లైవ్ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు కలుద్దాం.
సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో సిసోడియా దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే జైలులో ఉన్న మరొక మంత్రి సత్యేంద్ర జైన్ కూడా రాజీనామా చేశారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు కలుద్దాం.
హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీ కొత్త డైరెక్టర్‌గా ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన అమిత్ గార్గ్ నియమితులయ్యారు.
అమిత్ గార్గ్, 1993 సంవత్సరం ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఇప్పటి వరకు నేషనల్ పోలీస్ అకాడమీ అడిషనల్ డైరెక్టర్‌గా గార్గ్ ఉన్నారు.
ఇప్పటి వరకు డైరెక్టర్‌గా ఉన్న 1987 బ్యాచ్‌కు చెందిన ఎ.సీమా రాజన్ పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో అమిత్ గార్గ్‌ను నియమించారు.

ఫొటో సోర్స్, PV Sunil Kumar/Facebook
భోపాల్-ఉజ్జయిని ప్యాసింజర్ రైలు పేలుళ్ల కేసులో 8 మంది దోషుల్లో ఏడుగురికి ఎన్‌ఐఏ కోర్టు మరణశిక్ష విధించింది. మరొకరికి జీవితకాల కారాగారశిక్ష పడింది.
2017 మార్చి 7వ తేదీన మధ్యప్రదేశ్‌లోని షాజాపుర్ జిల్లాలోగల జాబరి స్టేషన్ వద్ద భోపాల్-ఉజ్జయిని ప్యాసింజర్ రైలులో బాంబు పేలింది. ఈ ఘటనలో కొందరికి గాయాలు అయ్యాయి.
ఈ కుట్ర వెనుక ఉన్నవారు ఇస్లామిక్ స్టేట్ నుంచి స్ఫూర్తి పొందినట్లు నాడు ఎన్‌ఐఏ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, FACEBOOK/DR.PONGURUNARAYANA
అమరావతి అసైన్డ్ భూముల కేసులో మాజీ మంత్రి పి నారాయణకి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఆయన భార్య రమాదేవి కూడా విచారణకు రావాలంటూ 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు.
నారాయణ కుమార్తెలు సింధూర, శరణికి కూడా సీఐడీ నోటీసులు ఇచ్చింది. ప్రమీల అనే నారాయణ సంస్థల ఉద్యోగి, రామకృష్ణ హౌసింగ్ ఎండీ అంజనీ కుమార్ సహా అందరూ మార్చి 7న విచారణ కి హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.
ఇటీవల నారాయణ, ఆయన కుటుంబీకుల ఇళ్లలో సీఐడీ సోదాలు చేసింది. ఈ సందర్భంగా తమకు పలు ఆధారాలు లభించినట్టు సీఐడీ అధికారులు వెల్లడించారు.
అమరావతి భూ లావాదేవీల విషయంలో నారాయణ పాత్రకి సంబంధించిన సమాచారం సేకరించామని తెలిపారు.
దానికి కొనసాగింపుగా సీఐడీ ముందు విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడం ఆసక్తిగా మారింది.
టీడీపీ హయాంలో నారాయణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, అమరావతి లాండ్ పూలింగ్ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు.

ఫొటో సోర్స్, Facebook/Manish Sisodia
దిల్లీ లిక్కర్ ‘స్కాం’లో సీబీఐ అరెస్టు చేసిన మనీశ్ సిసోడియా, ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో సిసోడియా దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఇప్పటికే జైలులో ఉన్న మరొక మంత్రి సత్యేంద్ర జైన్ కూడా రాజీనామా చేశారు.
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వారి రాజీనామాలను ఆమోదించారు.

ఫొటో సోర్స్, PETA
కేరళలోని ఒక ఆలయంలో పూజా కార్యక్రమాల కోసం అసలైన ఏనుగు స్థానంలో రోబో ఏనుగును తెచ్చి పెట్టి వినియోగిస్తున్నారు.
త్రిచూర్ జిల్లాలోని ఇరింజాదప్పిళ్లే శ్రీకృష్ణ ఆలయ అధికారులు.. పండుగలు, పూజల కోసం సజీవ జంతువులను ఉపయోగించబోమని ప్రతినబూనారు.
ఈ నేపథ్యంలో ఆలయంలో ఉపయోగించటానికి రోబో ఏనుగును తీసుకువచ్చారు. స్వచ్ఛంద సంస్థ అయిన పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) ఇండియాతో పాటు సినీ నటి పార్వతి తిరువొత్తు ఈ మర ఏనుగును బహూకరించారు.
జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరించకుండా పండుగలు, పూజలను నిర్వహించటానికి ఈ రోబో ఏనుగు తోడ్పడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ రోబో ఏనుగు 11 అడుగుల ఎత్తు, 800 కిలోల బరువు ఉందని, ఐరన్ ఫ్రేమ్‌తో దీనిని తయారు చేశారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక కథనంలో తెలిపింది.
ఇతర ఆలయాల్లో కూడా నిజమైన ఏనుగల స్థానంలో రోబో ఏనుగులను ఉపయోగిస్తారని ఆశిస్తున్నట్లు ఇరింజాదప్పిళ్లే శ్రీకృష్ణ ఆలయ పూజారి రాజ్‌కుమార్ నంబూద్రి ఆ పత్రికతో చెప్పారు.
కేరళలోని ఆలయాల్లో ఏనుగుల పాత్ర చాలా ప్రముఖంగా ఉంటుంది. దేశంలో బందీలుగా ఉన్న దాదాపు 2,500 ఏనుగుల్లో ఐదో వంతు ఏనుగులు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి.
ఈ ఏనుగుల పట్ల వ్యవహరించే తీరుతో జంతు సంక్షేమ కార్యకర్తలు చాలా ఏళ్లుగా ఆందోళన చేస్తున్నారు.
కేరళలో బందీలుగా ఉన్న ఏనుగుల్లో 2018 నుంచి 2023 మధ్య ఐదేళ్లలో 138 ఏనుగులు చనిపోయాయని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ యానిమల్ రైట్స్ గత వారంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు ఒక పరుగు తేడాతో ఇంగ్లండ్‌పై అద్భుత విజయాన్ని సాధించింది.
రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఇంగ్లండ్ 258 పరుగులు చేయాల్సి ఉండగా, న్యూజీలాండ్ బౌలర్లు ఆ జట్టును 256 పరుగులకే పరిమితం చేసి తమ జట్టుకు చరిత్రాత్మక విజయాన్ని అందించారు.
ఇంగ్లండ్ ఒక దశలో 201/5తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ దశలో ఇంగ్లండ్ విజయానికి 57 పరుగులు కావాల్సి ఉండగా, చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. క్రీజులో బెన్ స్టోక్స్, జో రూట్ ఉన్నారు. ఇక ఇంగ్లండ్ విజయం లాంఛనమే అనుకున్నారంతా.
అప్పుడే లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్ తన అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను కివీస్ వైపు మొగ్గేలా చేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఒక పరుగు వ్యవధిలో వరుసగా బెన్ స్టోక్స్ (33; 6 ఫోర్లు), జో రూట్ (95; 8 ఫోర్లు, 3 సిక్సర్లు)లను అవుట్ చేశాడు. ఆ తర్వాత జేమ్స్ అండర్సన్‌ను అవుట్ చేసి జట్టును గెలిపించాడు.
ఇంగ్లండ్ కోల్పోయిన చివరి అయిదు వికెట్లలో మూడు వాగ్నర్ ఖాతాలోనే చేరాయి.
ఈ మ్యాచ్ టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 435/8 వద్ద డిక్లేర్ చేసింది.
జో రూట్ (153 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ సెంచరీతో అదరగొట్టగా, హ్యారీ బ్రూక్ (186; 24 ఫోర్లు, 5 సిక్సర్లు) కొద్దిలో డబుల్ సెంచరీని కోల్పోయాడు.
అనంతరం న్యూజీలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 53.2 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది.
తర్వాత ఫాలో ఆన్ ఆడిన కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 483 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ ముందు 258 పరుగుల విజయ లక్ష్యం నిలిచింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
రెండో ఇన్నింగ్స్‌లో 132 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
టామ్ బ్లండెల్ (90), టామ్ లాథమ్ (83), డరైల్ మిచెల్ (54) ఆకట్టుకున్నారు.
తర్వాత రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ 256 పరుగులకు ఆలౌటై ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది.
ఫాలోఆన్ ఆడినన్యూజీలాండ్ ఈవిజయాన్ని అందుకుంది.
145 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఫాలోఆన్ ఆడిన జట్టు విజయం సాధించడం ఇది నాలుగోసారి మాత్రమే.
ఈ మ్యాచ్ కంటే ముందు 2001 కోల్‌కతా టెస్టు, 1981 లీడ్స్ టెస్టు, 1894 సిడ్నీ టెస్టుల్లో ఫాలోఆన్ ఆడిన జట్లు గెలిచాయి.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ టెస్టులో ఫాలో ఆన్ ఆడిన భారత్ 171 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

ఫొటో సోర్స్, AFP
రష్యా, యుక్రెయిన్ సైన్యాల మధ్య యుక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని బఖ్ముత్ నగరంలో భీకర పోరాటం సాగుతోంది. ఈ నగరంలో పరిస్థితి విషమిస్తోందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియన్‌స్కీ చెప్పారు.
ఏడాది కిందట యుక్రెయిన్ మీద దండెత్తివచ్చిన రష్యా సైనిక బలగాలు.. దోన్యస్క్ ప్రాంతంలోని బాఖ్ముత్ నగారన్ని స్వాధీనం చేసుకోవటానికి ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నాయి.
‘‘మా స్థావరాలను రక్షించుకోవటానికి ఉపయోగించగల ప్రతిదానినీ శత్రువు నిరంతరం ధ్వంసం చేస్తున్నాడు’’ అని జెలియెన్‌స్కీ చెప్పారు.
రష్యా దాడులు ఉధృతం చేయటంతో బాఖ్ముత్‌లో తాము పట్టునిలుపుకోవటం, రక్షించుకోవటం కష్టమవుతోందని పేర్కొన్నారు.
‘రష్యా ఉగ్రవాదం’ నుంచి తమ భూభాగాన్నంతటినీ సంరక్షించుకోవటానికి ఆధునిక యుద్ధ విమానాలను పంపించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.