తెలంగాణ మొత్తం బడ్జెట్ రూ. 2,90,396 కోట్లు

తెలంగాణ శాసన సభలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోన్న11వ బడ్జెట్ ఇది.

లైవ్ కవరేజీ

  1. హాథ్ సే హాథ్ జోడో యాత్ర కోసం హైదరాబాద్ నుంచి బయల్దేరిన రేవంత్ రెడ్డి

    రేవంత్ రెడ్డి

    తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తలపెట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర నేడు ప్రారంభం కానుంది.

    ఈ యాత్రను మొదలుపెట్టేందుకు ముందు మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల ఆశీర్వాదం కోసం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయలుదేరారు.

    వరంగల్ హైవే మీదుగా ములుగుకు రేవంత్ చేరుకుంటారు. ములుగులో గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

    ఉదయం 11 గంటలకుమేడారం సమ్మక్క సారలమ్మ వద్ద ప్రత్యేక పూజలు చేసి మధ్యాహ్నం12 గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారు.

    తొలిరోజు మేడారం నుంచి రామప్ప వరకు పాదయాత్ర సాగనుంది.

    రాత్రికి రామప్ప గ్రామంలోనే రేవంత్ రెడ్డి బస చేస్తారు.

  2. తుర్కియే-సిరియా: 'గత 84 ఏళ్ళల్లో ఇదే అతి పెద్ద భూకంపం' - అధ్యక్షుడు ఎర్దొవాన్, దాదాపు 2,000 మంది మృతి

  3. హరీశ్ రావు: ‘‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుంది’’

    హరీశ్ రావు

    తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు.

    2023-24 సంవత్సరానికి గానూ రాష్ట్ర బడ్జెట్‌ను సోమవారం ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

    ఉదయం 10:30 గంటలకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు, అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత శాసన మండలిలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెడతారు.

    ఆదివారం ఉదయం ప్రగతి భవన్​లో సీఎం కేసీఆర్​అధ్యక్షతన జరిగిన కేబినేట్ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం దక్కింది.

    హరీశ్ రావు

    సోమవారం ఉదయంబడ్జెట్ కాపీలతో జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లిన హరీశ్ రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అసెంబ్లీకి బయలుదేరారు.

    కేసీఆర్ ఆలోచనలకు, తెలంగాణ ప్రజలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని హరీశ్ రావు చెప్పారు.

    కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాకపోయినా అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ముందుకెళ్తోందని అన్నారు. సంక్షేమ పథకాలు ఆగకూడదన్న కేసీఆర్ ఆలోచనలతో బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందని అన్నారు.

  4. బ్రేకింగ్ న్యూస్, తుర్కియేలో భారీ భూకంపం

    తుర్కియేలో భారీ భూకంపం సంభవించింది.

    రిక్టర్ స్కేలు మీద దాని తీవ్రత 7.8గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

    గాజియన్‌టెప్‌కు సమీపంలో భూగర్భంలో 17.9 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది.

    ఈ ప్రాంతం సిరియా సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది.

    చాలా నివాస భవనాలు కూలడంతోపాటు అందులో ప్రజలు భారీ సంఖ్యలో చిక్కుకుని పోయారని వార్తలు వస్తున్నాయి.

  5. మోహన్ భాగవత్: ‘కులాలను, వర్ణాలను సృష్టించింది మన పూజారులే... దేవుడు కాదు’

    మోహన్ భాగవత్

    ఫొటో సోర్స్, ANI

    కులాన్ని దేవుడు సృష్టించ లేదని రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు.

    ‘‘సత్యమే నిజం. దేవుడు ఏ రూపంలో ఉన్నా, ఏ పేరుతో పిలిచినా ఒక్కరే. తేడా ఏం ఉండదు. శాస్త్రాల ఆధారంగా చెబుతున్నామంటూ కొంతమంది పండితులు చెప్పినదాంట్లో నిజం లేదు. అది అబద్ధం. కులం పేరుతో మనల్ని తప్పుదారి పట్టించారు. కులం భ్రమ నుంచి బయటపడాలి’’ అని ఆయన అన్నారు.

    కాశీ మందిరాన్ని ధ్వంసం చేసిన తరువాత ఛత్రపతి శివాజీ మహారాజ్, ఔరంగజేబుకు లేఖ రాశారు. ‘హిందువులు, ముస్లింలు ఒకే దేవుని బిడ్డలు. మీ రాజ్యంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం తప్పు. అందరినీ సమానంగా చూడటం మీ బాధ్యత. అలాంటి పనులు ఆపకుంటే నా కత్తితో సమాధానం ఇస్తాను.’ అని ఆ లేఖలో శివాజీ రాసినట్లు మోహన్ భాగవత్ అన్నారు.

    తులసీదాస్, సూర్‌దాస్, కబీర్‌ల కంటే కూడా సంత్ రోహిదాస్ గొప్పవారు. శాస్త్రాలలో ఆయన బ్రాహ్మణులను గెలవలేక పోయి ఉండొచ్చు. కానీ, ఆయన బోధనలు అనేక మంది హృదయాలను హత్తుకున్నాయి. వారిలో దేవుని మీద నమ్మకాన్ని పెంచాయి. మీ మతాల ప్రకారం మీ పని చేయండి. సమాజాన్ని ఏకం చేయడం, దాని అభివృద్ధి కోసం పాటుపడటం... ఇదే మతం చెప్పేది’ అని మోహన్ భాగవత్ అన్నారు.

    సంత్ శిరోమణి రోహిదాస్ ‘647వ జయంతి’ సందర్భంగా ముంబయిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది