‘ఆస్కార్ అవార్డు ప్రజెంటర్లలో నేనూ ఉన్నా’- ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించిన దీపికా పదుకొణె

డ్వేన్ జాన్సన్, మైఖేల్ జోర్డాన్, రిజ్ అహ్మద్, ఎమిలీ బ్లంట్, గ్లెన్ క్లోజ్, ట్రాయ్ కోట్సర్, జెన్నిఫర్ కానెలీ, సామ్యూల్ జాక్సన్, మెలిసా మెకార్తీ, జో సల్దానా, డానీ యెన్, జొనాథన్ మేజర్స్ కూడా ఈ కార్యక్రమంలో ప్రజెంటర్లుగా వ్యవహరించనున్నారు

లైవ్ కవరేజీ

  1. పదవి నుంచి తప్పుకున్న అమెరికా నేవీ చీఫ్

    అమెరికా, నేవీ సెక్రటరీ రాజీనామా

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ 2024లో జాన్ ఫెలోన్‌ను నేవీ సెక్రటరీ పదవికి నామినేట్ చేశారు(ఫైల్ ఫోటో).

    అమెరికా నేవీ సెక్రటరీ జాన్ ఫెలోన్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పెంటగాన్ బుధవారం ప్రకటించింది.

    ఆయన నిష్క్రమణ ‘తక్షణమే అమలులోకి వస్తుంది’ అని పెంటగాన్ ప్రతినిధి సీన్ పర్నెల్ 'ఎక్స్' పోస్ట్‌లో తెలిపారు.

    నేవీ అండర్ సెక్రటరీ హంగ్ కావో తాత్కాలిక సెక్రటరీగా బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు.

    ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం, హార్ముజ్ జలసంధిని అమెరికా నిరంతరం దిగ్బంధిస్తున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఫెలోన్ తప్పుకోవడం చర్చనీయాంశమైంది.

    "రక్షణ శాఖకు, అమెరికా నేవీకి సెక్రటరీ ఫెలోన్ అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆయన భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాం" అని పర్నెల్ రాశారు.

    అయితే ఫెలోన్ నిష్క్రమణకు గల కారణాలను నేవీ వెల్లడించలేదు.

    ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాండీ జార్జ్‌ను పదవి నుంచి తప్పుకోవాలని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ కోరిన కొద్ది వారాలకే ఈ ఘటన చోటుచేసుకుంది. మరో ఇద్దరు ఆర్మీ అధికారులు జనరల్ డేవిడ్ హాడ్నే, మేజర్ జనరల్ విలియం గ్రీన్‌లను కూడా ఇటీవల తమ బాధ్యతల నుంచి తప్పించారు.

  2. చెన్నైలో ఓటేసిన రజనీ, విజయ్, అజిత్

    రజనీకాంత్, తమిళనాడు ఎన్నికలు

    ఫొటో సోర్స్, ANI

    నటుడు రజనీకాంత్ చెన్నైలోని స్టెల్లా మారిస్ స్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    అలాగే, నటుడు అజిత్ కుమార్ చెన్నైలోని తిరువాన్మియూర్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు.

    టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ చెన్నైలోని నీలంకరై పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    ఎంఎన్ఎం చీఫ్, నటుడు కమల్ హాసన్ తన కుమార్తె శృతి హాసన్‌తో కలిసి చెన్నైలో ఓటు వేశారు.

    అజిత్ కుమార్

    ఫొటో సోర్స్, ANI

  3. అమెరికాతో చర్చలకు ఇరాన్ ఎందుకు ఆసక్తి చూపడం లేదు, తెరవెనుక ఏం జరుగుతోంది?

    అమెరికా, చర్చలు, ఇరాన్

    ఫొటో సోర్స్, Getty Images

    కాల్పుల విరమణ పొడిగించినప్పటికీ, ఇస్లామాబాద్‌లో జరగాల్సిన రెండో విడత చర్చలపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వంలో ప్రతినిధి బృందాన్ని పాకిస్తాన్‌కు పంపుతున్నట్లు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గతంలోనే ప్రకటించారు.

    నిజానికి వాన్స్ బుధవారం ఉదయం పాకిస్తాన్ చేరుకోవాల్సి ఉందని అమెరికా మీడియా తెలిపింది. అయితే, ఆయన పర్యటన రద్దయింది, ఎందుకంటే అమెరికా ప్రతినిధి బృందం వచ్చినప్పుడు మీటింగ్ టేబుల్ వద్ద ఇరాన్ నుంచి ఎవరైనా ఉంటారా లేదా అనే ప్రశ్నకు ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్ వద్ద కూడా ఇప్పటివరకు సమాధానం లేదు.

    చర్చలకు ప్రతినిధులను పంపడం తప్ప ఇరాన్‌కు మరో మార్గం లేదని ట్రంప్ మంగళవారం ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, అమెరికాతో చర్చలపై ఇరాన్ అధికారుల నుంచి ఎటువంటి సానుకూల సంకేతాలు రాలేదు.

    ఈ నేపథ్యంలో, రెండో విడత చర్చల్లో ఇరాన్ ఎందుకు పాల్గొనడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    దీనికి సంబంధించిన పూర్తి కథనం ఇక్కడ చదవండి.

  4. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో నేడే పోలింగ్

    తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ పోలింగ్

    ఫొటో సోర్స్, Rupak De Chowdhuri/NurPhoto via Getty Images

    ఫొటో క్యాప్షన్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు ముందు వీవీప్యాట్ యంత్రాలను తీసుకువెళ్తున్న ఎన్నికల సిబ్బంది

    పశ్చిమ బెంగాల్‌లో తొలి విడత, తమిళనాడులో మొత్తం అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి.

    పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలుండగా మొదటి విడతలో 152 నియోజకవర్గాలకు, తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.

    బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ - బీజేపీ మధ్య ప్రత్యక్ష పోరు కనిపిస్తుండగా, తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకే మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది.

  5. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

  6. అమెరికాతో చర్చలకు ఇరాన్ ఎందుకు ఆసక్తి చూపడం లేదు, తెరవెనుక ఏం జరుగుతోంది?

  7. 'గెలిచేశానని అనుకున్నాడు'.. కానీ, చివరిక్షణంలో..

  8. హార్ముజ్ జలసంధిలో టెన్షన్: మూడు కార్గో నౌకలపై ఇరాన్ దాడులు, రెండు స్వాధీనం

  9. 'నమాజ్‌‌తో ఆరోగ్య ప్రయోజనాలు’అనే వీడియోతో ట్రోలింగ్‌కు గురైన నమిత థాపర్ ఎవరు?

  10. ‘‘ఇరాన్‌లో ప్రతి బ్రిడ్జ్‌ను, పవర్ స్టేషన్‌ను పేల్చేస్తాం’’ అని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ట్రంప్ కాల్పుల విరమణను ఎందుకు పొడిగించారు?

  11. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతి

  12. "నా సొంత ఇంట్లోనే నన్ను రహస్యంగా వీడియో తీయడం చిత్రవధకు గురిచేసింది’’

  13. 'ఈ వృక్షాల కింద శవాలున్నాయి’

  14. పహల్గాం దాడి: ఏడాది గడిచినా ఆ బాధ వీడటం లేదు.. బాధితులు ఏం చెబుతున్నారు?

  15. గర్భిణులు పూర్వం కూర్చుని ప్రసవించేవారా?

  16. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకటరామిరెడ్డి డిస్మిస్‌, అసలేం జరిగింది, ఎవరేమన్నారు?

  17. హార్ముజ్‌కు భారత్ యుద్ధనౌకలను పంపగలదా? పరిణామాలు ఎలా ఉంటాయి, రక్షణ నిపుణులు ఏం చెబుతున్నారు?

  18. నందిగ్రామ్‌: ‘ఇక్కడ తొలగించిన ఓట్లలో ఎక్కువ శాతం ముస్లింలవే’ అనే ఆరోపణలు ఎందుకు వినిపిస్తున్నాయి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

  19. తమిళనాడు ఎన్నికలు 2026: ద్రవిడ కోటలో విజయ్ 'ఎంట్రీ'.. ఈ పోరులో గెలుపెవరిది?

  20. బ్రిటిష్ సైనిక స్థావరానికి సమీపంలో జన్మించిన వందల మంది చిన్నారుల తండ్రులు బ్రిటిషు సైనికులేనని ఎలా కనిపెట్టారు, ఆ ‘తండ్రులు’ ఏం చెబుతున్నారు?