You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
టీడీపీ మంచిగానే ఉంటోంది కానీ 20 సీట్లే ఇస్తామంటోంది: పవన్ కల్యాణ్
టీడీపీ తమతో మంచిగానే ఉంటోంది కానీ 20 సీట్లకే తమను పరిమితం చేసేలా సంకేతాలు ఇస్తోందని ఆయన అన్నారు. అయినా, అలాంటి లోపాయికారీ ఒప్పందాలకు తాను లొంగే ప్రసక్తే లేదని పవన్ తేల్చిచెప్పారు.
లైవ్ కవరేజీ
డాక్టర్ కోసం ఊరి వాళ్లంతా ఇలా చేస్తారని ప్రభుత్వం కూడా ఊహించలేదు
హైదరాబాద్: సీఐఎస్‌ఎఫ్ రైజింగ్ డే పరేడ్‌లో పాల్గొన్న అమిత్ షా
హైదరాబాద్‌లోని హకీంపేట్‌లో ఉన్న నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అకాడమీలో సీఐఎస్‌ఎఫ్ రైజింగ్ డే పరేడ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఐఎస్‌ఎఫ్ జవాన్లు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
#INDvAUS : సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీ
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు.
టెస్ట్ క్రికెట్‌లో కోహ్లీకి ఇది 28వ శతకం.
మూడేళ్ల తర్వాత టెస్టు క్రికెట్‌లో విరాట్ సెంచరీ కొట్టాడు. అంతకుముందు 2019 నవంబర్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌పై 136 పరుగులు చేశాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోంది.
గుండెపోటు: చిన్న అబ్బాయికి స్టంట్ వేయాలంటే వైద్యులే చలించిపోయారు
BBC She: మహిళలు ఎలాంటి వార్తలను ఇష్టపడతారు?
ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటకు డాన్స్ చేయనున్న లారెన్ గాట్లిబ్
ఆస్కార్ 2023 అవార్డుల వేడుకలో పాపులర్ డాన్సర్ లారెన్ గాట్లిబ్ 'నాటు నాటు' పాటకు డాన్స్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
"అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదికపై డాన్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది" అని ఆమె అన్నారు.
అమెరికన్ అయిన లారెన్ గాట్లిబ్ డాన్సర్, యాక్టర్ కూడా. ఎక్కువగా భారత్‌లో వెండితెరపై, టీవీ షోలలో కనిపిస్తారు.
2013లో వచ్చిన హిందీ సినిమా 'ఎనీ బడీ కెన్ డాన్స్' (ఏబీసీడీ)లో ప్రధాన పాత్ర పోషించారు.
అమెరికన్ రియలిటీ టీవీ షో 'సో యూ థింక్ కెన్ డాన్స్' ప్రోగ్రాంలో భాగం పంచుకున్నారు.
భారత్‌లో టీవీ షో 'ఝలక్ ధిక్లా జా' డాన్స్ ప్రోగ్రాం ఆరవ సీజన్‌లో ద్వితీయ స్థానంలో నిలిచారు.
ఇజ్రాయెల్‌లో ప్రజాస్వామ్యన్ని అణచివేసే సంస్కరణలకు వ్యతిరేకంగా నిరసనలు
ఇజ్రాయెల్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన సంస్కరణలకు వ్యతిరేకంగా లక్షలాది మంది వీధుల్లోకొచ్చి ఆందోళన చేపడుతున్నారు. ఈ సంస్కరణలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు అంటున్నారు.
న్యాయ వ్యవస్థను సమూలంగా మార్చే ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకంగా 10 వారాలుగా నిరసనలు కొనసాగుతున్నాయి.
ఈ సంస్కరణలు న్యాయవ్యవస్థలో జడ్జిల నియామకంపై ప్రభుత్వం కలుగజేసుకునేందుకు తావిస్తాయి. సుప్రీంకోర్టుకు ఉన్న అధికారాలను పరిమితం చేస్తాయి.
టెల్ అవీవ్‌లో సుమారు 2,00,000 మంది వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. హైఫా వంటి నగరాల్లో రికార్డు స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరిపారు.
అయితే, ఈ మార్పులు ఓటింగ్ వ్యవస్థకు మేలుచేస్తాయని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం చెబుతోంది.
శనివారం ఇజ్రాయెల్ వ్యాప్తంగా సుమారు 5,00,000 మంది వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపినట్లు ప్రదర్శనకారులు చెబుతున్నారు.
దీన్ని "దేశ చరిత్రలోనే అతిపెద్ద నిరసనప్రదర్శన"గా ఇజ్రాయెలీ హారెట్జ్ వార్తాపత్రిక పేర్కొంది.
"దేశం చరిత్రలో అతిపెద్ద సంక్షోభాన్ని" ఎదుర్కొంటోందని ప్రతిపక్ష నాయకుడు యైర్ లాపిడ్ అన్నారు.
"తీవ్రవాదం చుట్టుముడుతోంది. ఆర్థికవ్యవస్థ పతనమవుతోంది. డబ్బు దేశం నుంచి బయటకి పోతోంది. ఇరాన్ నిన్ననే సౌదీ అరేబియాతో కొత్త ఒప్పందం మీద సంతకాలు చేసింది. కానీ, ఈ ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా ఇజ్రాయెల్‌లో ప్రజాస్వామ్యన్ని అణచివేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది" అని ఆయన విమర్శించారు.
ఆస్కార్ 2023 : ఈ అవార్డులకు ఇంత క్రేజ్ ఎలా వచ్చింది?
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.