You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఆంధ్రప్రదేశ్: సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ బదిలీ

జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు రిపోర్ట్ చేయాలంటూ సునీల్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యకార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశించారు.

లైవ్ కవరేజీ

  1. పస్మాంద ముస్లింలు ఎవరు, ప్రధాని మోది వారి గురించి ఎందుకు ప్రస్తావించారు?

  2. పాకిస్తాన్‌లో స్తంభించిన విద్యుత్ వ్యవస్థ

    పాకిస్థాన్‌లో సోమవారం ఉదయం విద్యుత్ వ్యవస్థ స్తంభించింది.

    ఈరోజు ఉదయం 7:34 గంటలకు నేషనల్ గ్రిడ్ సిస్టమ్ ఫ్రీక్వెన్సీ పడిపోయిందని ప్రాథమిక నివేదికల ప్రకారం పాక్ ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది.

    దీనివల్ల విద్యుత్ వ్యవస్థలో తీవ్ర అంతరాయం ఏర్పడిందని వెల్లడించింది.

    ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ (ఇస్కో) ప్రకారం, 117 గ్రిడ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

    “ఈ పరిస్థితిపై రీజియన్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇంకా స్పష్టమైన వివరాలు మాకు తెలియరాలేదు’’ అని ఇస్కో ట్వీట్ చేసింది

  3. రిపబ్లిక్ డే పరేడ్‌: నేడు కర్తవ్యపథ్‌లో ఫు‌ల్ డ్రెస్ రిహార్సల్స్, ట్రాఫిక్ ఆంక్షలు

    గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో సోమవారం దిల్లీలో త్రివిధ దళాల ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు.

    ఉదయం 10:30 గంటలకు విజయ్‌ చౌక్ నుంచి ఈ రిహార్సల్స్ ప్రారంభం అవుతాయి.

    కర్తవ్యపత్, సి-హెక్సాగాన్, సుభాష్ చంద్రబోస్ విగ్రహం, తిలక్ మార్గ్, బహదూర్ షా జఫర్ మార్గ్, నేతాజీ సుభాష్ మార్గ్ మీదుగా ఎర్రకోటకు పరేడ్ చేరుకుంటుంది.

    ఈ నేపథ్యంలో దిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆదివారం రాత్రి నుంచి ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను కొనసాగిస్తున్నారు.

    సోమవారం సాయంత్రం వరకు కర్తవ్యపథ్ నుంచి విజయ్‌చౌక్ వరకు వాహనాలను అనుమతించబోమని ప్రకటించారు.

    ఈనెల 26న జరిగే భారత్ 74వ గణతంత్ర దినోత్సవానికి ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

  4. హలో ఆల్, గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.

  5. సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?