You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హైదరాబాద్‌లో మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సుల సందడి.. జెండా ఊపి ప్రారంభించిన కేటీఆర్
ఫిబ్రవరి 11 నుంచి హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-ప్రిక్స్ జరగనుండడంతో ఈ బస్సులు ప్రధానంగా టాంక్ బండ్, నెక్లెస్ రోడ్, పారడైజ్, నిజాం కాలేజీలను కవర్ చేస్తూ రేస్ ట్రాక్ చుట్టూ తిరగనున్నాయి.
లైవ్ కవరేజీ
గుజరాత్: మామను, బావను చంపిన హంతకుడిని ఈ ట్రక్కు వెనక రాసిన అక్షరాలే పట్టించాయి...
అదానీ గ్రూప్ మీద విచారణకు బీఆర్‌ఎస్ డిమాండ్
అదానీ గ్రూప్‌కు సంబంధించి హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల మీద విచారణ చేపట్టాలంటూ ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి.
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్), ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన(ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
అదానీ వివాదం మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని వారు డిమాండ్ చేశారు.
దిల్లీ లిక్కర్ ‘స్కామ్’: కల్వకుంట్ల కవిత మాజీ సీఏ అరెస్టు
దిల్లీ లిక్కర్ ‘స్కాము’కు సంబంధించి హైదరాబాద్‌లో గోరంట్ల బుచ్చిబాబు అనే వ్యక్తిని అరెస్టు చేసింది సీబీఐ.
బుచ్చిబాబు గతంలో కేసీఆర్ కుమార్తె కవితకు చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేశారు. దిల్లీ లిక్కర్ పాలసీ పత్రాలు తయారు చేయడంలో ఈయనదే కీలక పాత్ర అని సీబీఐ ఆరోపిస్తోంది.
హైదరాబాద్‌కు చెందిన వివిధ మద్యం వ్యాపారులకు తప్పుడు మార్గంలో లాభం కలిగేలాహైదరాబాద్‌కు చెందిన కంపెనీలకు లైసెన్సులు దక్కేలా ఈయన పాలసీలు రూపొందించారనేది సీబీఐ అభియోగం.
బుచ్చిబాబును ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు.
తుర్కియే-సిరియా భూకంపం: 8 వేలకు చేరిన మృతుల సంఖ్య
తుర్కియే, సిరియా సరిహద్దులో వచ్చిన తీవ్ర భూకంపంలో మృతుల సంఖ్య 8వేలకు చేరింది.
తుర్కియేలో 5,894, సిరియాలో 1,932 మంది చనిపోయినట్లుగా వార్తా సంస్థ ఏఎఫ్‌పీ రిపోర్ట్ చేసింది.
భవనాల శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక సిబ్బంది వెతుకుతూనే ఉన్నారు. తీవ్రమైన చలి రాత్రుల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
అనేక రూపాల్లో సాయం అందించేందుకు విదేశాలు ముందుకు వస్తున్నాయి. భారత్ ఇప్పటికే సహాయక చర్యల కోసం రెండు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను పంపింది.
కొన్ని దేశాలు ఆర్థికసాయం ప్రకటిస్తున్నాయి. మరికొన్ని అవసరమైన కిట్లను పంపుతున్నాయి. అయితే తమకు అవసరం లేని వస్తువులు కూడా చాలా వస్తున్నాయని, వాటి కంటే డబ్బులు పంపితే మేలని కొందరు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ భూకంపంలో తుర్కియే ఫుట్‌బాల్ టీం గోల్ కీపర్ అహ్మద్ ఆయప్ తుర్క్‌సలేన్ చనిపోయారు.
భూకంప బాధితుల సంఖ్య సుమారు 2.3 కోట్లు ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది.
సోమవారం తుర్కియే, సిరియా సరిహద్దులో తీవ్రమైన భూకంపాలు చోటు చేసుకున్నాయి. 7,8, 7.5 తీవ్రతతో ఆ భూకంపాలు వచ్చాయి.
'అదానీ ఒక్కరే ఇన్ని వ్యాపారాలు చేస్తారా?' - పార్లమెంటులో మోదీని ప్రశ్నించిన రాహుల్ గాంధీ, తోసిపుచ్చిన బీజేపీ
రాష్ట్రపతి వల్ల గిరిజన సమాజంలో ఆత్మవిశ్వాసం పెరిగింది: ప్రధాని మోదీ
జస్టిస్ విక్టోరియా గౌరీ: మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా ఆమెను నియమించడంపై ప్రశ్నలు ఎందుకు?
తుర్కియే-సిరియా భూకంపం: శిథిలాల మధ్య అప్పుడే పుట్టిన పసిబిడ్డ ఏడుపు... కాపాడిన బంధువులు
విశాఖపట్నం: సీఎం వస్తున్నారని చెట్లు కొట్టేశారు, ఇప్పుడు మొక్కలు నాటుతున్నారు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంకు వెళ్లిన తెలంగాణ ప్రభుత్వం
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెలంగాణ హైకోర్టు సిబిఐకి అప్పగించింది. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు గడప తొక్కింది.
హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం పిటీషన్‌ను వెంటనే విచారణకు తీసుకోవాలంటూ సిజెఐ చంద్రచూడ్ ధర్మాసనాన్ని సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే కోరారు.
సిబిఐ విచారణ ప్రారంభిస్తే సాక్ష్యాలన్నీ ధ్వంసమవుతాయని దుష్యంత్ దవే ఆందోళన వ్యక్తం చేశారు.
రేపు ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని దుష్యంత్ దవేకు సిజెఐ చంద్రచూడ్ సూచించారు.
వచ్చే వారం విచారణకు అనుమతి ఇస్తామని సిజెఐ చంద్రచూడ్ అన్నారు. ఒకవేళ బుధవారం మెన్షన్ చేయలేకపోయినా వచ్చే వారం విచారణకు వస్తుందని తెలిపారు.
తుర్కియే, సిరియా: 'ఇది భూకంపం... అందరూ దగ్గరికి రండి, కలిసి చనిపోదాం'
హైదరాబాద్‌లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సుల సందడి
హైదరాబాద్ సిటీలో 3 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఫిబ్రవరి 11 నుంచి హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-ప్రిక్స్ జరగనుండడంతో ఈ బస్సులు ప్రధానంగా టాంక్ బండ్, నెక్లెస్ రోడ్, పారడైజ్, నిజాం కాలేజీలను కవర్ చేస్తూ రేస్ ట్రాక్ చుట్టూ తిరగనున్నాయి.
ఫిబ్రవరి 11 తర్వాత ఈ బస్సులను నగరంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి హెరిటేజ్ సర్క్యూట్ మీదుగా కూడా నడపాలని భావిస్తున్నారు.
హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులకు ఘన చరిత్ర ఉంది. మొదట డబుల్ డెక్కర్ బస్సులను నిజాం ప్రారంభించారు. అవి 2003 వరకూ నగరంలో తిరిగేవి. ఒక హైదరాబాదీ వీటిని మళ్లీ తిప్పాలని ట్విటర్‌లో కోరడంతో, నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులను తిప్పే అవకాశాను పరిశీలించాలని కేటీఆర్ హెచ్ఎండీఏ అధికారులకు సూచించారు.
దీంతో హెచ్ఎండీఏ ఆరు ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చింది. వాటిలో డెలివరీ అయిన మూడు బస్సులను మంగళవారం ప్రారంభించారు. మిగతా మూడు బస్సులు త్వరలో నగరానికి రానున్నాయి. క్రమంగా నగరంలో తిరగనున్న డబుల్ డెక్కర్ బస్సుల సంఖ్యను 20కి పెంచాలని హెచ్ఎండీఏ భావిస్తోంది.
వీటిలో ఒక్కో ఒక బస్సు విలువ రూ.2.16 కోట్లని హెచ్ఎండీఏ తెలిపింది. ఒక్కో బస్సులో 65 మంది ప్రయాణించవచ్చు. పూర్తిగా విద్యుత్‌తో నడిచే ఈ బస్సులు ఒకసారి చార్జింగ్‌తో పూర్తిగా 2 నుంచి రెండున్నర గంటలపాటు 150 కిలోమీటర్లు నడవగలవు.
ఆంధ్రప్రదేశ్: శాసనమండలి ఎన్నికలు ఎందుకు కీలకం, ప్రధాన పార్టీలకు ఇది పరీక్ష కాబోతోందా?
జేఈఈ మెయిన్ 2023 పరీక్షా ఫలితాలు వెల్లడి.. మీ రిజల్ట్ తెలుసుకోండి
దేశంలోని ఐఐటి, ఎన్ఐటీటీలలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ తొలి దశ అయిన జేఈఈ మెయిన్ పరీక్షా ఫలితాలు మంగళవారం నాడు విడుదలయ్యాయి.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకారం ఈసారి 9 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు.
మొత్తంగా 20 మంది విద్యార్థులు 100 ఎన్‌టీఏ స్కోర్ సాధించారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
పరీక్ష ఫలితాలు తెలుసుకోవాలనుకునే వారు ఈ లింక్ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు: జేఈఈ మెయిన్ రిజల్ట్స్
రిజల్ట్స్ తెలుసుకోవడానికి అప్లికేషన్ నంబర్‌తో పాటు పుట్టిన రోజు కూడా ఎంటర్ చేయాలి. ఆ తరువాత సెక్యూరిటీ పిన్ టైప్ చేసి రిజల్ట్ తెలుసుకోవచ్చు.
లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
అదానీ గ్రూప్ వారం రోజుల్లో లక్షల కోట్లు నష్టపోయింది... మరి లాభపడింది ఎవరు?
మహిళల కోసం ఉచితంగా ‘‘రైటర్ పద్మభూషణ్’’ సినిమా ప్రదర్శన, అమరేంద్ర, బీబీసీ ప్రతినిధి
‘‘రైటర్ పద్మభూషణ్’’ చిత్ర బృందం మహిళల కోసం ఒక ఆఫర్‌ను ప్రకటించింది.
బుధవారం రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 38 థియేటర్లలో మహిళల కోసం రైటర్ పద్మభూషణ్ సినిమాను ఉచితంగా ప్రదర్శించనున్నారు.
మహిళల కోసం ఉచితంగా నాలుగు షోలను ఏర్పాటు చేయనున్నారు.
మంగళవారం హైదరాబాద్‌లో చిత్ర బృందం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.
మహిళలకు స్వీట్ సర్ప్రైజ్ పేరిట ‘ఉమెన్స్ వెడ్నస్ డే’గా ప్రకటించి.. సినిమాను ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఇందుకుగాను ఎంపిక చేసిన 38 థియేటర్లలో మహిళలు సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు ప్రత్యేకంగా ఉచిత పాసులు అందిస్తారు.
వాటి సహాయంతో టికెట్ కొనాల్సిన అవసరం లేకుండా రైటర్ పద్మభూషణ్ సినిమా చూడవచ్చు.
మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఒక నెల ముందుగానే, ఫిబ్రవరి 8వ తేదీన ఈ ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తున్నట్లు చిత్ర దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ తెలిపారు.
మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో సినిమా నటీనటులు సుహాస్, టీనా శిల్ప రాజ్, దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్, యాంకర్ సుమ పాల్గొన్నారు
తుర్కియే భూకంపం: 4600కు చేరిన మృతుల సంఖ్య
తుర్కియే, సిరియాలో సంభవించిన తీవ్రమైన భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
ఈ విపత్తులో ఇప్పటివరకు 4600 మంది ప్రాణాలు కోల్పోయారని వార్తా సంస్థ అసోసియేట్ ప్రెస్‌ను ఉటంకిస్తూ ఏఎన్‌ఐ తెలిపింది.
7.8 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా పెను నష్టం వాటిల్లింది. భవనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
విపత్తును ఎదుర్కొంటున్న తుర్కియేకు సహాయం చేయడం కోసం భారత్ రెండు సహాయక బృందాలను అక్కడికి పంపించింది.
పాకిస్తాన్ హిందువులకు స్పాన్సర్ లేకుండానే భారత వీసా... గంగా నదిలో అస్థికలు కలిపేందుకు ఎదురు చూస్తున్న కుటుంబాలు