హైదరాబాద్‌లో మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సుల సందడి.. జెండా ఊపి ప్రారంభించిన కేటీఆర్

ఫిబ్రవరి 11 నుంచి హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-ప్రిక్స్ జరగనుండడంతో ఈ బస్సులు ప్రధానంగా టాంక్ బండ్‌, నెక్లెస్ రోడ్, పారడైజ్, నిజాం కాలేజీలను కవర్ చేస్తూ రేస్ ట్రాక్ చుట్టూ తిరగనున్నాయి.

లైవ్ కవరేజీ

  1. తుర్కియేకు బయల్దేరిన ఆగ్రా ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ వైద్య బృందం

    భూకంపం

    ఫొటో సోర్స్, Reuters

    భూకంపం కారణంగా తుర్కియే,సిరియాలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తీవ్ర స్థాయిలో సంభవించిన భూకంపంతో అక్కడ వేల మంది మృత్యువాత పడ్డారు.

    ప్రకృతి విలయం బారిన పడిన తుర్కియేకు సహాయం చేయడం కోసం ఆగ్రాలోని ఆర్మీ ఫీల్డ్ ఆసుపత్రి నుంచి 86 మంది వైద్యుల బృందం అక్కడికి బయల్దేరినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    ఈ బృందంలో పలువురు వైద్య నిపుణులు ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకుని గాయపడిన వారికి ఈ బృందం, చికిత్స అందించనుంది.

    ఇదే కాకుండా సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని కూడా భారత్ పంపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  2. ఈ పేపర్ ఇంటిని ఎలా వేడిగా ఉంచుతుంది?

  3. ‘పాక్‌కు రావడం ఇష్టం లేకపోతే టీమిండియా నరకానికి వెళ్లొచ్చు’’ అన్న మియాందాద్ వ్యాఖ్యలపై వెంకటేశ్ ప్రసాద్ ఏమన్నారంటే...

    జావేద్ మియాందాద్

    ఫొటో సోర్స్, Getty Images

    ‘‘పాకిస్తాన్‌కు రావడం ఇష్టం లేకపోతే టీమిండియా, నరకానికి వెళ్లొచ్చు’’ అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెట్ జావేద్ మియాందాద్ చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ స్పందించారు.

    ఒక బహిరంగ కార్యక్రమంలో జావేద్ మియాందాద్ మాట్లాడుతూ, ‘‘టీమిండియాకు క్రికెట్ ఆడటం కోసం పాకిస్తాన్‌కు రావడం ఇష్టం లేకపోతే వారు నరకానికి వెళ్లొచ్చు. పాకిస్తాన్ క్రికెట్ మనుగడ సాగించడానికి భారత్‌తో అవసరం లేదు’’ అని వ్యాఖ్యానించారు.

    దీనిపై ట్విటర్‌లో వెంకటేశ్ ప్రసాద్ వ్యంగ్యంగా స్పందించారు. ‘‘వాళ్లు కూడా నరకానికి వెళ్లేందుకే తిరస్కరిస్తున్నారు’’ అంటూ ట్వీట్ చేశారు.

    ఆసియా కప్ 2023 పాకిస్థాన్‌లో జరగాల్సి ఉంది. భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లేది లేదని జైషా ఓ ప్రకటనలో స్పష్టం చేసినప్పటి నుంచి ఈ వివాదం మొదలైంది.

    ఆసియా కప్ కోసం భారత జట్టు పాకిస్థాన్‌కు రాకపోతే, 2023లో భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ కూడా పాల్గొనదని పీసీబీ మాజీ చీఫ్ రమీజ్ రాజా అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. తుర్కియే-సిరియా: భూకంపానికి కారణం ఏంటి... ఇంత విలయాన్ని ఎందుకు సృష్టించింది?

  5. ఆరోన్ ఫించ్: టి20 క్రికెట్‌‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెటర్

    ఆరోన్ ఫించ్

    ఫొటో సోర్స్, ANI

    అంతర్జాతీయ టి20ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ఆస్ట్రేలియా టి20 జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ ప్రకటించాడు.

    దాదాపు ఏడాది క్రితం ఫించ్, వన్డేల నుంచి తప్పుకున్నాడు.

    అయితే ఐపీఎల్, బీబీఎల్ వంటి లీగ్‌ల్లో ఫించ్ ఆడనున్నాడు.

    టి20 క్రికెట్ నుంచి తప్పుకుంటున్న విషయాన్ని మంగళవారం ఫించ్ వెల్లడించాడు.

    మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో విలేఖరులతో మాట్లాడుతూ ‘‘2024లో జరిగే టి20 ప్రపంచ కప్‌లో నేను ఆడలేననే విషయం నాకు అర్థమైంది. అందుకే దీన్నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అని భావించా’’ అని ఫించ్ అన్నట్లు క్రికెట్ వెబ్‌సైట్ ‘క్రిక్ బజ్’ పేర్కొంది.

    2021 టి20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా జట్టుకు సారథ్యం వహించాడు.