీ తెలిపింది.
31 ఏళ్ల ఇవాన్ గెర్ష్‌కోవిచ్, రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రెస్ అక్రిడిటేషన్‌తో పనిచేస్తున్నట్లు ఎఫ్ఎస్‌బీ చెప్పింది.
రష్యా సైన్యానికి చెందిన ఒక పారిశ్రామిక సముదాయం సమాచారాన్ని సేకరించారనే ఆరోపణలతో ఇవాన్‌ను నిర్బంధించినట్లు తెలిపింది.
ఎకతెరీన్‌బర్గ్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా జర్నలిస్టు: ‘‘క్రెమ్లిన్ ఇంకా ఎంత దూరం వెళుతుందో’’

రష్యా జర్నలిస్ట్ దిమిత్రీ మురటోవ్ మౌనంగా ఉండటానికి నిరాకరించారు. ఆయన వార్తాపత్రిక సంస్థను రష్యా అధికారులు ఆపేసి ఉండొచ్చు.
నొవాయా గజెటా వార్తాపత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్, రష్యా నోబెల్ ప్రైజ్ విజేత దిమిత్రీ మురటోవ్‌ను మేం రష్యాలో కలిశాం.
పశ్చిమ దేశాలతో ఘర్షణ విషయంలో క్రెమ్లిన్ ఇంకా ఎంతదూరం వెళ్లనుందో అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘అణుయుద్ధం ముప్పు లేకుండా రెండు తరాలు జీవించాయి. కానీ, ఇప్పుడు ఆ కాలం ముగిసింది. న్యూక్లియర్ బాంబు మీటను పుతిన్ నొక్కుతారా? లేదా? అనేది ఎవరికి తెలుసు? ఎవరికీ తెలియదు. దీని గురించి కచ్చితంగా చెప్పే వారు ఒక్కరు కూడా లేరు’’ అని దిమిత్రీ మురటోవ్ అన్నారు.
2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయిలో దండెత్తినప్పటి నుంచి బెదిరింపు సూచకంగా మాస్కో నుంచి న్యూక్లియర్ ఆయుధాల ప్రదర్శన తరచుగా జరిగింది.
యుక్రెయిన్‌కు ఆయుధ సహకారం అందిస్తున్న పశ్చిమ దేశాలు, ఎంతకైనా తెగించేలా రష్యాను ప్రేరేపించకూడదని సీనియర్ అధికారులు సూచనలు చేశారు.
ఈ రైల్వేస్టేషన్‌లో 'టీ స్టాల్' చాలా స్పెషల్
స్కాట్లాండ్: ఫస్ట్ మినిస్టర్‌గా గెలిచిన తొలి ముస్లిం హమ్జా యూసఫ్ ఎవరు?
‘‘పెరుగు ప్యాకెట్ల మీద పేరును హిందీలో రాయాలా... దక్షిణాది భాషలను అవమానిస్తారా’’ అంటూ విమర్శలు ఎందుకు వచ్చాయి
ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమానా లేక తమిళ సినిమానా? అభిమానులకు అనుమానం ఇప్పుడెందుకు వచ్చింది?
నంద్యాల జిల్లాలో శ్రీరామనవమి వేడుకల్లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ

ఫొటో సోర్స్, UGC
తులసీ ప్రసాద్, బీబీసీ కోసం
నంద్యాల జిల్లా, డోన్ మండలం మల్లెంపల్లి గ్రామంలో శ్రీరామనవమి వేడుకల్లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
కట్టెలు, రాళ్ళతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఇందులో నలుగురికి గాయాలయ్యాయి.
టీడీపీ నాయకుడు సుంకన్న ఇంటిపై రాళ్లు, కర్రలతో వైసీపీ వర్గీయులు దాడికి దిగడంతో సుంకన్న, సుగుణమ్మ, జయమ్మ ,నాగరాజు అనే వ్యక్తులకు గాయాలైనట్లు స్థానికులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, UGC
ఇరు వర్గాల మధ్య తోపులాటలో పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇరు వర్గాలకు పోలీసులు నచ్చ చెప్పడంతో ఘర్షణ సద్దుమణిగింది.
శ్రీరామనవమి వేడుకల్లో మాట మాట పెరగడంతో చిలికి చిలికి గాలివానగా మారింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుందని స్థానికులు అంటున్నారు.
మధ్యప్రదేశ్: కూలిన మెట్ల బావి... 13 మంది మృతి
ఇండోర్‌లోని పటేల్ నగర్‌లో ఉన్న ఒక గుడిలో మెట్లబావి కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది చనిపోయినట్లు మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు.
శ్రీరామనవమి సందర్భంగా బేలేశ్వర్ మహదేవ్ ఝులేలాల్ గుడిలో పూజల కోసం భక్తులు వచ్చారు. అక్కడ ఉన్న ఒక బావి కూలడంతో చాలామంది బావిలో పడిపోయారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
‘‘11 మృతదేహాలను వెలికితీశాం. వారిలో 10 మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. కాపాడిన 19 మందిలోఇద్దరు చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 13కి చేరింది’’ అని మిశ్రా వెల్లడించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దసరా రివ్యూ: ఒళ్లు జలదరించే ఆ 10 నిమిషాలతో నాని హిట్ కొట్టాడా?
తమిళనాడు: పెరుగు ప్యాకెట్‌పై హిందీలో 'దహీ' అని రాయడంపై వివాదం
పెరుగు ప్యాకెట్‌పై పేరు ముద్రించే విషయంలో తమిళనాడు నేతల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది.
పెరుగు ప్యాకెట్‌పై హిందీలో దహీ అని ముద్రించాలంటూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేయడాన్ని డీఎంకే నేత టీకేఎస్ ఇలంగోవన్ వ్యతిరేకించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"రాష్ట్రాల్లో వారి సొంత భాషలో పేరు రాసుకోవాలి. ఇందులో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎందుకు జోక్యం చేసుకుంటోందని" ఇలంగోవన్ ప్రశ్నించారు.
రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అన్ని భాషలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ దేశంలో ఏ ఒక్క భాష జాతీయ భాష కాలేదన్నారు. అది వాళ్లు గుర్తుంచుకోవాలని ఇలంగోవన్ అన్నారు.
పాకిస్తాన్: దేశద్రోహం చట్టాన్ని రద్దు చేసిన లాహోర్ హైకోర్టు

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 124ఏ (దేశద్రోహం) చట్టాన్ని నేడు లాహోర్ హైకోర్టు రద్దు చేసిందని డాన్ పత్రిక తెలిపింది.
ఈ చట్టం దేశ రాజ్యంగానికి విరుద్ధమని హైకోర్టు పేర్కొంది.
పాకిస్తాన్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రత్యర్థులపై కక్షసాధింపు చర్యగా దేశద్రోహ చట్టాన్ని వినియోగించుకుంటున్నాయని, అందుకే ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ పలు పిటిషన్లు నమోదయ్యాయి.
వాటన్నిటినీ విచారిస్తూ, జస్టిస్ షాహిద్ కరీం పై తీర్పును వెల్లడించారు.
దేశద్రోహానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్లలో, ఈ చట్టం వలసరాజ్య పాలన నాటిదని, పౌరుల భావప్రకటన స్వేచ్ఛను హరిస్తూ, అసమ్మతిని అణచివేసేందుకు ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతువిప్పినవారిపై దేశద్రోహం కేసులు వేసి జీవితఖైదు లాంటి శిక్షలు కూడా వేస్తున్నారని పిటిషనర్లు ఆరోపించారు.
రాజాసింగ్‌పై ముంబైలో కేసు

ఫొటో సోర్స్, ANI
తెలంగాణ బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబైలో కేసు నమోదైంది.
జనవరి 29న ముంబైలో జరిగిన ఒక సమావేశంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు అక్కడి పోలీసులు రాజాసింగ్‌పై కేసు నమోదు చేశారు.
ఐపీసీ సెక్షన్ 153 1(ఏ) కింద ఎమ్మెల్యేపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాజాసింగ్‌ను పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసింది.
వియత్నాం యుద్ధంలో అమెరికా ఓటమికి ఏడు కారణాలు ఇవీ
యోని గురించి తెలుసుకోవాల్సిన అయిదు ముఖ్యమైన విషయాలు
తణుకు మండలం దువ్వ గ్రామంలో అగ్ని ప్రమాదం

ఫొటో సోర్స్, UGC
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది.
వేణుగోపాల స్వామి ఆలయం ప్రాంగణంలో వేసిన పందిళ్లకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. నిమిషాల వ్యవధిలో భారీగా మంటలు చెలరేగాయి.
వెంటనే అగ్నిమాపక సిబ్బాంది రంగంలోకి దిగి మంటలను అదుపుచేశారు.

ఫొటో సోర్స్, UGC
తారా జువ్వ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
గ్రామంలో వేణుగోపాల స్వామి ఉత్సవాలు పురస్కరించుకుని గత నెలలో ఆలయంలో తాటాకు పందిరి వేశారు.
శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి ఎదురు సన్నాహం చేపట్టిన సందర్భంలో తారాజువ్వలు వేశారని అవి పందిరిపై పడటం వల్ల మంటలు చెలరేగి ఉంటాయిని గ్రామస్తులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, UGC
మంటలు భారీగా ఎగసి పడటంతో ఆలయ ప్రాంగణం పొగతో కప్పేసింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలు అదుపు చేశారు.
శ్రీరామనవమి రోజు ఇటువంటి అపశ్రుతి పట్ల గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ‘స్కాం’ ఏంటి... ఈడీ ఎందుకు వచ్చింది?
