నందమూరి తారకరత్న: మెరుగైన చికిత్స కోసం బెంగళూరు ఆస్పత్రికి తరలింపు
నందమూరి తారకరత్నను బెంగళూరు తరలించే యోచనను వైద్యులు విరమించుకున్నారు. కుప్పంలోని పీఈసీ ఆస్పత్రిలోనే ఆయనకు వైద్యం అందించాలని నిర్ణయం.
లైవ్ కవరేజీ
జనాబాయి జమునగా ఎలా మారారో తెలుసా?
బ్రేకింగ్ న్యూస్, నందమూరి తారకరత్నకు అస్వస్థత

ఫొటో సోర్స్, Facebook/Nandamuri Tarakarathna
తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న సినీనటుడు నందమూరి తారకరత్న అస్వస్థతకు లోనయ్యారు.
తారకరత్నకు కార్డియాక్ అరెస్ట్ కావడంతో కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారని తెలుగుదేశం నాయకులు బీబీసీకి తెలిపారు.
యాంజియోగ్రామ్ చేస్తున్నామని, పరిస్థితి స్థిమితంగా ఉందని స్థానిక వైద్యులు చెప్పారు.
మరింత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న కళ్లు తిరిగి పడిపోవడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు.
‘యువగళం’ పేరుతో నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర నేడు కుప్పం నుంచి ప్రారంభమైంది.
400 రోజుల పాటు సాగే ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో ముగుస్తుంది.

ఫొటో సోర్స్, UGC
ప్రస్తుతం కుప్పంలోని ఆసుపత్రిలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. తారకరత్న బాబాయి నందమూరి బాలకృష్ణ ఆసుపత్రికి చేరుకున్నారు.

ఫొటో సోర్స్, UGC
లైవ్ పేజీకి స్వాగతం
బీబీసీ న్యూస్ లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూనే ఉండండి.
శబరిమల: అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళల పరిస్థితి ఇప్పుడెలా ఉంది?
