ఆంధ్రప్రదేశ్: గుంటూరు ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ కార్యక్రమంలో తొక్కిసలాట, ముగ్గురు మహిళలు మృతి

గుంటూరు నగరంలో ఆదివారం సాయంత్రం జరిగిన ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ వస్త్రాల పంపిణీలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. క్యాన్సర్‌ చివరి దశలో ఉన్న తండ్రి కోసం పెళ్లి కాకుండానే తల్లి అయిన కూతురు

  3. ప్రేమ-సెక్స్: 2022లో వచ్చిన కొత్త మార్పులు ఏంటి?

  4. చంద్రబాబు సభలో ముగ్గురికి పెరిగిన మృతుల సంఖ్య

    తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గుంటూరు సభలో మృతుల సంఖ్య మూడుకు పెరిగింది.

    ఆదివారం సాయంత్రం చంద్రన్న సంక్రాంతి కానుక సభలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు చనిపోయినట్లు గుంటూరు జిల్లా ఎస్‌పీ ఆరిఫ్ హఫీజ్ ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. ఆంధ్రప్రదేశ్: ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ కార్యక్రమంలో తొక్కిసలాట, ముగ్గురు మృతి, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    చంద్రబాబు గుంటూరు సభ

    ఫొటో సోర్స్, UGC

    తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్వహించిన బహిరంగ కార్యక్రమంలో మరోసారి విషాదం చోటు చేసుకుంది.

    ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో ఆదివారం సాయంత్రం జరిగిన ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ వస్త్రాల పంపిణీలో తొక్కిసలాట జరిగి ఒకరు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

    టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో వికాస్ నగర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తోపులాట జరిగి ఒక మహిళ చనిపోయారు.

    చంద్రబాబు గుంటూరు సభ

    ఫొటో సోర్స్, UGC

    చంద్రబాబు సభ అనంతరం చంద్రన్న సంక్రాంతి కానుకల కోసం జనం తోసుకురావటంతో ఈ తొక్కిసలాట జరిగింది. సభ నిర్వాహకులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    ఐదు రోజుల కిందట.. డిసెంబర్ 28వ తేదీ రాత్రి నెల్లూరు జిల్లాలోని కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో తోపులాట జరిగి 8 మంది మురుగు కాల్వలో పడి చనిపోయారు.

    చంద్రబాబు గుంటూరు సభ

    ఫొటో సోర్స్, UGC

  6. ఆనాటి కారు యాక్సిడెంట్‌లో ఓ క్రికెటర్ చనిపోయాడు, ప్రాణాలతో బయటపడ్డవారు ప్రపంచ ప్రఖ్యాత ఆల్‌రౌండర్స్ అయ్యారు

  7. క్యాథలిక్: చర్చిలో మతాధికారి హోదా కోసం మహిళల పోరాటం... ససేమిరా అంటున్న వాటికన్ వర్గాలు

  8. న్యూయార్క్ మహా నగరం ‘ఖాళీ’ అయిపోతోంది... ఎందుకు?

  9. ఇండియా: డిసెంబర్‌లో 8.30 శాతానికి పెరిగిన నిరుద్యోగం.. 16 నెలల్లో గరిష్టం

    నిరుద్యోగం

    ఫొటో సోర్స్, Getty Images

    భారతదేశంలో డిసెంబర్ నెలలో నిరుద్యోగిత 8.30 శాతానికి పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సీఎంఐఈ) గణాంకాలు చెప్తున్నాయి.

    ఇది 16 నెలల గరిష్ట రికార్డు స్థాయి అని సీఎంఐఈ పేర్కొంది. నవంబర్ నెలలో దేశంలో నిరుద్యోగిత రేటు 8 శాతంగా ఉంది.

    అలాగే నవంబర్ నెలలో పట్టణ నిరుద్యోగిత రేటు 8.96 శాతంగా ఉండగా.. డిసెంబర్ నెలలో అది 10.09 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో గ్రామీణ నిరుద్యోగిత రేటులో కాస్త తగ్గుదల నమోదైంది.

    నవంబర్ నెలలో గ్రామీణ నిరుద్యోగిత రేటు 7.55 శాతంగా ఉండగా, డిసెంబర్ నెలలో అది 7.44 శాతానికి తగ్గింది.

    అయితే ఈ నిరుద్యోగిత రేటు గణాంకాలు కనిపిస్తున్నంత తీవ్రంగా లేవని సీఎంఐఈ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ వ్యాస్ పేర్కొన్నారు. శ్రామిక శక్తి భాగస్వామ్యం రేటు డిసెంబర్ నెలలో 40.48 శాతానికి పెరిగిందని, 12 నెలల్లో ఇది గరిష్ట స్థాయి రికార్డు అని ఆయన చెప్పారు.

    ‘‘చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే.. డిసెంబర్‌లో ఉద్యోగకల్పన రేటు 37.1 శాతానికి పెరిగింది. 2022 జనవరి నుంచి చూస్తే ఇది రికార్డు స్థాయి’’ అని ఆయన తెలిపారు.

  10. ఈ బామ్మ నెల ఆదాయం రూ.11 లక్షలు

  11. ఇండియా వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి

    అంతర్జాతీయ ప్రయాణికులకు ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి

    ఫొటో సోర్స్, ANI

    సింగపూర్ సహా 5 దేశాలనుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష రిపోర్ట్‌ను తప్పనిసరి చేసింది.

    విమానశ్రయాల్లో చెకింగ్‌ను కట్టుదిట్టం చేసింది.

    ‘‘తప్పనిసరిగా ఎయిర్‌ సువిధా ఫామ్‌ను నింపాల్సి ఉంది. ఆర్‌టీ-పీసీఆర్ టెస్టు నెగిటివ్ రిపోర్టును సమర్పించాలి’’ అని అధికారులు తమను అడిగారని సింగపూర్ నుంచి దిల్లీ విమానశ్రయానికి వచ్చిన ఒక ప్రయాణికుడు తెలిపాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. కమర్షియల్ సిలిండర్ ధర పెంపు

    పెరిగిన సిలిండర్ ధర

    ఫొటో సోర్స్, ANI

    వాణిజ్యపరంగా వాడే ఎల్‌పీజీ సిలిండర్ ధర పెరిగింది. ఒక్కో సిలిండర్‌పై ధర రూ.25 పెంచారు.

    పెరిగిన ధర నేటి నుంచే అమల్లోకి వచ్చింది.

    ఈ పెంపుతో దేశ రాజధాని దిల్లీలో ఒక్కో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,769కు చేరుకుంది.

    గృహ అవసరాలకు వాడే ఎల్‌పీజీ సిలిండర్ ధర మాత్రం పెరగలేదు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. గోదావరి నది సముద్రంలో కలిసే చోట 'అన్నాచెల్లెళ్ల గట్టు'ను చూశారా?

  14. పాకిస్తాన్ సినిమా మౌలా జాట్ భారత్‌లో ఎందుకు విడుదల కాలేదు?

  15. లారీ నుంచి ఆటోపై పడ్డ భారీ గ్రానైట్ రాళ్లు..ముగ్గురు మృతి

    ఆటోపై పడ్డ భారీ గ్రానైట్ రాళ్లు

    మహబూబాబాద్ జిల్లా కురవి సమీపంలో శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో లారీ నుంచి భారీ గ్రానైట్ రాళ్లు పక్కగా వెళ్తున్న ప్రయాణికుల ఆటోపై పడ్డాయి.

    ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

    గాయపడ్డ వారిని మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

    కాట్రపల్లి గ్రానైట్ క్వారీ నుండి ఖమ్మం వైపు వెళ్తున్న గ్రానైట్ వాహనం కురవి పోలీస్ స్టేషన్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది.

    దీంతో భారీ గ్రానైట్ రాళ్లు ఆటోపై పడటంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

    మరో ఇద్దరిని అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు.

    ప్రమాదంలో మరణించిన ముగ్గురూ ఆటోడ్రైవర్లుగా పనిచేస్తున్నారు.

    కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి మంగోలి గూడెం గ్రామం నుంచి కురవికి ఆటోలో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

    భారీ గ్రానైట్ రాళ్లు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో క్రేన్‌ల సహాయంతో వాటిని తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

    పరిమితికి మించిన లోడుతో వెళ్తున్నందున వాహనం అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

  16. పాకిస్తాన్ ఆర్ధికంగా దివాలా తీస్తుందా, చేతిలో డాలర్లున్నా ఖర్చు చేయలేని స్థితిలో ఎందుకు పడింది?

  17. దిల్లీ: సీనియర్ సిటిజన్ కేర్ హోమ్‌లో అగ్ని ప్రమాదం, ఇద్దరు మృతి

    అగ్ని ప్రమాదం

    ఫొటో సోర్స్, ANI

    గ్రేటర్ కైలాశ్ 2, బ్లాక్ ‘ఈ’లో ఉన్న సీనియర్ సిటిజన్ కేర్ హోమ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది.

    ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు.

    ఆరుగుర్ని ఈ మంటల బారి నుంచి రక్షించారు.

    ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, పోలీసులు అక్కడికి వెళ్లి సహాయక చర్యలు ప్రారంభించారు.

    ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్టు దిల్లీ ఫైర్ సర్వీసు తెలిపింది.

    ప్రమాదానికి గల కారణాలను కనుగొంటున్నట్టు పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  18. చైనా ప్రయాణికులపై కోవిడ్ ఆంక్షలు విధించిన కెనడా

    చైనా ప్రయాణికులపై కోవిడ్ ఆంక్షలు విధించిన కెనడా

    ఫొటో సోర్స్, ANI

    చైనా, హాంకాంగ్, మకావుల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు కరోనా పరీక్షలను తప్పనిసరి చేసింది కెనడా.

    దీంతో ఈ పరీక్షలను తప్పనిసరి చేసిన దేశాల జాబితాల్లో కెనడా కూడా చేరింది.

    కఠినతరమైన జీరో-కోవిడ్ పాలసీ నుంచి చైనా వెనక్కి తగ్గడంతో ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది.

    ఈ నేపథ్యంలో, చైనా, హాంకాంగ్, మకావుల నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ పరీక్షలను తప్పనిసరి చేసినట్టు కెనడియన్ టీవీ నెట్‌వర్క్ సీటీవీ తెలిపింది.

    ఈ కొత్త నిబంధనలు జనవరి 5 నుంచి అమల్లోకి రానున్నాయని కెనడా ప్రభుత్వం తెలిపింది.

    రెండేళ్లు, లేదా అంతకంటే పెద్ద వయసు కలిగిన ప్రయాణికులందరూ కూడా కెనడాలో ఉండేందుకు వచ్చే సమయంలో నెగిటివ్ టెస్ట్ రిపోర్టును చూపించాల్సి ఉంటుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  19. దిల్లీలో అర్ధరాత్రి భూ ప్రకంపనలు, రిక్టర్ స్కేలుపై 3.8 గా నమోదు.

    దిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూకంపం

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, దిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూకంపం

    కొత్త సంవత్సరం తొలి రోజే దిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూకంపం వచ్చింది.

    రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.8గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ(ఎన్‌సీఎస్) తెలిపింది.

    01-01-2023న అర్థరాత్రి 1.19 గంటలకు 3.8 తీవ్రతతో భూకంపం వచ్చింది.

    భూ ఉపరితలానికి 5 కి.మీ లోపల ఈ భూకంపాన్ని గుర్తించినట్టు తెలిపింది.

    హరియాణాలోని జజ్జర్ ప్రాంతంలో ఈ ప్రకంపనల కేంద్రం ఉన్నట్లు సెస్మాలజీ విభాగం వెల్లడించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  20. నేషనల్ హైవేలపై డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలు ఇవే....