దిల్లీ లిక్కర్ స్కాం: నేడు మరొకసారి ఈడీ విచారణకు కల్వకుంట్ల కవిత
దిల్లీ లిక్కర్ ‘స్కాం’ కేసులో కల్వకుంట్ల కవిత నేడు మరొకసారి ఈడీ విచారణకు హాజరవుతున్నారు.
మార్చి 11న తొలిసారి కవితను ఈడీ విచారించింది.
ఈ కేసులో ఈడీ తనకు సమన్లు జారీ చేయడం మీద బుధవారం కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ 24వ తేదీన విచారణకు రానుంది.
దిల్లీలో లిక్కర్ పాలసీని తమకు ‘అనుకూలంగా’ మార్చుకునేలా కోట్ల రూపాయలను ‘లంచం’గా ఇచ్చారనేది ఆరోపణ.
