రాష్ట్రపతి వల్ల గిరిజన సమాజంలో ఆత్మవిశ్వాసం పెరిగింది: ప్రధాని మోదీ
పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం సాయంత్రం లోక్‌సభలో ప్రసంగించారు.
లైవ్ కవరేజీ
అదానీ గ్రూప్ మీద విచారణకు బీఆర్‌ఎస్ డిమాండ్
ఫొటో సోర్స్, ANI
అదానీ గ్రూప్‌కు సంబంధించి హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన
ఆరోపణల మీద విచారణ చేపట్టాలంటూ ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి.
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్), ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన(ఉద్ధవ్
ఠాక్రే వర్గం) ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ వద్ద ప్లకార్డులు
పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
అదానీ వివాదం మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని వారు
డిమాండ్ చేశారు.
‘ప్రపంచంలో ఏ దేశంతో పోల్చినా అమెరికా ఆర్థికవ్యవస్థ చాలా మంచి స్థితిలో ఉంది: బైడెన్
ఫొటో సోర్స్, The White House/Facebook
భూమి మీద ఏ దేశంతో పోల్చినా అమెరికా ఆర్థికవ్యవస్థ చాలా మంచి స్థితిలో ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.
కరోనా, యుక్రెయిన్-రష్యా సంక్షోభాలను తట్టుకుని నిలబడిందని తెలిపారు.
నేడు క్యాపిటల్ హిల్‌లో జరిగిన అమెరికా ఉభయ సభల సమావేశంలో బైడెన్ ప్రసంగించారు.
భూమి మీద ఏ దేశంతో పోల్చినా అమెరికా ఆర్థికవ్యవస్థ చాలా మంచి స్థితిలో ఉందని ఆయన అన్నారు. కరోనా, యుక్రెయిన్-రష్యా సంక్షోభాలను తట్టుకుని నిలబడిందని తెలిపారు.
రిపబ్లికన్లను స్నేహితులుగా అభివర్ణించిన ఆయన, వారి సహకారం కోరారు.
ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుని భార్య జిల్ బైడెన్, ఆ దేశ వైస్
ప్రెసిడెంట్ కమలా హారిస్ భర్త డగ్ ఎమాఫ్‌ను చుంబించారు.
ఫొటో సోర్స్, Arthur Schwartz/Twitter
బ్రేకింగ్ న్యూస్, ఆర్‌బీఐ: రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు పెంపు
ఫొటో సోర్స్, UGC
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రెపో రేటును 25 బేసిస్
పాయింట్లు పెంచింది.
ఈ పెంపుతో రెపో రేటు 6.5శాతానికి చేరింది.
ఈ ఏడాది ఇదే తొలి పెంపు. 2022లో వరుసగా చాలా సార్లు రెపో రేటును పెంచారు.
రెపో రేటు పెరగడం వల్ల బ్యాంకులు రుణాల మీద వడ్డీ రేట్లను పెంచుతాయి. పర్సనల్, హోం లోన్ల మీద వడ్డీ రేట్లు పెరుగుతాయి.
ఆర్‌బీఐ అంచనాలు:
2023-24 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 6.4శాతం.
2023-24: కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్(సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం
5.3శాతం.
దిల్లీ లిక్కర్ ‘స్కామ్’: కల్వకుంట్ల కవిత మాజీ సీఏ అరెస్టు
ఫొటో సోర్స్, UGC
దిల్లీ లిక్కర్ ‘స్కాము’కు సంబంధించి హైదరాబాద్‌లో గోరంట్ల
బుచ్చిబాబు అనే వ్యక్తిని అరెస్టు చేసింది సీబీఐ.
బుచ్చిబాబు గతంలో కేసీఆర్ కుమార్తె కవితకు చార్టెడ్ అకౌంటెంట్‌గా
పనిచేశారు. దిల్లీ లిక్కర్ పాలసీ పత్రాలు తయారు చేయడంలో ఈయనదే కీలక పాత్ర అని
సీబీఐ ఆరోపిస్తోంది.
హైదరాబాద్‌కు చెందిన వివిధ మద్యం వ్యాపారులకు తప్పుడు
మార్గంలో లాభం కలిగేలాహైదరాబాద్‌కు చెందిన
కంపెనీలకు లైసెన్సులు దక్కేలా ఈయన పాలసీలు రూపొందించారనేది సీబీఐ అభియోగం.
బుచ్చిబాబును ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు.
తుర్కియే-సిరియా భూకంపం: 8 వేలకు చేరిన మృతుల సంఖ్య
ఫొటో సోర్స్, Getty Images
తుర్కియే, సిరియా
సరిహద్దులో వచ్చిన తీవ్ర భూకంపంలో మృతుల సంఖ్య 8వేలకు చేరింది.
తుర్కియేలో 5,894,
సిరియాలో 1,932 మంది చనిపోయినట్లుగా వార్తా సంస్థ ఏఎఫ్‌పీ రిపోర్ట్ చేసింది.
భవనాల శిథిలాల్లో
చిక్కుకున్న వారి కోసం సహాయక సిబ్బంది వెతుకుతూనే ఉన్నారు. తీవ్రమైన చలి
రాత్రుల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
అనేక రూపాల్లో
సాయం అందించేందుకు విదేశాలు ముందుకు వస్తున్నాయి. భారత్ ఇప్పటికే సహాయక చర్యల కోసం
రెండు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను పంపింది.
కొన్ని దేశాలు
ఆర్థికసాయం ప్రకటిస్తున్నాయి. మరికొన్ని అవసరమైన కిట్లను పంపుతున్నాయి. అయితే తమకు
అవసరం లేని వస్తువులు కూడా చాలా వస్తున్నాయని, వాటి కంటే డబ్బులు పంపితే మేలని కొందరు
అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఫొటో సోర్స్, Yeni Malatyaspor
ఈ భూకంపంలో తుర్కియే ఫుట్‌బాల్ టీం గోల్ కీపర్ అహ్మద్ ఆయప్ తుర్క్‌సలేన్ చనిపోయారు.
భూకంప బాధితుల సంఖ్య సుమారు 2.3 కోట్లు ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది.
సోమవారం తుర్కియే, సిరియా సరిహద్దులో తీవ్రమైన భూకంపాలు చోటు చేసుకున్నాయి. 7,8, 7.5 తీవ్రతతో ఆ భూకంపాలు వచ్చాయి.
గుడ్ మార్నింగ్!
బీబీసీ న్యూస్
తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ
పేజీని చూస్తూ ఉండండి.