You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

నందమూరి తారకరత్న కన్నుమూత, సోమవారం సాయంత్రం అంత్యక్రియలు

బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్న కన్నుమూశారు. గుండెపోటుకు గురై 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న కొద్ది సేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.

లైవ్ కవరేజీ

  1. మహా శివరాత్రి: మానవాకారంలో శివుడు ఎక్కడ ఉన్నాడు?

  2. యుక్రెయిన్ యుద్ధం వల్ల తిరిగొచ్చిన మెడిసిన్ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరడం లేదు?

  3. అమెరికా మిసిసిపి రాష్ట్రంలో కాల్పులు.. ఆరుగురు మృతి, శాం కాబ్రాల్ - బీబీసీ న్యూస్, వాషింగ్టన్ డీసీ

    అమెరికాలోని మిసిసిపి రాష్ట్రంలో ఒక గ్రామీణ పట్టణంలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

    మెంఫిస్ నగరానికి దక్షిణంగా 72 కిలోమీటర్ల దూరంలోని అర్కాబుట్లా పట్టణంలో ఈ హత్యలు చోటు చేసుకున్నాయి. ఈ ఊర్లో మొత్తం జనాభా 300 మంది కన్నా తక్కువే.

    రెండు ఇళ్లలో ముగ్గురి మృతదేహాలు లభించగా.. దుకాణంలో ఒకరు, కారులో ఒకరు, రోడ్డు మీద ఒకరు చనిపోయి కనిపించారు.

    వీరందరూ తుపాకీ కాల్పుల్లో చనిపోయారు. స్థానిక నివాసి అయిన 52 ఏళ్ల అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

    అనుమానితుడు ఒంటరిగానే ఈ హత్యలకు పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారని, కారణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదని మిసిసిపి గవర్నర్ టేట్ రీవ్స్ శుక్రవారం ట్వీట్ చేశారు.

    స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల సమయంలో ఒక దుకాణంలోకి ప్రవేశించిన అనుమానితుడు ఒక వ్యక్తిని కాల్చి చంపాడని పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు.

    అనంతరం అతడు సమపీంలోని ఒక ఇంట్లోకి వెళ్లి ఒక మహిళను కాల్చి చంపాడని, ఆమె భర్తను గాయపరిచాడని వెల్లడించారు. ఆ తర్వాత తన సొంత ఇంటికి వెళ్లి అక్కడ మరో ఇద్దరిని కాల్చి చంపాడని చెప్పారు.

    ప్రత్యక్ష సాక్షులు చెప్పిన పోలికల ఆధారంగా.. ఒక కారులో ప్రయాణిస్తున్న అనుమానితుడిని పోలీసులు కొంత దూరం చేజ్ చేసి పట్టుకున్నారు. ఆ కారులో ఒకరు, రోడ్డు మీద మరొకరు చనిపోయి కనిపించారు.

    ఈ కాల్పుల ఘటన ఈ ఏడాదిలో 73వ మాస్ షూటింగ్ అని గన్ వయొలెన్స్ ఆర్కైవ్ అనే స్వచ్ఛంద సంస్థ చెప్పింది.

    నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది తుపాకీ కాల్పుల్లో గాయపడటమో, చనిపోవటమో జరిగితే ఆ సంఘటనను ‘మాస్ షూటింగ్’ అని జీవీఏ నిర్వచిస్తోంది.