బీబీనగర్ వద్ద పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్

ఫొటో సోర్స్, UGC
గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. అయితే ప్రాణనష్టం లేదు. బీబీనగర్, ఘట్‌కేసర్ మధ్య ఎన్ఎఫ్‌సీ దగ్గర ఈ ఘటన జరిగింది.
విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళుతోన్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్ 1,2,3,4, ఒక జనరల్ బోగీ, ఎస్ఎల్ఆర్ బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.
వెంటనే సిబ్బంది అప్రమత్తమై ప్రయాణీకులను దించినట్టు భారతీయ రైల్వే ప్రకటించింది. సహాయం కోసం 040 27786666 నంబరుకు కాల్ చేయాలని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ఫొటో సోర్స్, UGC
ఘటన జరిగిన వెంటనే ఏం జరిగిందో అర్థం కాక ప్రయాణీకులు కంగారుపడ్డారు. అయితే తెల్లవారుజాము కావడంతో చాలా మంది ప్రయాణీకులు మెలకువతోనే ఉన్నారు. అలాగే హైదరాబాద్ నగరానికి కాస్త దగ్గరగానే ఉండడంతో అధికారులు వేగంగా స్పందించడానికి అవకాశం కలిగింది.
రైలు వేగం తక్కువగానే ఉండటంతో లోకో పైలట్ వెంటనే ట్రైన్‌ను నిలిపివేశారు. రైలు బోగీలు పట్టాలు తప్పినప్పటికీ.. బోగీలు పూర్తిగా కింద పడలేదు. అందుకే ప్రమాద తీవ్రత తగ్గింది. ఆ మార్గంలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

ఫొటో సోర్స్, UGC
