You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

‘రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోండి’ - తెలంగాణ చీఫ్ సెక్రటరీకి కేంద్రం ఆదేశాలు

రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్‌ను ఆంధ్రాకు కేటాయించారు. కానీ ఆయన క్యాట్‌కి వెళ్లి తెలంగాణలో కొనసాగేలా ఆదేశాలు తెచ్చుకున్నారు. క్యాట్ తీర్పును హైకోర్టు తాజాగా పక్కన పెట్టేసింది.

లైవ్ కవరేజీ

  1. సౌదీ అరేబియా: హజ్ యాత్రికుల సంఖ్య, వయసు పరిమితుల సడలింపు

    సౌదీ అరేబియా ఈ ఏడాది హజ్ యాత్రికుల సంఖ్య, వయస్సుకు సంబంధించిన పరిమితులను తొలగించింది.

    "కోవిడ్ మహమ్మారికి ముందు ఎంతమంది హజ్ యాత్రికులకు అనుమతి ఉందో, 2023లో కూడా అంతమందికే ఉంటుంది, వయోపరిమితి లేదు" అని హజ్, ఉమ్రా వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

    ప్రతి ఏడాది హజ్ యాత్రకు లక్షలాది ప్రజలు తరలివెళతారు. 2023లో ఈ యాత్ర జూన్‌లో జరగనుంది.

    ఇస్లాం చెప్పే ఐదు విధులలో హజ్ ఒకటి. మిగిలిన నాలుగు విధులు.. కల్మా, రోజా, నమాజ్, జకాత్.

    శారీరక, ఆర్థిక సామర్థ్యం ఉన్న ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా ఈ విధిని నిర్వర్తించాలన్నది వారి మత విశ్వాసం.

    గల్ఫ్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం, 2019లో సుమారు 25 లక్షల మంది హజ్ యాత్ర చేశారు. తరువాత రెండేళ్లలో కరోనా మహమ్మారి కారణంగా ప్రయాణికుల సంఖ్యపై పరిమితులు విధించారు. అలాగే యాత్ర చేసేవారి వయసుపై పరిమితి విధించారు. 65 ఏళ్ల లోపువారిని మాత్రమే అనుమతించారు.

    2022లో సుమారు 9 లక్షల మంది యాత్రికులు హజ్‌కు వెళ్లారు. వారిలో 7 లక్షల 80 వేల మంది విదేశీయులు.

    ఈ ఏడాది హజ్ యాత్రికుల సంఖ్య, వయసు పరిమితులను సడలించినట్లు సౌదీ ప్రభుత్వం తెలిపింది.

  2. సొంత ప్రయోజనాలకే భారత్, సౌదీ, తుర్కియె మొగ్గు...అందుకే అగ్రరాజ్యానికి తలొగ్గడం లేదా?

  3. ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థలను తక్షణమే విభజించాలని సుప్రీంకోర్టులో పిటిషన్

    ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థలను తక్షణమే విభజించాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఇందులో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చింది.

    ఆ మేరకు కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

    ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనలో తీవ్ర ఆలస్యం అవుతోందని, ఈ షెడ్యూల్‌లో ఉన్న సంస్థల విలువ దాదాపు రూ.1,42,601 కోట్లు ఉంటుందని పిటిషన్‌లో పేర్కొంది.

    తెలంగాణలో సుమారు 91 శాతం సంస్థలున్నాయని, దానివల్ల లక్ష మందికిపైగా ఉద్యోగులు అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నారని, ఈ సంస్థల విభజన ఆలస్యం వల్ల ఏపీ నష్టపోతోందని తెలిపింది.

    విభజన అంశంలో తెలంగాణ స్పందించకపోవడం ఏపీ ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. తక్షణమే సంస్థల విభజనకు ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును కోరింది.

  4. వీడియో గేమ్‌లో వినాయకుడు ఎందుకు, ఏమిటీ కొత్త కల్చర్?

  5. కాంతార సినిమాకి రెండు ఆస్కార్ విభాగాల్లో ఎంట్రీ

    కాంతార సినిమాకి రెండు ఆస్కార్ విభాగాల్లో ఎంట్రీ లభించింది. ఆ సినిమాను ప్రొడ్యూస్ చేసిన హొంబాళె ఫిల్మ్స్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

    "కాంతార సినిమాకు రెండు ఆస్కార్‌ అర్హతలు లభించినందుకు ఆనందంగా ఉంది. మాకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. మీ ఆదరణతో ఇది మరింత ముందుకు వెళుతుందని ఆశిస్తున్నాం" అంటూ ట్వీట్ చేసింది.

    కాంతర సినిమా హీరో రిషభ్ షెట్టి కూడా ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

  6. సెక్స్, అధికారం, భయం....మన పురాణాలకు ప్రేరణ ఇచ్చింది ఇవేనా?

  7. సునామి హెచ్చరిక జారీ చేసిన ఇండోనేషియా

    ఇండోనేషియాలోని తానింబర్ దీవుల్లో స్థానిక సమయం తెల్లవారుజామున 3.00 గంటలకు 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.

    ఇది జరిగిన సుమారు గంటల తరువాత సునామి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయంటూ హెచ్చరిక జారీ చేసింది.

    అయితే, సముద్రమట్టంలో గణనీయమైన హెచ్చుతగ్గులు కనిపించలేదని డీడీ న్యూస్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.

  8. రాహుల్ గాంధీ: '21వ శతాబ్దపు కౌరవులు ఖాకీ నిక్కరు వేసుకుంటారు, శాఖలను విస్తరిస్తారు'

    భారత్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై విరుచుకుపడ్డారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను మహాభారతంలోని కౌరవులతో పోల్చారు.

    హరియాణాలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, "21వ శతాబ్దపు కౌరవులు ఖాకీ ప్యాంటు వేసుకుంటారు. చేతిలో లాఠీ పట్టుకుని తిరుగుతారు. శాఖలుగా విస్తరిస్తారు. దేశంలో ఇద్దరు ముగ్గురు కోటీశ్వరులు ఈ కౌరవులకు అండగా ఉంటారు" అని అన్నారు.

    నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలను విమర్శిస్తూ, ప్రధాని మోదీ ఒత్తిడిపై ఈ నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు.

    "నోట్ల రద్దు ఎవరు చేయించారు, ఎవరు తప్పుడు జీఎస్టీ వేస్తున్నారు.. దీన్ని మీరు అర్థం చేసుకోండి. నోట్ల రద్దు, తప్పుడు జీఎస్టీ వీటిపై మోదీ సంతకం చేశారు కానీ, ఆయన అధికారం ఉంది కాబట్టి అలా చేయలేదు. దేశంలోని ఇద్దరు ముగ్గురు కోట్వీశ్వరులు ప్రధాని చేత ఈ పనులు చేయిస్తున్నారు" అని అన్నారు.

    కొద్దిరోజుల క్రితం ప్రియాంక గాంధీ కూడా ఇదే విషయంపై వ్యాఖ్యానించారు.

    "అదానీ, అంబానీలు తన సోదరుడిని కొనలేరని" ఆమె అన్నారు.