You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఇరాన్: నిరసనకారులకు ఉరిశిక్షలు ఆపాలంటూ జైలు వెలుపల ఆందోళన

కరాజ్ నగరంలోని రజాయి షహర్ జైలు వెలుపల ఆదివారం రాత్రి నిరసనకారులు నినాదాలు చేస్తున్న వీడియోలను ప్రతిపక్ష ఉద్యమకారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

లైవ్ కవరేజీ

  1. సూర్యకుమార్‌, రాహుల్ ద్రవిడ్‌లు ఇలా మాట్లాడుకోవడం ఇంతకు ముందు చూసి ఉండరు.. అసలేం జరిగిందంటే..

  2. ఆంధ్రపదేశ్‌లో చలి చలి.. కొన్ని ప్రాంతాల్లో మంచు కురుస్తోంది

    ఆంధ్రప్రదేశ్‌లో చలిగాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు అతి తక్కువ స్థాయికి చేరుతున్నాయి. రాష్ట్రమంతా వీటి ప్రభావం కనిపిస్తోంది.

    అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉష్ణోగ్రత బాగా తగ్గుతోంది. ఆదివారం రాత్రి 1.5 డిగ్రీలకు చేరింది.

    లంబసింగి, పాడేరు వంటి ప్రాంతాల్లో చలికి జనం వణుకుతున్నారు. బాగా మంచు పడుతోంది. ఆరు బయట పార్క్ చేసి ఉన్న వాహనాలపై మంచు పేరుకుపోయి కనిపించింది.

    రాష్ట్ర వ్యాప్తంగా 18మండలాల్లో 10 డిగ్రీల సెల్సియస్ కి తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

    మరో మూడు రోజుల పాటు ఈ చలి గాలుల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబతున్నారు.

  3. బ్రెజిల్: పార్లమెంటును ముట్టడించిన మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మద్దతుదారులు

    బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు, మితవాద పార్టీకి చెందిన జైర్ బోల్సొనారో మద్దతుదారులు ఆదివారం బ్రెజిల్ పార్లమెంటు భవనం (కాంగ్రెస్)పై దాడి చేశారు. సుప్రీంకోర్టు, అధ్యక్షుడి నివాసాన్ని కూడా చుట్టుముట్టారు.

    బ్రెజిల్ జాతీయ రంగుల్లో దుస్తులు ధరించి, జెండాను చుట్టుకుని దాడి చేసిన ఆందోళకారులను అదుపుచేయడం పోలీసులకు కష్టమైంది.

    ఈ దాడి, రెండేళ్ల క్రితం అమెరికా పార్లమెంటు భవనంపై దాడిని గుర్తుచేస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

    ఆందోళకారుల్లో కొందరు సెనేట్ చాంబర్‌ను చుట్టుముట్టారు. కొందరు అధ్యక్షుడి భవనం, సుప్రీంకోర్టు, ప్రభుత్వ భవనాలపై దాడిచేశారు.

    అయితే, కాంగ్రెస్ భవనాన్ని తిరిగి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు.

    గత అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో బోల్సొనారో ఓటమిని జీర్ణించుకోలేని మద్దతుదారులు ఈ దాడికి పాలడ్డారు.

    గత ఎన్నికల్లో రైట్ వింగ్ పార్టీకి చెందిన బోల్సొనారోపై సోషలిస్ట్ పార్టీకి చెందిన లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా గెలుపొందారు. గతవారం బ్రెజిల్ అధ్యక్షుడిగా అయన ప్రమాణ స్వీకారం చేశారు.

    ఈ నేపథ్యంలో బోల్సొనారో మద్దతుదారులు బ్రెజిల్ పార్లమెంటు భవనంపై అధికారిక భవనాలపై దాడి చేశారు.

    వివిధ దేశాధినేతలు బ్రెజిల్ పార్లమెంటుపై దాడిని ఖండించారు.

    ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ బ్రెజిల్ ప్రభుత్వ భవనాలపై ఈ దాడిని ఖండించారు. బ్రెజిల్ ప్రజల అభిమతాన్ని, ప్రభుత్వ సంస్థలను గౌరవించాలని అన్నారు.

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ట్వీట్ చేస్తూ, "బ్రెజిల్‌లో ప్రజాస్వామ్యంపై, శాంతియుతంగ సాగిన అధికార మార్పిడిపై దాడిని ఖండిస్తున్నాను. బ్రెజిల్ ప్రజాస్వామ్యానికి మా పూర్తి మద్దతు ఉంటుంది. బ్రెజిల్ ప్రజల అభిమతాన్ని గౌరవించాలి. లూలా డ సిల్వాతో కలిసి పనిచేయడానికి మేం ఎదురుచూస్తున్నాం" అని అన్నారు.

    బ్రెజిల్ పార్లమెంటు, అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టులపై మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు దాడి చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.

    బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డ సిల్వాను ట్యాగ్ చేస్తూ, "బ్రెజిల్‌లో ప్రభుత్వ సంస్థలపై దాడి, విధ్వంసానికి సంబంధించిన వార్తలు కలతపెడుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అందరూ గౌరవించాలి. బ్రెజిల్ ప్రభుత్వానికి మేం పూర్తి మద్దతు తెలుపుతున్నాం" అని అన్నారు.