సౌదీ అరేబియా: హజ్ యాత్రికుల సంఖ్య, వయసు పరిమితుల సడలింపు

ఫొటో సోర్స్, Getty Images
సౌదీ అరేబియా ఈ ఏడాది హజ్ యాత్రికుల సంఖ్య, వయస్సుకు సంబంధించిన పరిమితులను తొలగించింది.
"కోవిడ్ మహమ్మారికి ముందు ఎంతమంది హజ్ యాత్రికులకు అనుమతి ఉందో, 2023లో కూడా అంతమందికే ఉంటుంది, వయోపరిమితి లేదు" అని హజ్, ఉమ్రా వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రతి ఏడాది హజ్ యాత్రకు లక్షలాది ప్రజలు తరలివెళతారు. 2023లో ఈ యాత్ర జూన్‌లో జరగనుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇస్లాం చెప్పే ఐదు విధులలో హజ్ ఒకటి. మిగిలిన నాలుగు విధులు.. కల్మా, రోజా, నమాజ్, జకాత్.
శారీరక, ఆర్థిక సామర్థ్యం ఉన్న ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా ఈ విధిని నిర్వర్తించాలన్నది వారి మత విశ్వాసం.
గల్ఫ్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం, 2019లో సుమారు 25 లక్షల మంది హజ్ యాత్ర చేశారు. తరువాత రెండేళ్లలో కరోనా మహమ్మారి కారణంగా ప్రయాణికుల సంఖ్యపై పరిమితులు విధించారు. అలాగే యాత్ర చేసేవారి వయసుపై పరిమితి విధించారు. 65 ఏళ్ల లోపువారిని మాత్రమే అనుమతించారు.
2022లో సుమారు 9 లక్షల మంది యాత్రికులు హజ్‌కు వెళ్లారు. వారిలో 7 లక్షల 80 వేల మంది విదేశీయులు.
ఈ ఏడాది హజ్ యాత్రికుల సంఖ్య, వయసు పరిమితులను సడలించినట్లు సౌదీ ప్రభుత్వం తెలిపింది.




