ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
గాయం కారణంగా క్రికెట్ మైదానానికి దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. భారత జట్టులోకి తిరిగివచ్చాడు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
దిల్లీలోని కంఝావాలాలో కొత్త సంవత్సరం రోజున కారు ఈడ్చుకెళ్లిన ఘటనలో మరణించిన 20 ఏళ్ల యువతి తల్లితో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు.
బాధిత కుటుంబానికి ఆయన రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి అన్నిరకాలుగా సాయం అందిస్తామని.. న్యాయం జరిగేలా చూస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
మరోవైపు మృతిచెందిన యువతి అంత్యక్రియలను పోలీస్ బందోబస్తు మధ్య మంగళవారమే నిర్వహిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, PA Media
గాయం కారణంగా క్రికెట్ మైదానానికి దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. భారత జట్టులోకి తిరిగివచ్చాడు.
ఈ నెల 10వ తేదీ నుంచి శ్రీలంకతో జరుగబోయే 3 మ్యాచ్‌ల వన్డే క్రికెట్ సిరీస్ జట్టులో బుమ్రాకు స్థానం ఇచ్చారు.
బుమ్రా ‘వీపు గాయం’ వల్ల గత ఏడాది సెప్టెంబర్ నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్ టోర్నమెంటులో కూడా ఆడలేకపోయాడు.
తాజాగా బుమ్రా ఆరోగ్యం ఫిట్‌గా ఉందని బీసీసీఐ నేషనల్ క్రికెట్ అకాడమీ ప్రకటించింది.
శ్రీలంకతో జరుగబోయే వన్డే సిరీస్‌లో భారత జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహిస్తాడు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా ఉంటాడు. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో భారత జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉన్నాడు.
శ్రీలంకతో తొలి వన్డే జవనరి 10న గౌహతిలో జరుగుతుంది. జనవరి 12వ తేదీన కోల్‌కతాలో రెండో వన్డే, జనవరి 15వ తేదీన తిరువనంతపురంలో మూడో వన్డే జరుగుతాయి.
భారత వన్డే జట్టు సభ్యులు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభం గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కె.ఎల్.రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమి, మొహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్.

ఫొటో సోర్స్, ANI
ఒడిశా తీర ప్రాంతంలో రష్యా పౌరుడి మృతదేహం లభ్యమైంది. మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు చెప్పారు.
గత 15 రోజుల్లో ఒడిశా తీరంలో చనిపోయిన మూడవ రష్యన్ పౌరుడు ఇతడు.
ఇంతకు ముందు ఒక ఎంపీ సహా ఇద్దరు మృతి చెందారు. వారి మరణాలపై గుట్టు ఇంకా విడలేదు.
మంగళవారం ఒడిశా తీరంలో చనిపోయిన వ్యక్తి పేరు మిల్యకోవ్ సెర్గీ అని పోలీసులు తెలిపారు.
జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని పారాదీప్ ఓడరేవులో నిలిచి ఉన్న ఒక ఓడలో సెర్గీ మృతదేహాన్ని కనొగొన్నారు. 51 ఏళ్ల సెర్గీ 'ఎంబీ అల్దనా షిప్'లో చీఫ్ ఇంజినీర్‌గా వ్యవహరించేవారు.
ఈ నౌక ముంబై నుంచి పారాదీప్ పోర్టు మీదుగా బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ పోర్టుకు వెళ్తోంది. ఉదయం 4.300 గంటలకు ఓడలోని తన ఛాంబర్‌లో సెర్గీ నేలకొరిగి కనిపించారని పీటీఐ తెలిపింది. ఆయన మరణానికి కారణాలను పోలీసులు ఇంకా నిర్థరించలేదు.
పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ పీఎల్ హరనంద్, రష్యా ఇంజనీర్ మరణాన్ని ధృవీకరిస్తూ, దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అంతకుముందు, డిసెంబర్ చివర్లో ఒడిశాలోని రాయగడ నగరంలో ఇద్దరు రష్యన్ పర్యటకులు అనుమానాస్పద స్థితిలో మరణించారు.
వీరిలో ఒకరు ఎంపీ పావెల్ ఆంటోవ్ (65 ఏళ్లు). ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను తీవ్రంగా విమర్శించారు. డిసెంబర్ 24న హోటల్ మూడో అంతస్తు నుంచి కిందపడి మరణించారు.
పావెల్ మరణానికి కేవలం రెండు రోజుల ముందు డిసెంబర్ 22న ఆయన స్నేహితుడు వ్లాదిమిర్ బిదేనోవ్ చనిపోయారు. ఈ రెండు కేసులను ఒడిశా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా ఫుట్‌బాల్ స్టార్ డామర్ హామ్లిన్ నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ మ్యాచ్ ఆడుతుండగా, ప్రత్యర్థి జట్టు ఆటగాడిని డీకొట్టి నేల మీద పడిపోయారు.
ఆయనకు కార్డియాక్ అరెస్ట్ వచ్చిందని, పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
24 ఏళ్ల హామ్లిన్ బఫెలో బిల్స్ టీం తరుపున ఆడుతున్నారు. సిన్సినాటి బెంగాల్స్‌తో మ్యాచ్ జరుగుతుండగా హామ్లిన్‌కు గుండెపోటు వచ్చింది. వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. మ్యాచ్‌ను నిలిపివేశారు.

ఫొటో సోర్స్, AP CMO/TWITTER
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ షో, సభలను నియంత్రించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
బహిరంగ సభలు, రోడ్ షోల వలన పలు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ప్రాణాంతక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అందులో పేర్కొంది.
ఇటీవల నెల్లూరు జిల్లా కందుకూరులో ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరమని, 'పోలీస్ యాక్ట్ 1861' కింద ఇకపై రోడ్ షోలు, సభలు, ర్యాలీలను రెగ్యులేట్ చేస్తామని తెలిపింది.

ఫొటో సోర్స్, AP GOVT
ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది.
రాష్ట్ర, జాతీయ రహదారులపై సభలకు అనుమతి ఇవ్వమని, పబ్లిక్ గ్రౌండ్లలో లేదా ప్రయివేటు ప్రదేశాలలో సభలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది.
కానీ, అరుదైన సందర్భాలలో, తగిన కారణాలను రాతపూర్వకంగా సమర్పిస్తే రోడ్లపై సభలకు అనుమతిని పరిశీలిస్తామని తెలిపింది.
అసాధారణ సందర్భాలలో రోడ్లపై సభకు అనుమతిస్తే, రోడ్డు వైశాల్యం, సభ వ్యవధి, వేదిక, బయటకు వెళ్లే మార్గాలు, హాజరయ్యే జనం, రద్దీని నియంత్రించే అంశాలలో మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించింది.

ఫొటో సోర్స్, ANI
టెన్నిస్ స్టార్ మార్టినా నవ్రతిలోవాకు గొంతు, రొమ్ము క్యాన్సర్ వచ్చింది. 66 ఏళ్ల మార్టినా అంతకుముందు కూడా క్యాన్సర్ బారిన పడ్డారు. ఆమెకు 53 ఏళ్ల వయసున్నప్పుడు 2010లో తొలిసారి క్యాన్సర్ వచ్చింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘‘ఒకేసారి రెండు రకాల క్యాన్సర్ బారిన పడటం తీవ్రంమైన విషయమే. కానీ, పరిష్కరించవచ్చు. దీని నుంచి త్వరగా బయటపడతానని ఆశిస్తున్నా. కొంత కాలం బాధపడాలి. కానీ, నేను ఈ వ్యాధిపై పోరాడతాను’’ అని డబ్ల్యూటీఏ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్టినా నవ్రతిలోవా తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
కంఝవాలా కేసులో దిల్లీ పోలీసులు మంగళవారం ఉదయం కొత్త సమాచారం అందించారు. మృతురాలు స్కూటీపై ఒంటరిగా లేరని తెలిపారు.
"మృతురాలిని ఈడ్చుకెళ్లిన మార్గాన్ని పరిశీలించినప్పుడు, ఆమె స్కూటీపై ఒంటరిగా లేరని తేలింది. ప్రమాదం జరిగిన సమయంలో మృతురాలితో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయికి గాయాలు అయ్యాయి. వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. మృతురాలి కాళ్లు కారులో ఇరుక్కుపోవడంతో కారు ఆమెను ఈడ్చుకెళ్లింది" అని దిల్లీ పోలీసులు వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
వాహనం మృతదేహాన్ని 'కొన్ని కిలోమీటర్లు' ఈడ్చుకెళ్లడం వల్ల తల, శరీరం వెనుక భాగం నుజ్జునుజ్జు అయిపోయిందని పోలీసులు తెలిపారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కేసుపై వివరంగా నివేదిక అందించాలని దిల్లీ పోలీసులను కోరారు. ఆ తరువాత స్పెషల్ కమిషనర్ షాలినీ సింగ్ అధ్యక్షతన ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసి, వీలైనంత త్వరగా దర్యాప్తు నివేదికను సిద్ధం చేయాలని కోరారు.

ఫొటో సోర్స్, ANI
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' మంగళవారం మరోసారి దిల్లీలోని కశ్మీర్ గేట్ నుంచి ప్రారంభం కానుంది.తరువాత ఈ యాత్ర ఘజియాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది.
పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో రాహుల్ గాంధీకి ఘనంగా స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం యూపీలోని వివిధ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు తరలివస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సహా 250 మంది అతిథులు కూడా వస్తున్నట్టు సమాచారం.
రాహుల్ గాంధీ పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లా మీదుగా మావి కలాన్ గ్రామానికి చేరుకుంటారని, అక్కడ రాత్రికి బస చేస్తారని పీటీఐ తెలిపింది.
ఈ యాత్ర బుధవారం ఉదయం మావి కలాన్ నుంచి ప్రారంభమై బారోట్‌కు చేరుకుంటుంది. బారోట్‌లోని ఛప్రౌలి చుంగిలో ఏర్పాటు చేస్తున్న సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. ఆ తరువాత యాత్ర షామ్లీ జిల్లాలోకి ప్రవేశిస్తుంది.
దక్షిణ భారతదేశంలోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన జోడో యాత్ర గత 108 రోజుల్లో తమిళనాడు, మహారాష్ట్ర మీదుగా 46 జిల్లాలు, తొమ్మిది రాష్ట్రాల గుండా సాగింది.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.