లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
చాలా మంది సాయుధులు పోలీసుల మీద కాల్పులు జరిపారు. పోలీసులు, సాయుధుల మధ్య భారీ స్థాయిలో కాల్పులు జరుగుతున్నాయి. దాడికి దిగిన వారు గ్రెనేడ్లు కూడా విసురుతున్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
కరాచీ పోలీసు ప్రధాన కార్యాలయం మీద జరిగిన దాడిలో ఇద్దరు చనిపోయారు. వీరిలో ఒకరు పోలీసు, మరొకరు ‘తీవ్రవాది’గా భావిస్తున్నారు.
ప్రధాన కార్యాలయంలోని అయిదు అంతస్తుల్లో మూడు అంతస్తులను పోలీసులు తమ అధీనంలోకి తెచ్చుకున్నట్లు సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ తెలిపారు.
ఈ దాడికి బాధ్యత తమదేనని తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్తాన్ ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌లోని కరాచీలో గల పోలీసు ప్రధాన కార్యాలయం మీద దాడి జరిగింది.
పోలీసులు, సాయుధుల మధ్య ఇంకా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.
దాడి చేస్తున్న వారు గ్రెనేడ్లు కూడా విసురుతున్నారు.
ప్రధానకార్యాలయంలో విద్యుత్‌ను ఆపివేశారు. అన్ని ద్వారాలను మూసివేశారు. ఇతర ప్రాంతాల నుంచి పోలీసులు ప్రధాన కార్యాలయం దిశగా కదిలారు.
పోలీసుల ప్రధాన కార్యాలయంలోకి ఆరు నుంచి ఏడుగురు సాయుధులు ప్రవేశించినట్లు పాకిస్తాన్ హోంశాఖ మంత్రి రాణా సనహుల్లా తెలిపారు.
సింధ్ ప్రభుత్వంతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, అన్ని రకాలుగా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు.
ప్రస్తుతం భవనంలోని మూడో అంతస్తులో పోలీసులకు, సాయుధుల మధ్య కాల్పులు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Reuters
పాకిస్తాన్‌లోని కరాచీలో గల పోలీసు ప్రధాన కార్యాలయం మీద దాడి జరిగింది.
చాలా మంది సాయుధులు పోలీసుల మీద కాల్పులు జరుపుతున్నారు. పోలీసులు, సాయుధుల మధ్య భారీ స్థాయిలో కాల్పులు జరుగుతున్నాయి.
దాడి చేసిన వారు గ్రెనేడ్లు కూడా విసురుతున్నారు.
ప్రధానకార్యాలయంలో విద్యుత్‌ను ఆపివేశారు. అన్ని ద్వారాలను మూసివేశారు. ఇతర ప్రాంతాల నుంచి పోలీసులు ప్రధాన కార్యాలయం దిశగా కదిలారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం 8 నుంచి 9 మంది సాయుధులు ఉన్నారు. అయితే ఇంకా పూర్తి వివరాలు అందలేని సింద్ ప్రభుత్వ ప్రతినిధి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మహారాష్ట్రలో ఏక్‌నాథ్ శిండే వర్గమే అసలైన శివసేన పార్టీ అని, పార్టీ గుర్తు 'విల్లు, బాణం' వారికే చెందాలని ఈరోజు ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది.
దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే స్పందిస్తూ, సత్యం గెలిచిందని అన్నారు.
"ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు. సత్యమే గెలిచింది. ప్రజలు మా ఆలోచనలతోనే ఏకమవుతున్నారు. ఇది బాలాసాహెబ్ ఠాక్రే, ఆనంద్ దిఘేల ఆలోచనల విజయం" అని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గత ఏడాది శివసేన పార్టీలో చీలక వచ్చిన సంగతి తెలిసిందే. ఏక్‌నాథ్ శిండే 39 ఎమ్మెల్యేలతో పార్టీ నుంచి బయటికొచ్చారు.
తరువాత, ఉద్ధవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ శిండే ఇద్దరూ శివసేన మాదంటే మాదని గొడవపడ్డారు.
వివాదం సద్దుమణగకపోవడంతో, ఈ వ్యవహారం ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లింది.
అసలు శివసేన పార్టీ ఎవరిదో తేల్చాల్సిన భాద్యత ఎన్నికల సంఘంపై పడింది.
నేడు ఎన్నికల సంఘం ఏక్‌నాథ్ శిండే వర్గానికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
ఒక ‘ప్రముఖ అంతర్జాతీయ మీడియా కంపెనీ కార్యాలయాల్లో’ నిర్వహించిన సర్వే తరువాత అవకతవకలను గుర్తించినట్లుగా ఇన్‌కం ట్యాక్స్(ఐటీ) విభాగం ప్రకటించింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) విడుదల చేసిన ఒక పేజీ ప్రకటనలో ఎక్కడా బీబీసీ పేరును ప్రస్తావించలేదు. కేంద్ర ఆర్థికశాఖ పరిధిలో సీబీడీటీ పని చేస్తుంది.
ఐటీ విభాగం చేసిన ఆరోపణలను సెంట్రల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ప్రచురించింది. బీబీసీ కార్యాలయాల్లో చేపట్టిన విచారణకు సంబంధించి ఐటీ విభాగం ఈ ప్రకటన జారీ చేసినట్లుగా కనిపిస్తోంది.
ఐటీ విభాగం నుంచి అధికారికంగా ఏమైనా స్పందన వస్తే అందుకు అనుగుణంగా తాము స్పందిస్తామని బీబీసీ తెలిపింది. ఐటీ అధికారుల విచారణకు పూర్తిగా సహకరించినట్లు ఇంతకు ముందు ఆ సంస్థ వెల్లడించింది.
దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో మూడు రోజుల పాటు ఐటీ అధికారులు వివిధ రకాల డాక్యుమెంట్లను పరిశీలించారు. కొందరు బీబీసీ ఉద్యోగులను వారు ప్రశ్నించారు.
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ విభాగం చేపట్టిన ‘సర్వే’ మీద దేశీయంగా, అంతర్జాతీయంగా అనేక విమర్శలు వచ్చాయి. దీన్ని ‘పత్రికా స్వేచ్ఛ మీద దాడి’గా ప్రతిపక్షాలు పేర్కొన్నాయి.

ఫొటో సోర్స్, UGC
శంకర్ వడిసెట్టి, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పర్యటనను తూర్పు గోదావరి జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన కాన్వాయ్‌ని ముందుకు కదలనివ్వలేదు. దాంతో, ఆయన కాలినడకన అనపర్తి బయలుదేరారు.
అనపర్తి నియోజకవర్గంలోని బలభద్రపురం వద్ద ఆయన కాన్వాయ్ ముందుకు సాగేందుకు అనుమతిలేదని చెప్పడంతో టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగాయి.
దాంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. చివరకు తన కాన్వాయ్‌ని అడ్డుకోవడంతో చంద్రబాబు కాలినడకన అనపర్తి బయలుదేరారు.

ఫొటో సోర్స్, UGC
నిన్న కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు ఈరోజు ఉదయం సామర్లకోటలో పార్టీ అంతర్గత సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత అనపర్తిలో నిర్వహించే సభకు హాజరయ్యేందుకు బయలుదేరారు.
కానీ మార్గం మధ్యలో పోలీసులు ఆయన కాన్వాయ్‌ని బిక్కవోలు వద్ద అడ్డుకున్నారు. రోడ్ షో నిర్వహణకు అనుమతి లేదని తేల్చారు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినందున, కోడ్ అమలులో ఉందని పోలీసులు టీడీపీ నేతలకు తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
అయితే, తమ షెడ్యూల్ ప్రకారం అనపర్తి వెళ్లేందుకు అనుమతించాలని టీడీపీ నేతలు కోరినా పోలీసులు ససేమీరా అనడంతో పరిస్థితి వేడెక్కింది.
అనపర్తి వంటి చోట్ల బారికేడ్లు అడ్డుగా పెట్టి కార్యకర్తలు రాకుండా పోలీసులు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. బారీకేడ్లను అడ్డు తొలగించి టీడీపీ కార్యకర్తలు దూసుకొచ్చారు.
బలభద్రపురం చేరుకోగానే పోలీసులు రోడ్డు మీద బైఠాయించి చంద్రబాబు కాన్వాయ్ ముందుకు సాగకుండా నిలిపివేయడంతో చివరకు ఆయన, తన పార్టీ నాయకులతో కలిసి కాలినడకన అనపర్తి బయలుదేరారు.

ఫొటో సోర్స్, ANI
భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ దిల్లీలోని అరుణ్ జైట్లీ స్డేడియంలో శుక్రవారం ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టు 263 పరుగులకు ఆలౌటైంది.
ఉస్మాన్ ఖవాజా (81 పరుగులు) అత్యధిక పరుగులు సాధించాడు. పీటర్ హ్యాండ్స్‌కోంబ్ 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
భారత్ బౌలర్లలో మహ్మద్ షమీ నాలుగు వికెట్లు తీశాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా మొదటిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(13), కేఎల్ రాహుల్ (4)లు ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Twitter/Potus
చైనా బెలూన్‌ను నేలకూల్చడం మీద త్వరలోనే ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మాట్లాడుతానని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు.
ఫిబ్రవరి 4న అమెరికా వైమానిక దళానికి చెందిన ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ సౌత్ కరోలినాలో చైనా బెలూన్‌ను నేలకూల్చింది. అది హైటెక్ చైనీస్ గూఢచారి బెలూన్ అని అమెరికా అధికారులు ప్రకటించారు.
కాగా, గూఢచర్యం ఆరోపణలను చైనా ఖండించింది. అది వాతావరణ సమాచారాన్ని సేకరించడానికి ప్రయోగించామని, అమెరికన్ గగనతలం వైపు దారితప్పి ఆ బెలూన్ ప్రయాణించిందని పేర్కొంది.
బెలూన్ పేల్చివేసిన అనంతరం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు.
“నేను త్వరలో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మాట్లాడుతాను. మేం ఈ విషయం మీద లోతుగా చర్చిస్తాం" అని బైడెన్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది