You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

లవ్లీనా బోర్గోహైన్‌కు స్వర్ణం.. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగో స్వర్ణం

ప్రపంచ సీనియర్ మహిళల చాంపియన్‌షిప్‌లో బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ భారత్‌కు మరో స్వర్ణాన్ని అందించారు. 75 కేజీల విభాగంలో లవ్లీనా వరల్డ్ చాంపియన్‌గా నిలిచారు.

లైవ్ కవరేజీ

  1. అమెరికా: టోర్నాడో‌తో తుడిచిపెట్టుకు పోయిన పట్టణం... 26 మంది మృతి

  2. అమెరికా: జర్నలిస్టు మీద ఖలిస్తాన్ మద్దతుదార్ల ‘దాడి’

    అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో భారత ఎంబసీ వద్ద లలిత్ కే ఝా అనే జర్నలిస్టును ఖలిస్తాన్ మద్దతుదార్లు దూషించినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.

    లలిత్‌ మీద భౌతిక దాడికి దిగినట్లుగా కూడా పేర్కొంది.

    ఈ ఘటనను భారత ఎంబసీ ఖండించింది.

    ‘‘సీనియర్ జర్నలిస్టు మీద దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం. ‘‘ఖలీస్తాన్’’ అని చెప్పుకునేవారి హింసాత్మక, అసాంఘిక ప్రవృత్తిని అవి తెలియజేస్తున్నాయి’’ అని ఎంబసీ ప్రకటనలో పేర్కొంది.

    లలిత్ కే ఝా పోస్ట్ చేసిన వీడియోలో ఖలిస్తాన్ జెండాలు పట్టుకుని ఉన్నవారు దూషిస్తూ కనిపించారు. భారతదేశంలోని ప్రభుత్వాన్ని ‘ఫాసిస్ట్’గా వారు అభివర్ణించారు.

  3. ఇస్రో: 36 ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన ‘బాహుబలి’ రాకెట్

    వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను తీసుకొని ఇస్రోకి చెందిన ఎల్‌వీఎం3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

    ఆంధ్రప్రదేశ్‌లోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌ నుంచి ఉదయం 9 గంటలకు రాకెట్‌ను లాంచ్ చేశారు.

    మొత్తం 72 ఉపగ్రహాలు ప్రయోగించేందుకు ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో వన్‌వెబ్ ఒప్పందం కుదుర్చుకుంది.

  4. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.