లైవ్ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు కలుద్దాం.
మద్యం పాలసీ కేసులో అరెస్టయిన దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను 5 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది రూస్ అవెన్యూ కోర్టు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు కలుద్దాం.

ఫొటో సోర్స్, KCR/Facebook
దిల్లీ లిక్కర్ ‘స్కాం’ కేసులో ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించారు.
‘అదానీ, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య ఉన్న సంబంధాల నుంచి ప్రజలను దారి మళ్లించడానికి చేసిన పని తప్ప మరొకటి కాదు’ అని కేసీఆర్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పంజాబ్‌లోని పాటియాల యూనివర్సిటీలో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక విద్యార్థి చనిపోయినట్లు పాటియాల డిఎస్‌పీ జస్వీందర్ సింగ్ తెలిపారు. మరో ఇద్దరు గాయపడినట్లు వెల్లడించారు.
బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న నవజోత్ సింగ్ అనే విద్యార్థిని కత్తితో పొడిచినట్లు పోలీసులు చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
మద్యం పాలసీ కేసులో ఆదివారం నాడు అరెస్టయిన దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను 5 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది రూస్ అవెన్యూ కోర్టు.
మార్చి 4వ తేదీ వరకు ఆయన సీబీఐ కస్టడీలో ఉంటారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్ of X ముగిసింది, 2
అంతకు ముందు అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ మనీష్ సిసోడియాను కోర్టులో హాజరుపరిచారు.

ఫొటో సోర్స్, Subrata Kumar Pati
మరోవైపు సిసోడియా అరెస్ట్‌కు వ్యతిరేకంగా దేశలోని పలు ప్రాంతాలలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు.

ఫొటో సోర్స్, BJP
కర్ణాటకలో కొత్తగా నిర్మించిన శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం మధ్యాహ్నం ప్రారంభించారు.
అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ బి.ఎస్.యడ్యూరప్ప కూడా పాల్గొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలైంది. రెండు రాష్ట్రాల్లోనూ సాయత్రం 4 గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది.
రెండు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున శాసనసభ స్థానాలు ఉన్నాయి.
అయితే మేఘాలయలో యూడీపీ అభ్యర్ధి హెచ్.డి.ఆర్.లింగ్దో మరణం వల్ల ఒక స్థానానికి ఎన్నిక వాయిదా పడింది.
అలాగే నాగాలాండ్‌లోని ఒక నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఒకరు పోటీ లేకుండా గెలిచారు. దీంతో ఆ స్థానానికి పోలింగ్ నిర్వహించటం లేదు.
మేఘాలయలో 21.75 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. నాగాలాండ్‌లో 13.17 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు త్రిపుర శాసనసభ ఎన్నికల ఫలితాలు మార్చి 2వ తేదీన వెలువడతాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, EPA
ఇటలీ దక్షిణ తీరంలోని సముద్రంలో వలసదారులతో ప్రయాణిస్తున్న ఒక పడవ మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 59 మంది చనిపోయారు. మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు.
ఈ విషాదంలో మరో 30 మంది వరకూ గల్లంతయ్యారని ఇటలీ అంతర్గత వ్యవహారాల మంత్రి చెప్పారు.
ఇటలీ లోని కాలాబ్రియా ప్రాంతంలో క్రొటోన్ పట్టణం వద్ద తీరానికి రావటానికి ప్రయత్నిస్తున్న బోటు.. సముద్రపు అలల తాకిడికి విరిగిపోయింది. ఆ సమయంలో బోటులో కనీసం 150 మంది ఉన్నట్లు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారు చెప్తున్నారు.

ఫొటో సోర్స్, Italian Red Cross
ఈ ప్రమాదం నుంచి 80 మంది ప్రాణాలతో బయటపడ్డట్లు ఇటలీ కోస్ట్‌గార్డ్ తెలిపింది. వారిలో కొందరు బోటు మునిగిపోయాక ఎలాగోలా ఒడ్డుకు చేరుకున్నారని చెప్పింది.
ఈ పడవ కొన్ని రోజుల కిందట తుర్కియే నుంచి బయలుదేరింది. ఇందులో అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, సోమాలియా, ఇరాన్ దేశాలకు చెందిన దాదాపు 200 మంది వలసదారులు ఉన్నట్లు చెప్తున్నారు.

ఫొటో సోర్స్, Shutterstock
ఒడ్డుకు చేరుకునే క్రమంలో గాలులు, అలల తాకిడికి ఈ పడవ రాళ్లను ఢీకొట్టి ముక్కలుగా విరిగిపోయిందని చెప్తున్నారు. ఆ సమయంలో పడవలో ‘‘200 మందికి పైగా జనం’’ ప్రయాణిస్తున్నారని సహాయ సిబ్బంది ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పారు.
ఆ లెక్కన చూస్తే ఇంకా 60 మందికి పైగా వలసదారుల ఆచూకీ తెలియటం లేదు. వారి కోసం తీరంలోను, సముద్రం మీద భారీ గాలింపు, సహాయ చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదం పట్ల ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ విచారం వ్యక్తం చేశారు. ఈ మరణాలకు కారణం మనుషులను అక్రమంగా రవాణాచేసే ట్రాఫికర్లేనని తప్పుపట్టారు.

బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.