You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తుర్కియే, సిరియా భూకంపం: 20 వేలకు చేరువైన మృతుల సంఖ్య

తుర్కియేలో మృతుల సంఖ్య 16,170 కి పెరిగినట్లు ఆ దేశాధ్యక్షుడు ఎర్దవాన్ గురువారం మధ్యాహ్నం చెప్పారు. సిరియాలో మృతుల సంఖ్య 3,162కు పెరిగినట్లు ఆ దేశం వెల్లడించింది.

లైవ్ కవరేజీ

  1. పాదయాత్రలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పరిశీలించిన రేవంత్ రెడ్డి

    తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా ఎల్లంపేట స్టేజితండాలో ‘అసంపూర్తిగా ఉన్న’ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లన పరిశీలించారు.

    స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

    కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నిర్మాణాలలో నాణ్యత లోపించిందని స్థానికులు రేవంత్‌తో చెప్పారు.

    కాగా గడువులోగా డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తి చేయని కాంట్రాక్టర్ పై కేసు పెట్టాలని స్థానికులకు రేవంత్ రెడ్డి సూచించారు. ఈ అంశంపై తాను కూడా ప్రభుత్వానికి లేఖ రాస్తానని రేవంత్ చెప్పార.

    కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సొంత ఇల్లు కట్టుకునే లబ్దిదారుడికి రూ.5 లక్షలు సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

  2. తుర్కియే భూకంపం: మరణాలు పెరగడానికి ప్రభుత్వమే కారణమా... అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించడమే తీవ్రతను పెంచిందా

  3. కాకినాడ జిల్లాలో ఆయిల్ ట్యాంకర్ శుభ్రంచేస్తూ ఏడుగురు మృతి, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    కాకినాడ జిల్లా పెద్దాపురం పరిధిలోని జి.రాగంపేటలో నిర్మాణంలోని ఓ కర్మాగారంలోని ఆయిల్ ట్యాంకర్ పనులు చేస్తున్న ఏడుగురు కూలీలు మరణించారు.

    ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా ఊపిరాడక వీరంతా ప్రాణాలు కోల్పోయారు.

    మృతులలో అయిదుగురు పాడేరుకు చెందినవారు కాగా మరో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరుకు చెందినవారు.

    ప్రమాదంలో మరణించిన ఏడుగురికి ప్రభుత్వం రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు

  4. ఇండియా, ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్: తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు

    బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ గురువారం మొదలైంది.

    నాగపూర్ వేదికగా గురువారం మొదలైన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

    ఈ మ్యాచ్‌తో సూర్యకుమార్ యాదవ్, కేఎస్ యాదవ్ టెస్టులలో అరంగేట్రం చేస్తున్నారు.

    ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడుతున్నారు.

    భారత్ జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్

    ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబుసానే, స్టీవ్ స్మిత్, మేట్ రైన్షా, పీటర్ హేండ్స్‌కాంబ్, అలెక్స్ కైరీ, పాట్ కమిన్స్, నాథన్ లాయన్, టాడ్ మార్ఫ్, స్కాట్ బోలెండ్

  5. విపత్కర సమయంలో విమర్శలా: తుర్కియే అధ్యక్షుడు ఎర్దవాన్

    భూకంపం కారణంగా తుర్కియే, సిరియాలో 12 వేల మందికి పైగా మరణించారు.

    భూకంపం అనంతరం సహాయ చర్యల విషయంలో ప్రభుత్వం సత్వరం స్పందించలేదన్న విమర్శలపై తుర్కియే అధ్యక్షుడు ఎర్దవాన్ స్పందించారు.

    భూకంప ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన ఆయన బాధితులతో మాట్లాడారు. సహాయ చర్యలను పర్యవేక్షించారు.

    అత్యవసర సర్వీసుల విభాగం సేవలు నెమ్మదిగా ఉన్నాయని, ప్రభుత్వ సన్నద్ధత కూడా లేదన్న విమర్శలపై ఎర్దవాన్ స్పందిస్తూ ఈ స్థాయి విపత్తును ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండడమనేది అసాధ్యమన్నారు.

    కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవమేనని అంగీకరించిన ఆయన ప్రస్తుతం అంతా అదుపులో ఉందన్నారు.

    ఇలాంటి విపత్కర పరిస్థితులలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలే కానీ రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు మొదలుపెట్టరాదన్నారు.

    అయితే, తుర్కియే ప్రధాన ప్రతిపక్ష నేత కెమైల్ మాత్రం ఎర్దవాన్ వాదనను అంగీకరించలేదు.