మహిళల టీ20 ప్రపంచ కప్: వెస్ట్ ఇండీస్‌పై 6 వికెట్లతో గెలిచిన భారత్
దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌లో జరిగిన గ్రూప్-2 మ్యాచ్‌లో.. వెస్ట్ ఇండీస్ మీద భారత జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది.
లైవ్ కవరేజీ
లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
మహిళల టీ20 ప్రపంచ కప్: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం

ఫొటో సోర్స్, GETTY IMAGES
మహిళల టీ20 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్‌పై భారత జట్టు ఘన విజయం సాధించింది.
వెస్టిండీస్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని భారత్ జట్టు అలవోకగా చేధించింది. ఆరు వికెట్ల తేడాతో భారత్ విండీస్‌పై గెలిచింది. దీంతో, టీ20 ప్రపంచ కప్‌లో రెండో మ్యాచ్‌ను కూడా భారత్ తన గెలుపు ఖాతాలో వేసుకుంది.
హర్మాన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా బౌలర్లు, తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ను 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 118 పరుగులకే పరిమితం చేశారు.
దీప్తి శర్మ ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసింది. పూజ, రేణుకా సింగ్ చెరో వికెట్ తీశారు.
ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా 4 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది.
రిచా గోస్, హర్మాన్‌ప్రీత్ ఇద్దరూ కలిసి భారత్‌ను విజయం వైపు నడిపించారు. హర్మాన్‌ప్రీత్ కౌర్ 33 పరుగులు, రిచా గోస్ 44 పరుగులు చేశారు. వీరిద్దరూ చివరి వరకు మ్యాచ్‌ను నడిపించారు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 వికెట్లను తీసిన తొలి భారతీయ బౌలర్‌గా దీప్తి శర్మ నిలిచింది. ఇప్పటి వరకు ఏ క్రికెటర్ ఈ ఘనతను సాధించలేదు.
ఆమెకు ముందు పూనమ్ యాదవ్ అత్యధికంగా 98 వికెట్లను తీసింది. పురుషుల క్రికెట్‌లో యుజ్వేంద్ర చాహల్ 91 వికెట్లను, భువనేశ్వర్ 90 వికెట్లను తీశారు.
దీప్తి ఆడిన 89వ ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ ఇది.
మహా శివరాత్రి: పార్వతి ఒడిలో పవళించిన శివుడు - పురాతన పళ్లికొండేశ్వర ఆలయం విశేషాలు మీకు తెలుసా?
అదానీ వివాదం, బీబీసీ డాక్యుమెంటరీ, 2024 ఎన్నికలపై అమిత్ షా ఏమన్నారు?
బీబీసీ ఆఫీసుల్లో తనిఖీలు.. మీడియా స్వేచ్ఛను హరించటమే: ఏపీడబ్ల్యూజే, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛని హరిస్తోందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆరోపించింది.
భారతదేశంలోని బీబీసీ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ తనిఖీలను బుధవారం ఒక ప్రకటనలో నిరసించింది. దీనిపై ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది.
ప్రభుత్వం భావ ప్రకటనా స్వేచ్ఛను హరించేలా వ్యవహరిస్తోందని, ఈ తీరుకి వ్యతిరేకంగా నిర్వహించే ఆందోళనలో పాత్రికేయులు, ప్రజాస్వామ్య వాదులు పాల్గొనాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్ష కార్యదర్శలు జి ఆంజనేయులు, ఎస్.వెంకట్రావు కోరారు.

IND vs WI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్ట్ ఇండీస్

ఫొటో సోర్స్, ANI
మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నమెంటులో భాగంగా భారత్, వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య బుధవారం సాయంత్రం మ్యాచ్ మొదలైంది.
దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన వెస్ట్ ఇండీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ టోర్నీలో పాక్‌తో మ్యాచ్‌కు వేలి గాయం వల్ల దూరమైన భారత జట్టు ఓపెనర్ స్మృతి మంధాన.. వెస్ట్ ఇండీస్‌తో మ్యాచ్‌లో జట్టులో చేరారు.
పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది.
టీ20 ప్రపంచ కప్‌లో గ్రూప్-2లో భాగంగా ఉన్న భారత జట్టు ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ జట్టు ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ గెలిచి మొదటి స్థానంలో నిలిచింది.
అదే సమయంలో వెస్ట్ ఇండీస్ జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. నెట్ రన్ రేట్ ప్రాతిపదికన వెస్ట్ ఇండీస్ ప్రస్తుతం గ్రూప్-2లో చివరి స్థానంలో ఉంది.
లిబియా తీరంలో బోటు మునక.. 73 మంది వలసలు గల్లంతు

ఫొటో సోర్స్, Getty Images
లిబియా తీరంలో వలసదారులు ప్రయాణిస్తున్న బోటు మునిగిపోయి 73 మంది గల్లంతయ్యారని.. వారు చనిపోయినట్లు భావిస్తున్నామని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది.
ఈ పడవ మంగళవారం నాడు మునిగిందని.. అందులో ఉన్న వారిలో కేవలం ఏడుగురు మాత్రమే తీరానికి చేరుకోగలిగారని వివరించింది.
ఇప్పటివరకూ 11 మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పింది.
యూరప్ చేరుకోవటానికి ప్రయత్నించే వలసదారులు.. లిబియా నుంచి సముద్రమార్గంలో అక్రమంగా ప్రయాణిస్తున్నారు. ఈ ఏడాది తొలి నెలన్నర రోజుల్లోనే ఈ ప్రమాదకరమైన దారిలో ప్రయాణిస్తూ 130 మంది చనిపోయారు.
గత ఏడాది తమ మిస్సింగ్ మైగ్రంట్స్ ప్రాజెక్టు పరిశీలనలో 1,450 మరణాలు నమోదైనట్లు ఐఎంఓ తెలిపింది.
మూడు రాజధానుల ముచ్చట ముగిసిందా? విశాఖపట్నం ఒక్కటే రాజధాని అని ఎందుకు చెప్తున్నారు?
కేసీఆర్: ‘‘దేశంలోనే అతిపెద్ద హనుమాన్ క్షేత్రంగా కొండగట్టు విలసిల్లాలి’’, ప్రవీణ్ కుమార్ శుభం, బీబీసీ కోసం

ప్రపంచాన్ని ఆకర్షించే అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
బుధవారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని కేసీఆర్ సందర్శించారు.
ఆలయంలో పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ మాస్టర్ ప్లాన్‌పై అధికారులతో సమీక్షలో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి కోసం ఇటీవలే 100 కోట్లు ప్రకటించిన కేసీఆర్, దేశంలోనే అతిపెద్ద హనుమాన్ క్షేత్రంగా కొండగట్టు విలసిల్లాలని తాజాగా అన్నారు.

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధిని బృహత్తర ప్రాజెక్ట్‌గా చేపడుతున్నట్లు చెప్పారు. భక్తులకు సకల వసతులు, అన్ని హంగులతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆంజనేయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.
ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఘాట్ రోడ్లను తీర్చిదిద్దాలని చెప్పారు. హనుమాన్ దీక్షధారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.
86 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటుతో పాటు పెద్ద వాల్, పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణ కట్టలను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

గుహలో చిక్కుకుపోయి ప్రాణాలతో బయటపడిన ఫుట్‌బాలర్ డువాంగ్‌పెచ్ ప్రోమ్‌థెప్ మృతి, జోనాథన్ హెడ్, కెల్లీ ఎన్జీ, బీబీసీ న్యూస్

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఫొటో క్యాప్షన్, డువాంగ్‌పెచ్ ప్రోమ్‌థెప్, 2018నాటి ఫొటో భారీ వర్షం కారణంగా 2018లో థాయ్‌లాండ్‌లోని థామ్ లువాంగ్ గుహలో చిక్కుకుపోయి, ప్రాణాలతో బయటపడిన 12 మంది బాలురుల్లో ఒకరైన డువాంగ్‌పెచ్ ప్రోమ్‌థెప్ ఇప్పుడు మృతి చెందారు.
17 ఏళ్ల ప్రోమ్‌థెప్ ఆదివారం వసతి గృహంలో అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రోమ్‌థెప్ మంగళవారం ఆసుపత్రిలో మృతిచెందినట్లు ఆయన స్వస్థలానికి చెందిన ప్రజలు బీబీసీకి తెలిపారు.
ప్రోమ్‌థెప్ మరణ వార్త గురించి ఆయన తల్లి ప్రకటించడంతో సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రోమ్‌థెప్, గత ఏడాది యూకేలోని ఒక ఫుట్‌బాల్ అకాడమీలో చేరారు.
ప్రోమ్‌థెప్ గతంలో థాయ్‌లాండ్ బాలుర ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో సైక్లింగ్ చేస్తూ వెళ్లిన వారి ఫుట్‌బాల్ జట్టు, భారీ వర్షం కారణంగా థాయ్‌లాండ్ గుహలో దాదాపు రెండు వారాల పాటు చిక్కుకుపోయింది.
9 రోజుల పాటు చీకటిలో ఆహరం లేకుండా వారంతా గడిపారు. తర్వాత రెస్క్యూ బృందం మూడు రోజుల్లో వారందరినీ కాపాడింది.
మహాశివరాత్రి పూజ విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ, 144 సెక్షన్ విధింపు

ఫొటో సోర్స్, MD.SARTAJ ALAM
జార్ఖండ్ రాష్ట్రం పాలము జిల్లాలోని పాంకి బ్లాక్‌లో మహాశివరాత్రి ఏర్పాట్ల విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది.
ఈ గొడవలో స్థానిక ఎస్‌డీపీఓతో పాటు మరికొందరు పోలీసులు గాయపడ్డారు.
ఉద్రిక్త వాతారణం నేపథ్యంలో అక్కడ 144 సెక్షన్‌ను అమలు చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికార యంత్రాంగం చెబుతోంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాళ్లదాడి కారణంగా ఇరువర్గాలకు చెందిన సుమారు 12 మందికి గాయాలయ్యాయి.
పాంకీ బ్లాకులోని మసీదు కూడలిలో ఈ ఘర్షణ జరిగింది. ఇక్కడికి 800 మీటర్ల దూరంలో 'రాహెవీర్ పహాడీ' ఆలయం ఉంది.ఫిబ్రవరి 18న ఇక్కడ మహాశివరాత్రి జాతర జరగాల్సి ఉంది.

ఫొటో సోర్స్, MD.SARTAJ ALAM
జాతర ఏర్పాట్లలో భాగంగా మసీదు ప్రాంగణం వెలుపల తోరణ ద్వారాన్ని ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెప్పారు.
మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు ఈ ద్వారం గురించి స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందినట్లు స్థానిక యువకుడు అఫ్తాబ్ ఆలం చెప్పారు.
8 గంటలకు వచ్చిన స్థానిక పోలీసులు, మొదటిసారి ఇలాంటి ద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నందున దీని కోసం జిల్లా యంత్రాంగం నుంచి అనుమతి తీసుకోవాలని హిందూ పక్షానికి చెప్పినట్లు ఆలం వెల్లడించారు.
దీనిపై చర్చించడం కోసం ఇరువర్గాలకు చెందిన పది మందిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు.
ఇదే సమయంలో ఇరువర్గాల ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు.కొద్దిసేపటికే రాళ్లదాడి మొదలైంది.
వాలంటైన్స్ డే: డేటింగ్ చేయటం, ప్రేమలో పడటం నేర్పించే ‘మాక్ డేట్’ సర్వీసులు
ఆంధ్రప్రదేశ్: మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూత, తులసీ ప్రసాద్ రెడ్డి, బీబీసీ కోసం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ బుధవారం కన్నుమూశారు.
గత కొన్ని నెలలుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
తిరుపతిలోని స్వగృహంలోనే ఆమె కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
గుమ్మడి కుతూహలమ్మ వృతి రీత్యా వైద్యురాలు.
1978లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థిగా చిత్తూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా ఆమె పనిచేశారు.
ఎక్కువ కాలం ఆమె కాంగ్రెస్‌లో పనిచేశారు. 2014లో టీడీపీలో చేరారు.
1992-1993 మధ్య కాలంలో నేదురుమల్లి జనార్ధన రెడ్డి మంత్రి వర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు.
2004లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో శాసన సభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు.
ఆమె మృతికి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రగాఢ సంతాపం తెలిపారు.
మసీదుల్లోకి మహిళలకు ప్రవేశం ఉందా? లేదా? సుప్రీంకోర్టులో కేసు ఏమిటి?
బీబీసీపై ఐటీ ‘సర్వే’ విషయంలో జాతీయ, అంతర్జాతీయ మీడియా కథనాలు ఏం చెప్పాయి?
వాలెంటైన్స్ డే: బొద్దింకకు మాజీ ప్రియుడి పేరు పెట్టిన యువతి
కారులో మనుషులుండగానే కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ట్రక్ డ్రైవర్
బీజేపీకి విరాళాల రూపంలో రూ. 614 కోట్లు, కాంగ్రెస్‌కు రూ. 95 కోట్లు

ఫొటో సోర్స్, Getty Images
2021-2022 ఏడాదిలో బీజేపీకి గరిష్టంగా విరాళాలు అందినట్లు అసోసియేషన్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక తెలిపింది.
ఈ ఏడాదిలో బీజేపీకి విరాళాల రూపంలో రూ. 614 కోట్లు, కాంగ్రెస్‌కు రూ. 95 కోట్లు అందినట్లు ఏడీఆర్ నివేదిక పేర్కొంది.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు స్వయంగా ఈ విరాళాలను ప్రకటించినట్లు ఏడీఆర్ తెలిపింది.
తమకు అందిన మొత్తం 4957 డొనేషన్ల నుంచి రూ. 614 కోట్లు లభించినట్లు బీజేపీ తెలుపగా, కాంగ్రెస్ తమకు 1255 డొనేషన్లు అందినట్లు వెల్లడించింది.
కాంగ్రెస్, ఎన్‌సీపీ, సీపీఐ, సీపీఐ(ఎం), ఎన్‌పీఈపీ, ఏఐటీసీ పార్టీలన్నింటికీ కలిపి వచ్చిన మొత్తం కన్నా బీజేపీకి మూడు రెట్లు ఎక్కువ మొత్తంలో విరాళాలు వచ్చినట్లు ఏడీఆర్ తెలిపినట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.
2021-22లో తమకు 20 వేల రూపాయలకు మించి విరాళం అందలేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు.
జాతీయ పార్టీలకు అందుతున్న విరాళాలు 2021-22లో 31% పెరిగాయి.
కొత్తవీధి, గుంటి: గిరిజనులు సాగుచేసే ఈ గ్రామాలు రికార్డుల్లో ఎలా మాయం అయ్యాయి?
