You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

విమానంలో వృద్ధురాలిపై ప్రయాణికుడు మూత్రం పోసిన కేసులో ఎయిర్ఇండియాకు రూ. 30 లక్షల జరిమానా

కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో నిరసనలు చేస్తోన్న భారత రెజ్లర్లు గురువారం రాత్రి సమావేశం అయ్యారు. అయితే, ఈ సమావేశంలోనూ వారికి పరిష్కారం లభించలేదని రెజ్లర్లు చెబుతున్నారు.

లైవ్ కవరేజీ

  1. మగవాళ్లకన్నా ఆడవాళ్లే ఎక్కువకాలం జీవిస్తారా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

  2. అమెరికా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ఎలా, నిబంధనలు ఏమిటి?

  3. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల చుట్టూ ఇంత వివాదం ఎందుకు? పవన్ కల్యాణ్ ఏమన్నారు?

  4. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు: ఇందులో ఏయే పన్నులు దాగి ఉంటాయి, రాష్ట్రానికో తీరుగా ఎందుకుంటుంది?

  5. ‘‘నేను ఓడలో నిద్రపోతున్నా, బాంబులు పడటంతో సముద్రంలో దూకేశా’’

  6. ఓ అరగంటసేపు కూర్చోవడం తగ్గిస్తే ఎంత ప్రయోజనమో తెలుసా?

  7. అమెరికా కొత్త గ్రీన్ కార్డు పాలసీ: భారతీయుల కల చెదిరిపోతుందా?

  8. నీళ్లు కావాలంటే ఇలా బావిలోకి దిగాల్సిందే..

  9. "ఇదే మీ కూతురో, మేనకోడలో, కుటుంబ సభ్యురాలో అయితే మీరు సంతోషిస్తారా?" ప్రధానమంత్రికి అత్యాచార బాధితురాలి తల్లి ప్రశ్న

  10. అత్తని 9 కిలోమీటర్లు మోసుకెళ్లిన కోడలు, అలోక్ పుతుల్, బీబీసీ కోసం, రాయ్‌పూర్ నుంచి..

    ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లా, మైన్‌పాట్ ప్రాంతంలోని జంగల్‌పారా గ్రామంలో హృదయవిదారక దృశ్యమొకటి వెలుగులోకి వచ్చింది.

    పింఛన్ కోసం ఒక మహిళ 90 ఏళ్లున్న తన అత్తను వీపుపై మోసుకుంటూ 9 కిలోమీటర్ల దూరంలోని బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చింది.

    సోమారి బాయి గిరిజన మహిళ. ఆమెకు రావాల్సిన రూ.1500 పెన్షన్ సొమ్ము గత మూడు నెలలుగా రావడం లేదు. దీంతో కోడలు రుక్మిణియా తన అత్తని వీపుపై మోసుకుంటూ రాళ్లురప్పలు, వాగులు దాటుకుంటూ 9 కిలోమీటర్ల దూరంలోని సెంట్రల్ బ్యాంకుకు తీసుకెళ్లారు.

    వాళ్ల ఊరికి సరైన రోడ్డు మార్గం గానీ, రవాణా సౌకర్యాలు గానీ లేవు.

    సోమారి బాయి బ్యాంకు ఖాతాకు సంబంధించిన కేవైసీ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఆ ఖాతా సేవలు నిలిచిపోయాయని బ్యాంక్ మేనేజర్ అల్తాఫ్ మీర్జా తెలిపారు. ప్రస్తుతం ఆ అకౌంట్‌కు సంబంధించిన కేవైసీ, మొబైల్ నంబర్ అనుసంధాన ప్రక్రియ పూర్తయింది.

    ఇకపై బ్యాంక్ మిత్ర ద్వారా పింఛన్ సొమ్ము నేరుగా వృద్ధురాలి ఇంటికే వెళ్లి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఆమెకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.

    ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆ గ్రామానికి చేరుకుని ఆరా తీశారు. సోమారి బాయి పింఛను విత్‌డ్రా చేసే అవకాశం ఆమె కోడలు రుక్మిణియాకు కల్పించనున్నట్లు మైన్‌పాట్ ఎస్డీఎం ఫగేశ్ సిన్హా తెలిపారు.

  11. 'రొమ్ముల సర్జరీ తర్వాత నన్ను నేను చూసుకోగానే ఏడుపొచ్చేసింది', వక్షోజాల సైజు తగ్గించుకున్న ఈ మహిళలు ఏమంటున్నారు?

  12. బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్ చరణ్

    టాలీవుడు నటుడు రామ్ చరణ్.. భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు క్షమాపణలు చెప్పారు.

    త్వరలో విడుదల కానున్న తన సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ రామ్ చరణ్ పొరపాటున జస్ప్రీత్ బుమ్రాను ఫుట్‌బాల్ ఆటగాడిగా సంబోధించారు.

    ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రామ్ చరణ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా బుమ్రాకు క్షమాపణలు తెలిపారు.

    రామ్ చరణ్ శనివారం రాత్రి ఎక్స్‌లో చేసిన పోస్టులో ఇలా రాశారు. "అయ్యో... నేను నిజంగా కొన్నిసార్లు పేర్లు మర్చిపోతుంటాను."

    "జస్ప్రీత్ బుమ్రా గారు, జరిగిన పొరపాటుకు నేను క్షమాపణలు చెబుతున్నా. అంతమంది జనంలో, కార్యక్రమం ఉత్సాహంగా సాగుతున్న సమయంలో అనుకోకుండా జరిగిన మానవ తప్పిదమిది."

    "నాకు మీరంటే చాలా గౌరవం. మీ ఆటకు పెద్ద అభిమానిని. మీరు నిలకడగా రాణిస్తూ, బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపిస్తున్నప్పుడు ప్రతి భారతీయుడూ గర్వపడతాడు" అని రామ్ చరణ్ రాశారు.

  13. అబ్దుల్ రహీమ్: మరణశిక్ష తప్పించడానికి రూ.34 కోట్లు సేకరించి ఇచ్చారు, మరి సౌదీ జైలు నుంచి విడుదల ఎప్పుడు?

  14. కాక్రోచ్ జనతా పార్టీ: దీనిని స్థాపించిన అభిజిత్ దీపక్ నుంచి ఆయన తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు?

  15. తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. 12 ఫోటోల్లో..

  16. "భారత్‌కు ఎంత ఆయిల్ కావాలంటే అంత ఇవ్వడానికి మేం రెడీ", అమెరికా విదేశాంగ మంత్రి వ్యాఖ్యల ఆంతర్యమేంటి?

  17. ‘‘నా పిల్లలు అన్నం అడుగుతున్నారు, వారిని అమ్మేయడం తప్ప వేరే దారి లేదు’’

  18. పత్రికా స్వేచ్ఛకు కొలమానాలేంటి, భారత్‌లో మీడియా స్వేచ్ఛపై వివాదం దేనికి?

  19. వెజ్ బిర్యానిలో చికెన్ ముక్కలు, స్విగ్గీ యజమానికి నాన్ బెయిలబుల్ వారంట్

  20. హమ్జా బుర్హాన్‌: ‘టెర్రరిస్ట్‌’గా భారత్ ప్రకటించిన ఈయన్ను ముజఫరాబాద్‌లో కాల్చి చంపారు.. అసలెవరీయన?