నిలిచిన అదానీ రూ.20 వేల కోట్ల ఎఫ్‌పీఓ

ఫొటో సోర్స్, Reuters
అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ)ను నిలిపివేశారు.
ఎఫ్‌పీఓ ద్వారా షేర్లు అమ్మి రూ.20 వేల కోట్లు సేకరించాలని అదానీ గ్రూప్ భావించింది.
ఇటీవలే వచ్చిన ఈ ఇష్యూకు తొలుత సరైన స్పందన రాలేదు. రిటైల్ ఇన్వెస్టర్లు చాలా వరకు దీనికి దూరంగా ఉన్నారు. కానీ సంస్థాగత ఇన్వెస్టర్ల సాయంతో ఆ ఎఫ్‌పీఓ గట్టెక్కింది.
‘ప్రస్తుతం మార్కెట్‌లో చాలా అనిశ్చితి ఉంది. కొంతకాలంగా స్టాక్ ధరలు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఇప్పుడున్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా ముందుకు వెళ్లడం నైతికంగా సరైనది కాదని కంపెనీ బోర్డు భావించింది’ అని గౌతమ్ అదానీ తెలిపారు.
అదానీ గ్రూప్ ‘మోసాలకు పాల్పడింది’ అంటూ ఈ నెల 24న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికను విడుదల చేసింది. దాంతో అదానీ గ్రూప్ షేర్లు భారీ నష్టాలను చవి చూశాయి.
రాజకీయ విమర్శలకు సైతం అదానీ గ్రూప్ లక్ష్యంగా మారింది.
అయితే హిండెన్‌బర్గ్ నివేదికలను అదానీ గ్రూప్ ఖండించింది. దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
