దిల్లీ లిక్కర్ ‘స్కాం’: ఈడీ కార్యాలయంలో ముగిసిన కవిత విచారణ
మార్చి 11న తొలిసారి కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆ తరువాత 16న హాజరు కావాల్సి ఉండగా కవిత విచారణకు వెళ్లలేదు. అందుకు బదులుగా తన ప్రతినిధులను పంపారు.
లైవ్ కవరేజీ
కేథలిక్ చర్చి ఫాదర్లు ఇక పెళ్లి చేసుకోవచ్చా? బ్రహ్మచర్యంపై పోప్ ఫ్రాన్సిస్ మాటలు ఏం చెబుతున్నాయి?
ధన్యవాదాలు
ఇంతటితో నేటి లైవ్ పేజీని ముగిస్తున్నాం.
న్యూస్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీలో రేపు ఉదయం కలుసుకుందాం.
కాన్సులేట్ ‘ధ్వంసం’ మీద అమెరికాకు నిరసన తెలిపిన భారత్
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో గల భారత కాన్సులేట్ కార్యాలయం వద్ద ఆస్తుల ధ్వంసంపై తమ నిరసన తెలిపినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు.
అటువంటి ఘటనలు మళ్లీ చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరినట్లు వెల్లడించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పానీ పూరీ తిన్న జపాన్ ప్రధాని

ఫొటో సోర్స్, Narendra Modi/Twitter
ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాలు దిల్లీలోని బుద్ధ జయంతి పార్కును సందర్శించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఫుమియో కిషిదాలు పానీ పూరీ, లస్సీ రుచి చూశారు.
జపాన్ ప్రధాని ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోదీని జీ7 కూటమి సదస్సుకు ఫుమియో కిషిదా ఆహ్వానించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బ్రేకింగ్ న్యూస్, దిల్లీ లిక్కర్ ‘స్కాం’: 10 గంటల తరువాత ముగిసిన కవిత విచారణ.. మళ్లీ మంగళవారం హాజరు కావాలని సూచన

ఫొటో సోర్స్, UGC
ఫొటో క్యాప్షన్, ఈడీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న కవిత కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 10 గంటలపాటు సుదీర్ఘంగా విచారణ జరిగింది. మళ్లీ మంగళవారం విచారణకు రావాలని ఆమెకు సూచించారు.
ఇవాళ ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో కల్వకుంట్ల కవిత ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
రాత్రి సుమారు 9 గంటల వరకు కవితను ఈడీ విచారించింది.
ఈడీ విచారణ సుదీర్ఘంగా జరగడంతోపాటు మధ్యలో కొందరు వైద్యులు ఈడీ కార్యాలయానికి రావడంతో కవితను అరెస్టు చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి.
మరోవైపు వాన పడుతున్నప్పటికీ బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా ఈడీ కార్యాలయం వద్ద ఎదురు చూస్తూనే ఉన్నారు.
చివరకు ఉత్కంఠకు తెరదించుతూ కవిత సుమారు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు.
సెక్స్ వర్కర్ నుంచి హెల్త్ వర్కర్‌గా
విగ్గులతో వందల మంది మహిళలకు ఉపాధి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు

ఫొటో సోర్స్, Anumula Revanth Reddy/Twitter
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లీకేజీ కేసులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది.
రేవంత్ రెడ్డి పాదయాత్రలో ఉండటంతో జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటి గోడకు సిట్ ఇన్‌స్పెక్టర్నరేందర్ రావు నోటీసులు అంటించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం బయటకు రావడంతో హైదరాబాద్లోని బేగంబజార్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. దీన్ని ప్రభుత్వం సిట్‌కు బదిలీ చేసింది.
లీకేజీ వ్యవహారంలో జగిత్యాల జిల్లా మల్యాల మండలం నుంచి వంద మందికి 103 కంటే ఎక్కువ మార్కులు వచ్చాయని...మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి, కేసులో ఏ2గా ఉన్న రాజశేఖర్ రెడ్డి అత్యంత సన్నిహితులు అని రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో ఆరోపించారు.
ఈ విషయంలో ఆయన వద్ద ఉన్న ఆధారాలతో ఈ నెల 23న సిట్ ముందు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, UGC
‘బెడ్ రూమ్ వరకు వచ్చేస్తారా’ అని ఫొటోగ్రాఫర్లపై బాలీవుడ్ నటులు ఎందుకు విసుక్కుంటున్నారు
షీ జిన్‌పింగ్: ‘‘పుతిన్ మళ్లీ గెలుస్తారనే నమ్మకం ఉంది’’

ఫొటో సోర్స్, Reuters
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యాలో పర్యటిస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఆయన భేటీ అయ్యారు.
యుక్రెయిన్ మీద రష్యా దండయాత్ర మొదలైన తరువాత చైనా అధ్యక్షుడు రష్యాకు రావడం ఇదే తొలిసారి. రష్యా అధ్యక్ష భవనంలో పుతిన్‌తో షీ జిన్‌పింగ్ సమావేశమయ్యారు.
నేడు ఇద్దరు దేశాధినేతల మధ్య జరిగిన సమావేశం వ్యక్తిగతమైనది. రేపు అధికారిక చర్చలు మొదలవుతాయి.
2024 ఎన్నికల్లో పుతిన్‌ను మళ్లీ రష్యన్లు అధ్యక్షునిగా ఎన్నుకుంటారనే విశ్వాసం తనకు ఉందని షీ జిన్‌పింగ్ అన్నారు.
యుక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు పోయిన నెలలో చైనా కొన్ని ప్రతిపాదనలు చేసింది. అయితే వాటిని పశ్చిమ దేశాలు పెద్దగా పట్టించుకోలేదు.
అమృత్‌పాల్ సింగ్: పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉన్నట్లు పోలీసుల అనుమానాలు.. ఇప్పటి వరకు ఏం జరిగింది?
దిల్లీ లిక్కర్ ‘స్కాం’: 8 గంటలుగా కవితను విచారిస్తున్న ఈడీ

దిల్లీ లిక్కర్ ‘స్కాం’లో ఈడీ విచారణకు తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ జరుగుతోంది. ఆరు గంటలు దాటినా విచారణ ఇంకా కొనసాగుతోంది.
‘‘సాయంత్రం ఆరు గంటల తరువాత విచారణ చేపట్టకూడదని కోర్టు చెప్పినప్పటికీ కవితను ఈడీ విచారిస్తున్నారు’’ అని బీఆర్‌ఎస్ నేతలు విమర్శించారు.
మార్చి 11న తొలిసారి కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆ తరువాత 16న హాజరు కావాల్సి ఉండగా కవిత విచారణకు వెళ్లలేదు. అందుకు బదులుగా తన ప్రతినిధులను పంపారు.
ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే 20వ తేదీన విచారణకు రావాలంటూ ఈడీ మళ్లీ నోటీసులు జారీ చేసింది.
దాంతో కవిత నేడు దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. గతంలో ఇదే కేసులో సీబీఐ కూడా ఆమెను విచారించింది.
దిల్లీ లిక్కర్ ‘స్కాం’లో ఇప్పటికే అరుణ్ రామచంద్ర పిళ్లై, కవిత మాజీ సీఏ బుచ్చి బాబులను కూడా ఈడీ అరెస్టు చేసింది.
దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఈ కేసులో సీబీఐ, ఈడీ అరెస్టు చేసింది.
దిల్లీ లిక్కర్ పాలసీ తమకు అనుకూలంగా ఉండేలా చూసేందుకు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు కోట్ల రూపాయలు లంచం ఇచ్చారనేది ఈ కేసులోని ప్రధాన ఆరోపణ. అందులో కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించారని అభియోగం.
బస్సులు, రైళ్లలో పిన్నీసే ఆడవాళ్ల ఆయుధమా
దిల్లీ మద్యం కుంభకోణం: అరుణ్ రామచంద్ర పిళ్లైకి ఏప్రిల్ 3 వరకు జ్యుడీషియల్ కస్టడీ

ఫొటో సోర్స్, TWITTER/@PILLAIARP
‘దిల్లీ లిక్కర్ స్కాం’లో హైదరాబాద్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైను ఏప్రిల్ 3 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ దిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మార్చ్ 6న ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఈడీ ఆయన్ను పలుమార్లు విచారించింది.
‘నియంత’ కూతురి అవినీతి సంపాదన: రూ. 2 వేల కోట్ల ఆస్తుల్ని ఎలా కొన్నారు? ఎవరు సహకరించారు
మంగళవారం వరకు పంజాబ్‌లో ఇంటర్నెట్ నిలిపివేత

ఫొటో సోర్స్, Getty Images
‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ సారథి అమృత్ పాల్ సింగ్‌ను ఇంకా అరెస్టు చేయలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టుకు తెలిపింది.
అమృత్‌పాల్ కోసం పెద్దఎత్తున సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
ఆదివారం రాత్రి అమృత్ పాల్ సింగ్ అంకుల్ హర్జిత్ సింగ్, ఆయన డ్రైవర్ హర్‌ప్రీత్ సింగ్ పోలీసుల వద్ద లొంగిపోయినట్లు తెలిపారు. ఇప్పటి వరకు పోలీసులు మొత్తం 114 మందిని అరెస్టు చేశారు.
మంగళవారం వరకు ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్ సేవలు నిలిపివేసే ఉంటాయని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
అమృత్ పాల్ సింగ్ అరెస్టు కోసం పోలీసులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అమెరికా, బ్రిటన్‌లలో కొందరు నిరసనలకు దిగారు.
ఖలీస్తాన్ జెండా పట్టుకుని ఉన్న కొందరు లండన్‌లోని భారత హైకమిషన్ వద్ద మూడు రంగుల జెండాను తొలగించారు. దీని మీద బ్రిటన్ ప్రభుత్వానికి భారత్ ప్రభుత్వం తన నిరసన తెలియజేసింది. తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.
కవితను విచారిస్తున్న ఈడీ
దిల్లీ లిక్కర్ ‘స్కాం’లో ఈడీ విచారణకు తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ప్రస్తుతం ఆమెను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
మార్చి 11న తొలిసారి ఆమె ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆ తరువాత 16న హాజరు కావాల్సి ఉండగా కవిత విచారణకు వెళ్లలేదు. అందుకు బదులుగా తన ప్రతినిధులను పంపారు.
ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే 20వ తేదీన విచారణకు రావాలంటూ ఈడీ మళ్లీ నోటీసులు జారీ చేసింది.
దాంతో కవిత నేడు దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. గతంలో ఇదే కేసులో సీబీఐ కూడా ఆమెను విచారించింది.
దిల్లీ లిక్కర్ ‘స్కాం’లో ఇప్పటికే కల్వకుంట్ల కవిత సన్నిహితుడు అరుణ్ పిళ్లై, ఆమె మాజీ సీఏ బుచ్చి బాబులను కూడా ఈడీ అరెస్టు చేసింది.
దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఈ కేసులో సీబీఐ, ఈడీ అరెస్టు చేసింది.
దిల్లీ లిక్కర్ పాలసీ తమకు అనుకూలంగా ఉండేలా చూసేందుకు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు కోట్ల రూపాయలు లంచం ఇచ్చారనేది ఈ కేసులోని ప్రధాన ఆరోపణ. అందులో కల్వకుంట్ల కవిత పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గువాహటి: రైల్వే స్టేషన్‌లో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ టీ స్టాల్.. ‘‘గౌరవంగా బతకడం కోసమే ఈ పోరాటం’’ అంటున్న ట్రాన్స్‌జెండర్లు
అలీషా: ట్రాన్స్‌జెండర్ సెక్స్ వర్కర్ ఆరోగ్య కార్యకర్తగా ఎలా మారారు? - BBC She
