You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

న్యూజిలాండ్‌పై మూడో వన్డేలో గెలుపు.. నెంబర్ 1 ర్యాంకుకు చేరుకున్న భారత్

భారత్, న్యూజిలాండ్‌పై మూడో వన్డే లో గెలిచి 3-0తో సీరీస్ కైవసం చేసుకుంది. దీంతో ఐసీసీ ర్యాంకింగ్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకుంది.

లైవ్ కవరేజీ

  1. కాల్పులు జరిపింది 21 ఏళ్ల యువకుడిగా గుర్తింపు

    వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు జరిపి, భద్రతా సర్వీసుల ఎదురుకాల్పుల్లో మరణించిన అనుమానితుడు ఎవరో పోలీసులు గుర్తించినట్లు బీబీసీ భాగస్వామి మీడియా సంస్థ సీబీఎస్ తెలిపింది.

    21 ఏళ్ల నాసిరే బెస్ట్ ఆ కాల్పులు జరిపినట్లు ఇన్వెస్టిగేషన్‌తో సంబంధమున్న ఒక వ్యక్తిని ఉటంకిస్తూ సీబీఎస్ రిపోర్ట్ చేసింది.

    ‘నిందితుడు 2025 జులైలో వైట్‌హౌస్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు అమెరికా సీక్రెట్ సర్వీస్ అతన్ని అరెస్ట్ చేసింది. ఆ తర్వాత మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా అతన్ని సైకియాట్రిక్ వార్డ్‌కు పంపించారు’ అని సదరు వ్యక్తిని చెప్పినట్లు సీబీఎస్ తెలిపింది.

  2. వైట్‌హౌస్ సమీపంలో ‘15 నుంచి 30 రౌండ్ల పాటు’ కాల్పులు

    అమెరికా వైట్ హౌస్ సమీపంలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది.

    స్థానిక సమయం ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో వైట్ హౌస్ వద్ద ఉన్న పలువురు జర్నలిస్టులు తమకు ఒక్కసారిగా తుపాకీకాల్పుల శబ్దం వినిపించినట్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు.

    సీక్రెట్ సర్వీస్ సిబ్బంది వెంటనే వారిని భవనం లోపలికి, ప్రెస్ బ్రీఫింగ్ రూమ్‌లోకి తీసుకెళ్లారు. ఆపై వైట్ హౌస్‌ను లాక్‌డౌన్ చేశారు.

    సుమారు 15 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరిగినట్లు బీబీసీ భాగస్వామి సీబీఎస్ న్యూస్ పేర్కొంది. ఒకే ఒక్క సాయుధుడు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల వైపు దూసుకువచ్చి వారిపై కాల్పులు జరిపాడని, ఆ తర్వాత సదరు ఏజెంట్లు ఎదురుకాల్పులు జరిపినట్లు సీబీఎస్ రిపోర్ట్ చేసింది.

    17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా అవెన్యూ ప్రాంతంలో ఒక సాయుధుడు తన బ్యాగ్ నుంచి ఆయుధం తీసి కాల్పులు మొదలుపెట్టినట్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ ప్రకటించింది.

    ‘సీక్రెట్ సర్వీస్ పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో నిందితుడికి గాయాలయ్యాయి. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించగా, అక్కడ అతడు మరణించినట్లు ప్రకటించారు. ఈ కాల్పుల సమయంలో అక్కడ ఉన్న ఒక సాధారణ పౌరుడు కూడా గాయపడ్డారు.

    అధికారులకు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటన జరిగిన సమయంలో అధ్యక్షుడు వైట్ హౌస్‌లోనే ఉన్నారు’ అని తన ప్రకటనలో పేర్కొంది.

    ట్రంప్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వద్ద ఒక సాయుధుడు కాల్పులు జరిపిన నెల రోజుల తర్వాత ఈ ఘటన జరిగింది.

  3. తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. 12 ఫోటోల్లో..

  4. "భారత్‌కు ఎంత ఆయిల్ కావాలంటే అంత ఇవ్వడానికి మేం రెడీ", అమెరికా విదేశాంగ మంత్రి వ్యాఖ్యల ఆంతర్యమేంటి?

  5. ‘‘నా పిల్లలు అన్నం అడుగుతున్నారు, వారిని అమ్మేయడం తప్ప వేరే దారి లేదు’’

  6. పత్రికా స్వేచ్ఛకు కొలమానాలేంటి, భారత్‌లో మీడియా స్వేచ్ఛపై వివాదం దేనికి?

  7. వెజ్ బిర్యానిలో చికెన్ ముక్కలు, స్విగ్గీ యజమానికి నాన్ బెయిలబుల్ వారంట్

  8. హమ్జా బుర్హాన్‌: ‘టెర్రరిస్ట్‌’గా భారత్ ప్రకటించిన ఈయన్ను ముజఫరాబాద్‌లో కాల్చి చంపారు.. అసలెవరీయన?

  9. పెళ్లికి ఒప్పుకోలేదని బాలిక రొమ్మును గాయపరిచిన యువకుడు

  10. భారత్‌లో జరగాల్సిన ‘ఇండియా - ఆఫ్రికా సదస్సు’ ఎబోలా కారణంగా వాయిదా

  11. గనేరియా, సిఫిలిస్ కేసులు యూరప్‌లో రికార్డు స్థాయిలో పెరిగాయి - ఇన్ఫెక్షన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?

  12. పెరోల్‌పై బయటికొచ్చి తప్పించుకు తిరుగుతూ సీరియల్స్‌లో నటుడిగా కొత్త అవతారం, 12 ఏళ్ల తర్వాత పోలీసులకు ఎలా చిక్కారంటే..

  13. ఎండ 40 డిగ్రీలు దాటితే మన శరీరానికి ఏమవుతుంది, వడగాడ్పులు ఎప్పుడు ప్రమాదకరం?

  14. ఆహార భద్రత చట్టం సురక్షితమైన ఆహారానికి పూచీ పడటం లేదా?

  15. రూపాయి విలువ బలహీనపడటానికి కారణమేంటి, దీనిని అధిగమించడానికి భారత్ ఏం చేస్తోంది?

  16. శ్రీరంగంలో ఈ భారీ గోపురం ప్రత్యేకతలేంటో తెలుసా?

  17. రెంటచింతల, ఖమ్మం, పిడుగురాళ్ల సహా అనేక చోట్ల నిప్పుల వర్షంలా వాతావరణం.. దిల్లీలో ఆరెంజ్ అలర్ట్, 14 ఏళ్ల రికార్డు బ్రేక్

  18. ఘోస్ట్ సిమ్: సజ్జనర్ చెప్పిన ఈ సిమ్‌కార్డ్ ఏమిటి? మీ పేరుతో అలాంటిది ఉందో లేదో తెలుసుకోవడం ఎలా

  19. టైగర్ రిజర్వ్‌లో ‘కనిపించిన’ జంట కుండల్లో ఏముంది? బంగారం, వజ్రాలా? ఆదిమ మానవుల అస్థిపంజరాలా?

  20. మూవీ రివ్యూ: దృశ్యం -3 మొదటి రెండు భాగాలను మించిన థ్రిల్ ఇచ్చిందా?