హాథ్ సే హాథ్ జోడో యాత్ర కోసం హైదరాబాద్ నుంచి బయల్దేరిన రేవంత్ రెడ్డి
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తలపెట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర నేడు ప్రారంభం కానుంది.
ఈ యాత్రను మొదలుపెట్టేందుకు ముందు మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల ఆశీర్వాదం కోసం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయలుదేరారు.
వరంగల్ హైవే మీదుగా ములుగుకు రేవంత్ చేరుకుంటారు. ములుగులో గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఉదయం 11 గంటలకుమేడారం సమ్మక్క సారలమ్మ వద్ద ప్రత్యేక పూజలు చేసి మధ్యాహ్నం12 గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారు.
తొలిరోజు మేడారం నుంచి రామప్ప వరకు పాదయాత్ర సాగనుంది.
రాత్రికి రామప్ప గ్రామంలోనే రేవంత్ రెడ్డి బస చేస్తారు.