బడ్జెట్ 2023: ఇంతకీ పన్ను భారం పెరిగిందా, తగ్గిందా?
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేం ద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అమృత కాలంలో ప్రవేశపెడుతున్న ఈ తొలి బడ్జెట్‌లో సప్తర్షుల తరహాలో ఏడు రంగాలకు ప్రాధాన్యమిచ్చామన్నారు.
లైవ్ కవరేజీ
సప్తర్షుల్లా ఏడు అంశాలకు ప్రాధాన్యం
ఫొటో సోర్స్, ani
సమీకృత అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడులు, యువత ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యాంశాలని
నిర్మల సీతారామన్ చెప్పారు.
భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచం ప్రకాశవంతమైన తారగా గుర్తించిందని..
ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నిటి కంటే ఎక్కువగా ప్రస్తుత ఆర్థిక
సంవత్సరంలో 7 శాతం వృద్ధి రేటును అంచనా వేస్తున్నామని ఆమె చెప్పారు.
సప్తర్షుల్లా ఏడు
ప్రాధాన్యాంశాలు ఉన్నాయన్నారు.
1) సమీకృత అభివృద్ధి
2) ప్రతి ఒక్కరికీ
చేరువకావడం
3) మౌలిక వసతులు,
పెట్టుబడులు
4) సామర్థ్యాలను ఆవిష్కరించడం
5) గ్రీన్ గ్రోత్
6) యువశక్తి
7) ఆర్థిక రంగం
అదానీ గ్రూప్: ఎల్ఐసీ పెట్టుబడులపై ప్రశ్నలు ఎందుకు వినిపిస్తున్నాయి
నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభం
ఫొటో సోర్స్, samsad tv
ఆర్థిక మంత్రి నిర్మల
సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు.
భారత ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలో వెళ్తోందని ఆమె చెప్పారు.
కోవిడ్ సమయంలో ఒక్కరు
కూడా ఆకలితో పడుకోరాదనే లక్ష్యంతో 80 కోట్ల మందికి కేంద్రం ఉచితంగా తిండి గింజలు
ఇచ్చిందని, 28 నెలల పాటు ఇలా ఇచ్చిందని నిర్మల సీతారామన్ చెప్పారు.
ప్రపంచం సవాళ్లు
ఎదుర్కొంటున్న ఈ సమయంలో జీ20 సమావేశాలకు అధ్యక్షత వహించడమనేది ప్రపంచ ఆర్థిక క్రమంలో
భారత్ మరింత బలపడేందుకు దోహదపడుతుందని ఆమె అన్నారు.
కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి: ‘‘దొంగతనంగా పార్టీ ఎమ్మెల్యేల మాటలు వినాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది?, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం
ఫొటో సోర్స్, KotamreddySridharreddy/fb
ఫోన్ ట్యాపింగ్
కారణంగానే పార్టీని వీడుతున్నానని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్
రెడ్డి చెప్పారు.
పార్టీకి, వైఎస్
జగన్‌కు విధేయుడిగా ఉన్న తనను అవమానిస్తున్నారని, అవమానించే చోట ఉండాల్సిన అవసరం తనకు
లేదని శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో
వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేయనని అన్నారు.
బుధవారం విలేఖరుల
సమావేశాన్ని నిర్వహించిన ఆయన తన అసంతృప్తిని వెలిబుచ్చారు. తన ఫోన్‌ను ట్యాప్
చేయడం న్యాయమా? అని ప్రశ్నించారు.
‘‘అధికారిక
పార్టీ ఎమ్మెల్యేలపై ఎందుకు నిఘా పెడుతున్నారు? ఇంత నిఘా అవసరమా? నాకు నటన, మోసం
చేయడం చేత కాదు. ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు నాతో మాట్లాడారు. నా ఫోన్‌ను
ట్యాప్ చేసి నేను మాట్లాడిన ఆడియోను నాకు పంపించారు. ఆ ఆడియోలో నాది, నా మిత్రుడి
గొంతు ఉంది. ఫోన్ ట్యాపింగ్ చేశారనడానికి ఇంతకుమించిన ఆధారాలు ఏం కావాలి. ఫోన్
ట్యాప్ అయిందని నేను ఆధారాలతో బయటపెడుతున్నా. ఫోన్ ట్యాప్ చేయలేదని మీరు
నిరూపించండి.
ట్యాపింగ్
చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పి ఉంటారు. దొంగతనంగా పార్టీ
ఎమ్మెల్యేల మాటలు వినాల్సిన అవసరం ఏంటి? జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణ
రెడ్డికి తెలియకుండా ఇలాంటిది జరుగుతుందా?నాయకుడే ఎమ్మెల్యేలను నమ్మకపోతే ఎలా? నాయకుడే
నమ్మకపోతే ఇంకా పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు. ఒక్క క్షణం కూడా పార్టీలో
ఉండాల్సినఅవసరం నాకు లేదు.
పార్టీ
ఎమ్మెల్యే ఉండగా వేరే వారిని ఇంచార్జి గా నియమించాల్సిన అవసరం ఏంటి?పార్టీ కోసం కష్టకాలంలో
పనిచేశాను, సముచిత స్థానం కోరుకోవడం తప్పా? ప్రజా సమస్యలపై
ప్రశ్నిస్తే ఇలా చేస్తారా? నన్ను గెలిపించిన ప్రజల కోసం పోరాడితే
అవమానిస్తారా?ఎమ్మెల్యేలపై నమ్మకం లేకపోతే ఇంకా ప్రజల మీద ఏం నమ్మకం ఉంటుంది. ఇదేం కర్మ
రాష్ట్రానికి ఇలాంటి వ్యక్తితో’’ అని కోటం రెడ్డి అన్నారు.
బడ్జెట్ ట్యాబ్‌తో రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన నిర్మలా సీతారామన్
ఫొటో సోర్స్, President of India/Twitter
2023-24 సంవత్సర
కాలానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికాసేపట్లో పార్లమెంట్‌లో
ప్రవేశపెట్టనున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో పాటు సహాయక మంత్రులు భాగవత్ కిషన్ రావు, పంకజ్ చౌదరీ, ఆర్థిక శాఖ ఇతర సీనియర్ అధికారులు కొద్దిసేపటి క్రితం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి
ద్రౌపది ముర్మును కలిశారు.
అక్కడి నుంచి
పార్లమెంట్‌కు బయల్దేరారు. ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను
ప్రవేశపెట్టనున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
కల్పనా చావ్లా: కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ కూలిపోతుందని నాసాకు ముందే తెలుసా... ఆ రోజు ఏం జరిగింది
బడ్జెట్ 2023: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్
ఫొటో సోర్స్, Getty Images
భారత ఆర్థిక మంత్రి నిర్మలా
సీతారామన్ 2023-24 సంవత్సరానికి గానూ బుధవారం
పార్లమెంట్‌లో సాధారణ బడ్జెట్‌నుప్రవేశపెట్టనున్నారు.
మంగళవారంరాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ప్రసంగంతో బడ్జెట్ సెషన్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సమర్పించారు.
2023-24లో భారత జీడీపీ 6-6.8 శాతంగా వృద్ధి చెందుతుందని
ఆర్థిక సర్వే అంచనా వేసింది.
ఫొటో సోర్స్, Getty Images
బడ్జెట్ నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారు?
రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారంతా ఈ బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఈ రంగానికి అవసరమైన సంస్కరణలను ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం తీసుకురాగలదని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.గృహ రుణంపై మినహాయింపును రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని రియల్ ఎస్టేట్ పరిశ్రమ కోరుతున్నట్లు పలు మీడియా కథనాలు తెలిపాయి.
వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరిగాయని ఆర్థిక సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన బడ్జెట్‌లో రైతులకు కొంత ఊరటనిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
కోవిడ్ మహమ్మారి తర్వాత, రష్యా-యుక్రెయిన్ యుద్ధం కారణంగాప్రపంచం అంతా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటోంది.యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. పశ్చిమ దేశాలపై కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో చాలా పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగులను తొలిగించాయి. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులకు బడ్జెట్‌లోఏమైనా ఉపశమనం లభిస్తుందా? అనే అంశంపై అందరి దృష్టి ఉంది.
ఇటీవలఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాను మధ్యతరగతి నుంచి వచ్చానని, మధ్య తరగతి సమస్యలను అర్థం చేసుకుంటానని అన్నారు. ఈ బడ్జెట్‌లో మధ్యతరగతి వర్గాలకు కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా చేయూతనిస్తుందని భావిస్తున్నారు.
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్
తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.