You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బడ్జెట్ 2023: ఇంతకీ పన్ను భారం పెరిగిందా, తగ్గిందా?
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేం ద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అమృత కాలంలో ప్రవేశపెడుతున్న ఈ తొలి బడ్జెట్‌లో సప్తర్షుల తరహాలో ఏడు రంగాలకు ప్రాధాన్యమిచ్చామన్నారు.
లైవ్ కవరేజీ
లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం
ఈరోజు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం. రేపు ఉదయం మళ్ళీ తాజావార్తలతో కలుసుకుందాం.
ధన్యవాదాలు.
బడ్జెట్ 2023: ఇకపై ఆదాయపన్ను ఎంత కట్టాలి... రూ. 3 లక్షలు అయితే ఎంత? 30 లక్షలు అయితే ఎంత?
బడ్జెట్ 2023: చైనాతో సరిహద్దు సమస్యలు, రక్షణ రంగ బడ్జెట్‌ను పెంచిన ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023లో రక్షణ రంగానికి కేటాయించిన మొత్తాన్ని గత ఏడాది కంటే పెంచింది.
2023-24లో రక్షణ రంగానికి కేటాయింపులను రూ.5.25 లక్షల కోట్ల నుంచి రూ.5.94 లక్షల కోట్లకు పెంచుతున్నట్టు ప్రకటించింది.
లద్దాఖ్, అరుణాచల్‌ప్రదేశ్ ప్రాంతాల్లో చైనాతో సరిహద్దు సమస్యలు పెరుగుతున్న క్రమంలో ఈ కేటాయింపులను కూడా పెంచింది.
మిలటరీ ఖర్చుల కోసం బడ్జెట్‌లో రూ.లక్షా 62 వేల కోట్లను కేటాయించింది. ఈ డబ్బులతో కొత్త ఆయుధాలను, విమానాలను, యుద్ధ నౌకలను, ఇతర ఆయుధ పరికరాలను కొనుగోలు చేయొచ్చు.
గత ఏడాదితో పోలిస్తే ఈ కేటాయింపులు రూ.10 వేల కోట్లు పెరిగాయి.
భారత సరిహద్దు ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణాలను చేపట్టాలని గుర్తించిన ప్రభుత్వం రక్షణ రంగానికి బడ్జెట్‌ను కూడా అదనంగా పెంచింది.
గత ఏడాది సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణానికి సరిహద్దు రహదారి సంస్థ (బీఆర్ఓ)కు రూ.3,500 కోట్లు కేటాయించగా.. ప్రస్తుతం దాన్ని రూ.5 వేల కోట్లకు పెంచింది.
భారత్ vs న్యూజీలాండ్: మరోసారి మెరిసిన శుభ్‌మన్ గిల్, భారత్ స్కోరు 234
అహ్మదాబాద్‌లో భారత్, న్యూజీలాండ్‌కు మధ్య జరుగుతున్న టీ20 మూడవ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత క్రికెట్ జట్టు 234 పరుగులు చేసింది.
20 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి ఈ స్కోరును సంపాదించింది.
భారత్ తరఫున ఇన్నింగ్స్ ప్రారంభించిన శుభ్‌మన్ గిల్ మరోసారి మెరిశాడు. 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 63 బంతులకి 126 పరుగులు చేశాడు శుభ్‌మన్ గిల్.
54 బంతుల్లోనే శుభ్‌మన్ గిల్ సెంచరీ చేశాడు. టీ20 మ్యాచ్‌లలో శుభ్‌మన్ గిల్ తొలి సెంచరీ ఇదే.
టాస్ గెలుచుకున్న భారత్ తొలుత బ్యాటింగ్ చేసేందుకే అంగీకరించింది. శుభ్‌మన్‌తో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు.
కేవలం ఒక పరుగు మాత్రమే చేసిన ఇషాన్ కిషన్ రెండో ఓవర్‌లోనే ఔటయ్యాడు.
మూడో బ్యాటర్‌గా వచ్చిన రాహుల్ త్రిపాఠి, వేగంగా ఆడి 22 బంతుల్లో 44 పరుగులు చేశాడు. రెండో వికెట్ పడే సమయానికి వీరిద్దరి భాగస్వామ్యంలో 80 పరుగులు చేశారు. త్రిపాఠి నాలుగు ఫోర్లను, 6 సిక్స్‌లను నమోదు చేశాడు.
రాహుల్ ఔటైన తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా 13 బంతుల్లో 24 పరుగులు చేశాడు.
కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌తో 17 బంతుల్లో 30 పరుగులు చేశాడు.
చివరి బంతి వరకి శుభ్‌మన్ గిల్ పిచ్‌పైనే ఉన్నాడు.
ఫోర్బ్స్ లిస్ట్: సంపన్నుల జాబితాలో మరింత కిందకి పడిన గౌతమ్ అదానీ
ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో భారత పారిశ్రామిక వేత్త, అదానీ గ్రూపుల యజమాని గౌతమ్ అదానీ మరింత కిందకి పడిపోయారు.
కొంతకాలం క్రితం వరకు ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ, ప్రస్తుతం 15వ స్థానానికి దిగొచ్చారు.
బుధవారం అదానీ సంపద 76.8 బిలియన్ డాలర్లకు పడిపోయింది.
స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పడిపోతుండటంతో అదానీ సంపద కూడా కరిగిపోతుంది.
హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ స్టాక్స్ పడిపోతున్నాయి.
ఈ నివేదికలో అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది.
బడ్జెట్ 2023: విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ ప్రస్తావన ఏదీ?
తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది: వైఎస్సార్‌సీపీ ఎంపీ
బెంగళూరు నారాయణ హృదయాలయాలో తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి, వైద్యులతో మాట్లాడారు.
తారకరత్న ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు. మెదడు తప్ప ఇతర అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నాయని చెప్పారు.
గుండె ఆగిపోవడంతో 40 నిమిషాలు మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోయిందని, దీంతో మెదడులో పైభాగం దెబ్బతిందని అన్నారు.
వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని, మెదడు కూడా రికవరీ అయి తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతుందని భావిస్తున్నామని చెప్పారు.
బాలకృష్ణ అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్: శ్రీకాకుళం నుంచి మత్స్యకారులు గుజరాత్‌కు ఎందుకు వలస పోతున్నారు?
బడ్జెట్ 2023: నిర్మల సీతారామన్ పద్దులో 10 ముఖ్యాంశాలు ఇవే...
బడ్జెట్ 2023: ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి? వేటి ధరలు పెరుగుతాయంటే?
భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో కొత్త పన్ను విధానంతో పాటు కస్టమ్ డ్యూటీని పెంచడం గురించి ఆమె ప్రకటన చేశారు.
తాజా బడ్జెట్‌ను ఆమె అమృతకాల బడ్జెట్ అని అభివర్ణించారు.
కస్టమ్ డ్యూటీ కారణంగా ఏమే వస్తువుల ధరలు పెరుగుతాయో, ఏ వస్తువులు తక్కువకు లభిస్తాయో కింద చూడండి.
చౌకగా లభించే వస్తువులు
- కెమెరా లెన్స్, లిథియం ఆయన్ బ్యాటరీ వంటి మొబైల్ ఫోన్లలో ఉపయోగించే ఉపకరణాలపై కస్టమ్ సుంకాన్ని తగ్గించారు.
- టెలివిజన్ ప్యానల్‌లో బిగించే సెల్‌లో ఉండే కొన్ని భాగాలపై కస్టమ్ పన్ను ఉండదు.
- ల్యాబ్‌లలో తయారు చేసే డైమండ్లపై కస్టమ్ సుంకం తక్కువగా ఉంటుంది. దీంతో వీటి ధరలు తగ్గనున్నాయి.
- రాగి వ్యర్థాలపై 2.5 శాతంగా ఉన్న సుంకాన్ని మార్చట్లేదు.
- డీనేచర్డ్ ఇథైల్ ఆల్కహాల్‌కు పన్ను నుంచి విముక్తి కల్పించారు.
- క్రూడ్ గ్లిజరిన్‌పై ఉండే పన్నును 7.5 నుంచి 2.5కు తగ్గించారు.
రేట్లు పెరిగే వస్తువులు
- సిగరెట్‌పై పన్నును 16 శాతం పెంచారు
- బంగారం బిస్కెట్‌తో తయారుచేసే వస్తువులపై పన్ను పెరుగనుంది
- వెండి ధర కూడా పెరుగనుంది
- చిమ్నీలపై పన్నును 7.5 నుంచి 15 శాతానికి పెంచారు.
గడ్చిరోలి అడవుల్లో గాంధేయ మార్గంలో సాగుతున్న నిశ్శబ్ద విప్లవం
వ్యక్తిగత ఆదాయపన్ను కొత్త శ్లాబ్‌లు
0 నుంచి రూ. 3 లక్షల వరకు – పన్ను లేదు
రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు – 5 శాతం పన్ను
రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు – 10 శాతం పన్ను
రూ. 9 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు – 15 శాతం పన్ను
రూ. 12 లక్షలు నుంచి రూ. 15 లక్షలు – 20 శాతం పన్ను
రూ. 15 లక్షలు దాటితే – 30 శాతం పన్ను
కొత్త ఆదాయ పన్ను విధానం ఎంచుకున్నవారికి రూ. 7 లక్షల వరకు రిబేట్
కొత్త ఆదాయ పన్ను విధానం ఎంచుకున్నవారికి రూ. 7 లక్షల వరకు రిబేట్ కల్పిస్తున్నట్లు నిర్మల సీతారామన్ ప్రకటించారు.
ఈ పరిమితి ఇంతకుముందు రూ. 5 లక్షలుగా ఉండేది.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్: 7.5 శాతం వడ్డీతో ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ తీసుకొస్తున్నట్లు నిర్మల సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.
ఇవి రెండేళ్ల కాలపరిమితిలో ఉంటాయి. ఈ పథకంలో ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఇస్తారు.
ఇందులో గరిష్ఠంగా రూ. 2 లక్షలు డిపాజిట్ చేయొచ్చు.
జీడీపీలో 5.9 శాతం ద్రవ్యలోటు
సవరించిన అంచనాల ప్రకారం 2023-24లో ద్రవ్యలోటు జీడీపీలో 5.9 శాతమని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు జీడీపీలో 4.5 శాతానికి తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె చెప్పారు.
రైల్వేల అభివృద్ధికి బడ్జెట్‌లో రూ. 2.4 లక్షల కోట్లు
రైల్వేల అభివృద్ధికి బడ్జెట్‌లో రూ. 2.4 లక్షల కోట్లు కేటాయించారు.
కొత్త లైన్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు.
రాష్ట్రాలలో ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు 50 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు, హెలిప్యాడ్స్, వాటర్ ఏరో డ్రోన్స్ అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.
ముఖ్యమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ. 75 వేల కోట్లు కేటాయించారు.
రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం కోసం రూ. 13.7 లక్షల కోట్లు కేటాయించారు.
ఈ-కోర్టుల ఏర్పాటుకు రూ. 7 వేల కోట్లు, పట్టణ మౌలిక వసతుల కల్పనకు రూ. 10 వేల కోట్లు కేటాయించారు.
పర్యటక రంగ అభివృద్ధి కోసం దేశంలోని 50 ప్రాంతాలను ఎంపిక చేసి అభివృద్ధి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు.
నేషనల్ హైడ్రోజన్ మిషన్ కోసం ఈ బడ్జెట్‌లో రూ. 19,700 కోట్లు కేటాయించారు. 2030 నాటికి 5 లక్షల టన్నుల హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
దేశవ్యాప్తంగా 157 నర్సింగ్ కాలేజీలు కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
సున్తీ తర్వాత సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా? నాలుగు ప్రశ్నలు, సమాధానాలు
చిరుధాన్యాల హబ్‌గా భారత్
‘శ్రీ అన్న’(చిరుధాన్యాలు) ఉత్పత్తిలో భారత్ ప్రథమ స్థానంలో, ఎగుమతిలో ద్వితీయ స్థానంలో ఉందని.. ‘శ్రీ అన్న’ గ్లోబల్ హబ్‌గా భారత్‌ను నిలిపేందుకు అనుసరించాల్సిన విధానాల రూపకల్పన, అందరికీ అందించేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్’ పనిచేస్తుందని, కేంద్రం నుంచి ఈ సంస్థకు సహకారం అందుతుందని నిర్మల సీతారామన్ చెప్పారు.
అగ్రికల్చర్ యాక్సిలరేషన్ ఫండ్, ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాం, పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ ప్యాకేజ్
వ్యవసాయ రంగంలో స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఉంటుందని ఆర్థిక మంత్రి చెప్పారు.
గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఔత్సాహిక యువత వ్యవసాయ స్టార్టప్‌లు ఏర్పాటుచేస్తే సహకరించేందుకు వ్యవసాయ వృద్ధి నిధి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేలా కొత్త ఆలోచనలో ముందుకొచ్చే యువ పారిశ్రామికవేత్తలకు సహకారం అందుతుందని చెప్పారు.
అధిక విలువైన ఉద్యాన పంటల కోసం రూ. 2,200 కోట్లతో ఆత్మనిర్బర్ క్లీన్ ప్లాంట్ ప్రొగ్రామ్‌కు రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు.
రూ. 2,516 కోట్లతో 63,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కంప్యూటరీకరణ చేపట్టనున్నట్లు చెప్పారు.
పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ ప్యాకేజ్‌లో భాగంగా సంప్రదాయ చేతివృత్తులవారు తమ ఉత్పత్తుల నాణ్యత పెంచుకునేలా, ఉత్పత్తి పెంచేలా సహకరిస్తామన్నారు.