You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

భారత మహిళల క్రికెట్ జట్టు: ఒకే రోజు రెండు రికార్డులు సాధించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్

ఐర్లండ్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా అర్ధంతరంగా నిలిచిపోగా.. డక్‌వర్త్ లూయిస్ రూల్ ప్రకారం భారత్ 5 పరుగులతో గెలిచినట్లు ప్రకటించారు.

లైవ్ కవరేజీ

  1. తుర్కియే భూకంపం వీడియో: డాష్‌కామ్‌లో రికార్డయిన భూకంపం

  2. తుర్కియేలో మళ్లీ భూకంపం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద చిక్కుకున్న జనం

    తుర్కియే, సిరియాల్లో పెను భూకంపం వినాశనం సృష్టించి రెండు వారాలు గడిచాయే లేదో మరోసారి తీవ్ర భూకంపాలు ఆ దేశాలను వణికించాయి.

    స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8:04 గంటల సమయంలో రిక్టర్ స్కేలు మీద 6.4 తీవ్రతతో కూడిన భూకంపం దక్షిణ తుర్కియేను తాకింది. ఆ తర్వాత మూడు నిమిషాలకే 5.8 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది.

    తాజా భూకంపంలో తుర్కియేలో ముగ్గురు మృతి చెందినట్లు అంతర్గత శాఖ మంతరి సులేమాన్ సోయ్లు చెప్పారు. మరో 213 మంది గాయపడ్డట్లు తెలిపారు.

    ఫిబ్రవరి 6వ తేదీ నాటి భూకంపంలో బలహీనపడిన భవనాలు తాజా భూకంపాలతో కుప్పకూలాయి.

    హాటే నగరంలో కొందరు జనం తాజా భూకంపంలో కూలిన శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు రాయిటర్స్ వార్తా సంస్థకు కొందరు సాక్షులు చెప్పారు.

    శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం సహాయ బృందాలు గాలిస్తున్నాయి.

    సిరియా సరిహద్దులో ఉన్న ప్రాంతంలో ఆ తర్వాత కూడా పదుల సంఖ్యలో ప్రకంపనలు కూడా వచ్చాయి. సిరియాలో 470 మంది గాయపడ్డట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది.

    ఫిబ్రవరి 6వ తేదీన 7.8 తీవ్రతతో వచ్చిన పెను భూకంపంతో తుర్కియే, సిరియాలు అతలాకుతలమయ్యాయి. రెండు దేశాల్లో కలిపి మృతుల సంఖ్య 44,000 దాటింది.

    ఆ భూకంపం తర్వాత దాదాపు 6,000 ప్రకంపనలను తుర్కియే అధికారులు నమోదు చేశారు. ఆ ప్రకంపనల్లో తాజా భూకంపం మరింత తీవ్రంగా ఉందని అక్కడ ఉన్న బీబీసీ బృందం చెప్పింది.